E-Paper
Advertisement

Hyderabad Accident: కాచిగూడ ఫ్లైఓవర్‌పై యాక్సిడెంట్.. డివైడర్‌ని ఢీకొన్న బైక్, ఆపై స్పాట్‌లో

Hyderabad Accident: కాచిగూడ ఫ్లైఓవర్‌పై యాక్సిడెంట్..  డివైడర్‌ని ఢీకొన్న బైక్, ఆపై స్పాట్‌లో
Advertisement

Hyderabad Accident: అతివేగం ప్రమాదకరం.. హైదరాబాద్ సిటీలో పదే పదే సిగ్నల్ పాయింట్ వద్ద పోలీసుల అనౌన్స్మెంట్. అయినా యువత ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వేగంగా ఇంటికి చేరుకోవాలని ఆలోచనతో ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా కాచిగూడ ఫ్లైఓవర్ పై అలాంటి ఘటన జరిగింది.

కాచిగూడ ఫ్లైఓవర్‌పై యాక్సిడెంట్

Advertisement

ఆదివారం అర్థరాత్రి హైదరాబాద్ సిటీలోని కాచిగూడ ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాత్రి సుమారు 12 గంటల సమయంలో కాచిగూడ నుంచి అంబర్‌పేట్ వైపు వెళ్తున్న ఓ బైక్, వేగంగా వచ్చి ఫ్లై ఓవర్‌పై డివైడర్‌ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఫ్లైఓవర్ పైనుంచి వాహనదారులు ఎగిరి కిందపడ్డాడు. ఈ ఘటనలో అతడి హెల్మెట్ పక్కకు పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.

బైకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈలోగా అంబులెన్సు వచ్చాయి. ఐనప్పటికీ ఫలితం లేకపోయింది. పోస్టుమార్టం నిమిత్తం డెడ్‌‌బాడీని ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు మొదలుపెట్టారు.

Advertisement

డివైడర్‌ని ఢీకొన్న బైక్, ఆపై స్పాట్‌లో

వాహనం నెంబర్ ప్లేట్ ఆధారంగా బైకర్ వివరాలు ఆరా తీస్తున్నారు.  మృతుడి ఫోన్ నెంబర్‌కి వచ్చిన కాల్స్ ఆధారంగా వివరాలు సేకరించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

మరోవైపు నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ వస్తున్న డీసీఎం వ్యాన్, నల్గొండ చౌరస్తా రోడ్డు క్రాస్ చేస్తుండగా అదుపు తప్పింది. ఆ తర్వాత దుకాణాల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నార్కట్ పల్లికి చెందిన అభిరామ్ స్పాట్‌లో మృతి చెందాడు.

ALSO READ:  ఘోర రోడ్డు ప్రమాదం, స్పాట్‌లో ఇద్దరు మృతి

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×