// // Appudo Ippudo Eppudo : 'పెన్' డ్రైవ్ కష్టాలు.. రిలీజైతే పెద్ద దెబ్బే -->
E-Paper
Advertisement

Appudo Ippudo Eppudo : ‘పెన్’ డ్రైవ్ కోసం నిఖిల్ అంత కష్టపడ్డాడా.. ఈ మూవీ రిలీజైతే పెద్ద దెబ్బే

Appudo Ippudo Eppudo : ‘పెన్’ డ్రైవ్ కోసం నిఖిల్ అంత కష్టపడ్డాడా.. ఈ మూవీ రిలీజైతే పెద్ద దెబ్బే
Advertisement

Appudo Ippudo Eppudo : యంగ్ స్టార్ నిఖిల్ హీరోగా నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే సినిమా తాజాగా రిలీజ్ కి సిద్ధమై టాలీవుడ్ మూవీ లవర్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ ఈ సినిమా గనక రిలీజ్ అయితే నిఖిల్ కెరీర్ పై పెద్ద దెబ్బే పడుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. పైగా ఈ మూవీ స్టోరీ లైన్ బయటకు రావడంతో నిజంగానే సినిమా ఎఫెక్ట్ హీరో, డైరెక్టర్ కి మైనస్ కావచ్చు అని అంటున్నారు. అసలు ఈ సినిమాలో ఏముంది? ఎప్పుడు ఈ మూవీ షూటింగ్ జరిగింది ? ఇంత సడన్ గా ఈ మూవీ రిలీజ్ ను ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు? అనే విషయాలను చూసేద్దాం పదండి.

మూడేళ్ళ క్రితమే షూటింగ్

Advertisement

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ లో నటించిన సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, రుక్మిణి వసంత్, దివ్యాంశ హీరోయిన్లుగా నటించారు. తాజాగా దీపావళి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఓ స్పెషల్ పోస్టర్ ను షేర్ చేస్తూ సడన్ గా మేకర్స్ రిలీజ్ డేట్ తో సర్ప్రైజ్ ఇవ్వడంతో మూవీ లవర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు ఈ మూవీ షూటింగ్ గురించి ఇప్పటిదాకా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. పైగా సడన్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ఏంటి అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎస్విసిసి బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా షూటింగ్ మూడేళ్ళ కిందటే జరిగినట్టుగా తెలుస్తోంది.

అసలు విషయంలోకి వెళ్తే.. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీ షూటింగ్ లండన్ లో మూడేళ్ళ కిందటే జరిగింది. అంటే ‘కార్తికేయ 2’ మూవీ రిలీజ్ కి ముందు ఈ సినిమాను అనుకున్నారు. నిఖిల్ కార్తికేయ 2 మూవీతో ఫ్యాన్ ఇండియా హీరోగా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఇప్పుడు పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇలాంటి తరుణంలో అప్పుడెప్పుడో చేసిన అవుట్ డేటెడ్ స్టోరీ మూవీ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఇప్పుడు రిలీజ్ అయితే పాన్ ఇండియా స్టార్ గా నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్న నిఖిల్ పై గట్టి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. పూర్తిగా లండన్ లోనే చిత్రీకరించిన ఈ సినిమా మొత్తం ఒక పెన్ డ్రైవ్ గురించే ఉంటుందని తెలుస్తోంది. ఇది ఒక సోది సినిమా అని, రిలీజ్ అయితే హీరోకు, దర్శకుడికి ఇద్దరికీ మైనస్ అవుతుందని అంటున్నారు.

Advertisement

ప్రమోషన్లకు నిఖిల్ దూరం 

కాగా నిన్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ కాగా నిఖిల్ మాత్రం మూవీ గురించి ఇప్పటిదాకా రెస్పాండ్ కాలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఈ మూవీ గురించి ప్రస్తావించలేదు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచార్య దర్శకత్వంలో ‘స్వయంభు’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో నభా నటేష్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, ఈ మూవీ ఇంకా షూటింగ్ దశలో ఉంది. ఇక రీసెంట్ గా ‘కార్తికేయ 3’ మూవీ కూడా రాబోతోందని, దాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తామని చెప్పారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×