// // Big TV Exclusive : SDT 18 రిలీజ్ డేట్ ఫైనల్... -->
E-Paper
Advertisement

Big TV Exclusive : SDT 18 రిలీజ్ డేట్ ఫైనల్… వచ్చే ఏడాది కర్చీఫ్ ఎప్పుడు వేశారంటే..?

Big TV Exclusive : SDT 18 రిలీజ్ డేట్ ఫైనల్… వచ్చే ఏడాది కర్చీఫ్ ఎప్పుడు వేశారంటే..?
Advertisement

SDT 18 : మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న కొత్త చిత్రం ఫస్ట్ లుక్ ని తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సాయి తేజ్ బీస్ట్ లుక్ లో కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా ఫస్ట్ గురించే టాక్ నడుస్తుండగా, మూవీ రిలీజ్ డేట్ లీక్ అయ్యింది. మరి సాయి దుర్గ తేజ్ నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఏ రోజు రిలీజ్ కాబోతోంది? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.

బీస్ట్ లుక్ లో షాక్ ఇచ్చిన సాయి దుర్గ తేజ్

Advertisement

‘విరూపాక్ష’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ‘బ్రో’ మూవీతో డిజాస్టర్ అందుకున్న సాయి తేజ్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాకు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తుండగా, ‘హనుమాన్’ వంటి పాన్ ఇండియా సినిమాని నిర్మించిన నిర్మాతలు కే నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాకు SDT18 అనే వర్కింగ్ టైటిల్ లో పెట్టారు. తాజాగా సాయి దుర్గ తేజ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. వీడియోలో భారీ సెట్లను నిర్మించినట్లుగా చూపించడంతో పాటు ఈ సినిమా కోసం సాయి దుర్గ తేజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆశ్చర్య పరిచే విధంగా ఉంది. అంతేకాకుండా విజువల్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయనే విషయం అర్థమవుతుంది. రీసెంట్ గా 15 రోజులపాటు యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని యాక్షన్ సీక్వెన్స్ లో సాయి తేజ కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో సాయి తేజ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేయునన్నారు. ఇప్పటికైతే సాయి తేజ్ బీస్ట్ లుక్ చూసి పండగ చేసుకుంటున్నారు మెగా ఫాన్స్.

రిలీజ్ డేట్ లీక్…

Advertisement

అయితే మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ లుక్ ను మాత్రమే రిలీజ్ చేస్తూ సాయి దుర్గ తేజకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను మేకర్స్ ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో ముందుగానే మేకర్స్ రిలీజ్ డేట్ లపై కర్చీఫ్ వేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సాయి తేజ్ నటిస్తున్న ఈ కొత్త పాన్ ఇండియా సినిమాకు 2025 ఆగస్టు 15గా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వెలువడుతుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×