// // Naga Chaitanya - నాగచైతన్య ట్విటర్ అకౌంట్ హ్యాక్.. అదేంటి అలా పోస్ట్ చేశాడు? -->
E-Paper
Advertisement

Naga Chaitanya: నాగచైతన్య ట్విటర్ అకౌంట్ హ్యాక్.. అదేంటి అలా పోస్ట్ చేశాడు?

Naga Chaitanya: నాగచైతన్య ట్విటర్ అకౌంట్ హ్యాక్.. అదేంటి అలా పోస్ట్ చేశాడు?
Advertisement

Naga Chaitanya Twitter: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా సమంత, నాగచైతన్య, నాగార్జున, అక్కినేని ఫ్యామిలీ.. వీరి గురించే చర్చలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ లీడర్ కొండా సురేఖ పెట్టిన చిచ్చు వల్ల అటు రాజకీయాల్లో, ఇటు ఇండస్ట్రీలో సమంత, నాగచైతన్య విడాకుల గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంపై కేవలం వీరిద్దరూ మాత్రమే కాదు.. అక్కినేని ఫ్యామిలీ మొత్తం రియాక్ట్ అయ్యింది. వీరికి సపోర్ట్ చేయడం కోసం ఇండస్ట్రీ అంతా ఒక్కటయ్యింది. తాజాగా నాగార్జున, నాగచైతన్య.. కొండా సురేఖపై పరువునష్టం దావా వేసి కోర్టుకు కూడా వెళ్లారు. ఇంతలోనే నాగచైతన్య చేసిన ట్విటర్ పోస్ట్.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కొండా సురేఖ వివాదం

Advertisement

నాగచైతన్య, సమంత అసలు ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే విషయం ఎవరికీ క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియా ద్వారా వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి ఆ తర్వాత చట్టపరంగా విడిపోయారు కూడా. ఇన్నేళ్ల తర్వాత నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అని, ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండడం కోసం సమంతను తన దగ్గరకు పంపమని నాగార్జునను కేటీఆర్ అడిగారని, అందుకే విడాకులు అయ్యాయని కొండా సురేఖ ఆరోపించారు. దీంతో నాగార్జున సీరియస్ అయ్యారు. దానిపై నాగచైతన్య కూడా ట్విటర్‌లో రియాక్ట్ అయ్యాడు. ఈ విషయం ఇంకా ప్రేక్షకులు మర్చిపోక ముందే చైతూ చేసిన మరో ట్వీట్ వైరల్ అవుతోంది.

Also Read: నయన్ కొత్త వివాదం… ఆమె పిల్లల ఖర్చులు కూడా నిర్మాతలే భరించాలా?

Advertisement

ఫ్రీగా ఇస్తా

‘‘నేను 2013లో 50 డాలర్లు పెట్టి 100 బీటీసీ కొన్నాను. ఇప్పుడు దాని విలువ 6 మిలియన్ డాలర్లు. దానిని నేను ఫ్రీగా ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. మీరేమంటారు?’’ అంటూ నాగచైతన్య ట్వీట్ చేశాడు. ఒకవైపు తన కుటుంబంపై తీవ్ర ఆరోపణలు వస్తుండగా.. మరోవైపు నాగచైతన్య సంబంధం లేకుండా ఇలా ట్వీట్ చేయడమేంటి అని ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే తన అకౌంట్ హ్యాక్ అయ్యిందని భావిస్తున్నారు. హ్యాక్ అవ్వకుండా చైతూ.. ఇలాంటి సమయంలో ఇలా సంబంధం లేని ఫన్నీ ట్వీట్ చేయడని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

యాక్టివ్ వ్యక్తి కాదు

నాగచైతన్య సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే వ్యక్తి కాదు. తన సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా సోషల్ మీడియాలో చేయడానికి ఎక్కువగా ఇష్టపడడు చైతూ. సమంతతో పెళ్లయిన తర్వాత అప్పుడప్పుడు వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేయడానికి మాత్రమే సోషల్ మీడియాను ఉపయోగించేవాడు. విడాకుల తర్వాత చాలాకాలం అసలు ఇన్‌స్టాగ్రామ్ జోలికి పోలేదు. ఇప్పుడిప్పుడే తన ట్రిప్స్‌కు, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన పోస్టులు వేస్తూ ఫాలోవర్స్‌ను హ్యాపీ చేస్తున్నాడు. అలాంటి చైతూ.. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి సమయంలో ఒక బీటీసీ గురించి ట్వీట్ చేయడం కామన్ కాదని, కచ్చితంగా తన ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని నెటిజన్లు కామెంట్లు చేస్తన్నారు. ఈ అకౌంట్ హ్యాక్ విషయంపై నాగచైతన్య ఇంకా స్పందించాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×