E-Paper
Advertisement

జనాల తలరాత మారుస్తానన్న పూజారి.. తనే జైలుపాలయ్యాడు.. క్లైమాక్స్ మాములుగా లేదుగా!

జనాల తలరాత మారుస్తానన్న పూజారి.. తనే జైలుపాలయ్యాడు.. క్లైమాక్స్ మాములుగా లేదుగా!
Advertisement

Fake Priest: పూజల పేర రూ. లక్షల్లో మోసాలకు పాల్పడ్డ ఎన్నారై పూజారిని పోలీసులు అరెస్ట్​ చేశారు. బాచుపల్లి ప్రాంతానికి చెందిన రామ లచ్చారావు పూజారిగా చేస్తున్నారు. తన ద్వారా పూజలు జరిపించుకుంటే తలరాత మారిపోతుందని.. సంపన్నులైపోతారంటూ పలువురిని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఎవరీ జీవితం మారకపోవడంతో బాధితులు తమ డబ్బు వాపస్ చేయమని అడుగగా చేతబడి చేసి మీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దాంతో బాధితుల్లో ఉన్న ఓ సాఫ్ట్​ వేర్ ఉద్యోగి బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Also Read: స్మార్ట్‌ఫోనా లేక ట్యాబ్లెటా? 7.5 ఇంచుల స్క్రీన్‌తో వచ్చిన Nubia Neo 5 Max.. బ్యాటరీ సామర్థ్యం ఎంతంటే?

Advertisement

ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు అతనిపై లుక్​ ఔట్​ నోటీస్​ జారీ చేశారు. కాగా, ఇక్కడ కేసులు నమోదు కాగానే రామ లచ్చారావు అమెరికా పారిపోయాడు. అక్కడికి వెళ్లిన తరువాత కూడా తన బుద్దిని మార్చుకోలేదు. అమెరికాలో ఉంటున్న కొంతమంది తెలుగువారిని సైతం ఇలాగే మోసం చేశాడు. అమెరికాలోని ఓ గుడి నిర్వాహకులు కేసులు పెట్టటంతో పారిపోయి ఇండియాకు వచ్చాడు. లుక్​ ఔట్​ నోటీస్​ జారీ అయి ఉన్న నేపథ్యంలో అతను శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగగానే ఇమ్మిగ్రేషన్​ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాచుప​ల్లి పోలీసులకు అప్పగించారు.

Also Read: కేటీఆర్ హోం మంత్రిని చేస్తానంటుంటే..! నేనెందుకు పోతా కాంగ్రెస్‌లోకి..!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×