E-Paper
Advertisement

లారీని ఢీ కొట్టిన తుఫాను వాహనం.. స్పాట్‌లో నలుగురు మృతి,మాచర్లలో ఘోర ప్రమాదం, మృతులు హైదరాబాద్‌కు

లారీని ఢీ కొట్టిన తుఫాను వాహనం.. స్పాట్‌లో నలుగురు మృతి,మాచర్లలో ఘోర ప్రమాదం, మృతులు హైదరాబాద్‌కు
Advertisement

Road Accident: పల్నాడు జిల్లాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆడివున్న లారీని తుఫాను వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. గాయపడిన క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు హైదరాబాద్‌కు చెందినవారు.

పల్నాడు జిల్లా మాచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

పల్నాడు జిల్లా మాచర్ల నగరవనం వద్ద శుక్రవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వెనుక నుంచి వచ్చిన తుఫాను వాహనం బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృత్యువాతపడ్డారు. వారిలో ఇద్దరు పురుషులు, మహిళలు ఉన్నారు. ప్రమాదంలో తుఫాను వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది.

వాహనంలో మృతదేహాలు చిక్కుకుపోయాయి. మృతులంతా హైదరాబాద్‌కు చెందినవారు. బంధువులు మరణించడంతో వాహనంలో హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన సమయంలో ఆ వాహనంలో దాదాపు 12 మంది వరకు ఉన్నట్లు సమాచారం. రోడ్డు ప్రమాదం గురించి తెలియగానే మాచర్ల పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

Advertisement

ఆడిన లారీని ఢీ కొట్టిన తుఫాను వాహనం, స్పాట్‌లో నలుగురు మృతి

మృతదేహాలను వాహనం నుంచి బయటకు తీశారు. బాధితులను అంబులెన్సులో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని మెరుగైన వైద్యం కోసం నరసరావు, గుంటూరు ఆసుపత్రులకు తరలించారు. చాలామంది కాళ్లు, చేతులు విరిగిపోయినట్టు తెలుస్తోంది.

స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు. వాహనాలను పక్కకు తొలగించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. గాయపడిన వారి నుంచి సమాచారం సేకరించే పనిలో పడ్డారు. అసలు ఘటన ఎలా జరిగింది?  కారణాలు తెలుసుకునే పనిలో‌ పడ్డారు. ప్రమాదం విషయం తెలియగానే హైదరాబాద్‌, అటు పామురు బంధువుల ఇళ్లలో విషాధచాయలు అలముకున్నాయి.

ALSO READ: ఏటీఎం క్యాష్ వ్యాన్ చోరీ కేసులో మైండ్ బ్లాంక్ ట్విస్ట్.. తండ్రీ కొడుకుల స్కెచ్ కానీ..?

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×