E-Paper
Advertisement

కిల్లర్‌ను పట్టించిన హూడీ.. బిజినెస్‌మేన్ కేతన్ హత్య కేసును ఎలా ఛేదించారంటే?

కిల్లర్‌ను పట్టించిన హూడీ.. బిజినెస్‌మేన్ కేతన్ హత్య కేసును ఎలా ఛేదించారంటే?
Advertisement

Ketan Agarwal Murder case: యంగ్ బిజినెస్‌మేన్ కేతన్‌ అగర్వాల్‌ హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత బలమైన గాలి వల్ల లోయలో పడి మృతి చెందినట్లుగా భావించినా, తర్వాత సీసీటీవీ దృశ్యాలు కీలకంగా మారాయి.కేతన్‌- కాబోయే భార్య సియా గోయల్ వెళ్లిన దారిలో ముసుగు టీ షర్ట్‌ ధరించిన వ్యక్తి (హూడీ) వారిని అనుసరించడాన్ని గుర్తించారు పోలీసులు. ఆ వ్యక్తి సియా లవరేనని అంచనాకు వచ్చారు.

పూణె యంగ్ బిజినెస్‌మేన్ కేతన్ హత్య‌ కేసులో షాకింగ్ విషయాలు

Advertisement

జూన్ 19న సియా గోయల్ పుట్టినరోజు కావడంతో ఒక్కరోజు ముందుగానే 18న లోహ్‌గఢ్‌ కోటకు వెళ్లారు కేతన్ అగర్వాల్- కాబోయే భార్య సియా గోయల్. అప్పటికే ఆ ప్రాంతంలో ఎండలు దంచి కాస్తున్నాయి. దాదాపు 33 డిగ్రీల వాతావరణంలో ఓ వ్యక్తి హుడీ ధరించడం పలు అనుమానాలకు దారి తీసింది. సియాకు ముసుగు వీరుడు తెలిసి ఉండొచ్చన్న అనుమానంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

కేతన్- సియాలు వెళ్తుండగా హూడీ ధరించిన వ్యక్తి పలుమార్లు కనిపించాడు. ట్రెక్కింగ్ రావడానికి గత కారణాలపై పోలీసులు మరింత లోతుగా ఆరాతీశారు. లోహ్‌గఢ్‌ కోటకు తీసుకెళ్లాలని సియా పలుమార్లు కోరినట్టు కేతన్ సోదరి పోలీసులకు చెప్పింది. దీంతో కేతన్ ఫ్యామిలీ సభ్యుల నుంచి మరికొన్ని విషయాలు సేకరించారు.

Advertisement

సీన్‌లోకి సియా ప్రియుడు చేతన్..  కిల్లర్‌ని పట్టించిన హూడీ

మే 31న ఇద్దరు లోహ్‌గఢ్‌ ఫోర్ట్‌కు వెళ్లారు. జూన్ నాలుగున అక్కడికి తీసుకెళ్లమని సియా కోరినట్టు పోలీసులకు తెలిపారు. అందుకు కేతన్ తల్లి ససేమిరా చెప్పింది. ప్రివెడ్డింగ్ షూట్‌లో భాగంగా తొలుత ఇండోనేషియాలోని బాలికి వెళ్లకముందే కేతన్‌ అడ్డు తొలగించుకోవాలని భావించిందట సియా. అయితే పాస్‌పోర్ట్‌ కనిపించపోవడంతో ఆ ట్రిప్ కాస్త వాయిదా పడింది. అక్కడి నుంచి సీన్ మళ్లీ లోహ్‌గఢ్ కోటకు మారింది.

జూన్ 14న ఇద్దరూ కలిసి పోర్టుకు వెళ్లారు. పైనుంచి కేతన్‌ను కాబోయే భార్య తోసింది. ఆ సమయంలో ఓ పొదను పట్టుకొని బతికిపోయాడు. ఎందుకు తోశావని ప్రశ్నిస్తే పాము కనిపించడంతో కాటువేయకుండా  తోశానని చెప్పడంతో కేతన్ నమ్మేశాడని మృతుడి తండ్రి విశాల్ వెల్లడించారు. రెండోసారి మాత్రం సియా ప్లాన్ ఫెయిల్ కాలేదు.

సరిగ్గా జూన్ 18న కేతన్‌ను లోయలోకి సియా తోయడంతో ప్రాణాలు కోల్పోయాడు. కేతన్‌కు ఎత్తైన ప్రదేశాలంటే భయమని, ఈ విషయాన్ని తనకు అనుకూలంగా మలచుకుని ఫోర్ట్‌కు తీసుకెళ్లింది సియా. ఘటన తర్వాత పోలీసుల విచారణలో పుట్టినరోజు సందర్భంగా ట్రెక్కింగ్‌కు వచ్చామని ఫొటోలు తీస్తుండగా లోయలో కేతన్ పడిపోయాడని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది సియా గోయల్.

ALSO READ: పూణె యంగ్ బిజినెస్‌మేన్ మృతి కేసు.. కాబోయే భార్య పక్కాగా ప్లాన్ చేసింది

ఆ తర్వాత కేసు విచారణలో భాగంగా ఆమెని లోతుగా విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆమె కాల్ రికార్డింగ్‌ను పరిశీలించారు.  సియా- ఆమె ప్రియుడు చేతన్ చౌదరి మధ్య దాదాపు 2004 కాల్స్ సంభాషణ సాగింది. వీరిద్దరు సుమారు 238 గంటలపాటు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. దాని ఆధారంగా వీరిద్దరి మధ్య బంధాన్ని నిర్ధారించుకున్నారు పోలీసులు.

ఫోర్టు వద్ద అక్కడ లభించిన సీపీటీవీ ఫుటేజ్‌లో ప్రతీ వ్యక్తిని పరిశీలించడంతో హూడీ వ్యక్తి బయటపడ్డాడు. సియా గోయల్ లవర్ అతడేనని ఓ అంచనాకు వచ్చారు పోలీసులు. ఆ వ్యక్తి పేరు కేతన్ చౌదరి, వయస్సు 22 ఏళ్లు. సోషల్ మీడియా ద్వారా చేతన్ యాక్టివిటీని పరిశీలించారు.

హుడీ ధరించిన వ్యక్తి-చేతన్ ఫోటోలను పోల్చి చూడడంతో ఆ వ్యక్తేనని గుర్తించారు. సియా-ఆమె ప్రియుడు చేతన్‌ కలిసి కేతన్‌ అగర్వాల్‌ను లోయలోకి తోసి దాన్ని ప్రమాదంగా చిత్రీకరించినట్టు తేలింది. చివరకు సియా, ఆమె లవర్ చేతన్ చౌదరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×