// // Dil Raju Shares Unknown Incident Happened With Prabhas: ప్రభాస్ నాకు ఆటిట్యూడ్ ఎక్కువ అనుకున్నాడు- దిల్ రాజు -->
E-Paper
Advertisement

Dil Raju: నాకు ఆటిట్యూడ్ ఎక్కువ.. ప్రభాస్ అయితే.. వీడెవడు అని ముఖం మీదే చెప్పాడు

Dil Raju: నాకు ఆటిట్యూడ్ ఎక్కువ.. ప్రభాస్ అయితే.. వీడెవడు అని ముఖం మీదే చెప్పాడు
Advertisement

Dil Raju: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ లిస్ట్ తీస్తే.. మొదటి పేరు దిల్ రాజు ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టిన దిల్ రాజు.. దిల్ సినిమాకు నిర్మాతగా మారి.. హిట్ కొట్టి అదే సినిమాను ఇంటిపేరుగా మార్చుకున్నాడు. ఆ తరువాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ ఏ సినిమా ఆడాలి అన్న అది దిల్ రాజు నిర్ణయించాల్సిందే. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలన్నీ దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచే రానున్నాయి. అందులో ఒకటి ది ఫ్యామిలీ స్టార్.

Advertisement

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 5 న ఈ సినిమా అన్ని భాషల్లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచిన మేకర్స్ అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు పెట్టి సినిమాపై హైప్ ను పెంచేస్తున్నారు. తాజాగా ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. ఈ సమావేశంలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు. రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం చెప్పుకొచ్చారు.

ఇక ఈ మీడియా సమావేశంలో దిల్ రాజు తన ఆటిట్యూడ్ గురించి మాట్లాడాడు. “నన్ను కూడా బిగినింగ్ డేస్ లో చాలా ఆటిట్యూడ్ ఉందనుకొనేవారు. అలా అనుకుంటున్నారని నాకెప్పుడు తెలిసింది అంటే.. ప్రభాస్ చెప్పాడు ఒకరోజు.. వీడేంటి.. అలా చూస్తాడు.. ఇలా చూస్తాడు.. వీడెవడు రా బాబు అనుకునేవాడిని భయ్యా మొదట్లో అన్నాడు. అంటే నాతో క్లోజ్ అయ్యేవరకు ప్రభాస్ ఆ ఫీలింగ్ లో ఉన్నాడు. ఆర్య సినిమా అయిపోయి మున్నా సినిమా కథ గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ, నా గురించి అర్ధం కాలేదు. ఏదైనా చూసే విధానం. నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటానో నాకు తెలియదు.. చూసే వాళ్లకు అది ఆటిట్యూడ్ లా కనిపిస్తుంది” అని చెప్పుకొచ్చాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×