E-Paper
Advertisement

బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. 41 మంది ప్రయాణికులు, కరీంనగర్ జిల్లాలో ఘోరం

బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. 41 మంది ప్రయాణికులు, కరీంనగర్ జిల్లాలో ఘోరం
Advertisement

Bus Fire: ఈ మధ్యకాలం తెలుగు రాష్ట్రాల్లోని బస్సులు అగ్నిప్రమాదాలకు గురవుతున్నాయి. డ్రైవర్లు చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదాలు తప్పాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి కరీంనగర్‌లో జిల్లాలో చోటు చేసుకుంది. ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అసలేం జరిగింది?

కరీంనగర్ జిల్లాలో ఘోరం.. బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

Advertisement

ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లాలో  ఓ బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో  ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన సమయంలో బస్సులో దాదాపు 41 మంది ప్రయాణికులు ఉన్నారు వారంతా సురక్షితంగా బయటపడ్డారు.

కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరింది. అందులో 41 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే బస్సు.. అలుగునూరు దాటిన తర్వాత ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు నుంచి పొగ వాసన రావడం గమనించిన డ్రైవర్, రోడ్డు పక్కన ఆపివేశారు.

Advertisement

బస్సులో 41 మంది ప్రయాణికులు.. డ్రైవర్ జాగ్రత్తగా వ్యవహరించడంతో తప్పిన ముప్పు

పరిస్థితి గమనించిన ఆయన, బస్సు డోర్‌తోపాటు ఎమర్జెన్సీ ద్వారాన్ని తెరిచి ప్రయాణికులను అలర్ట్ చేశారు. ప్రయాణికులు కిందకు దిగిన కొన్ని నిమిషాల వ్యవధిలో మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది బస్సు. ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో అంతా సేఫ్‌గా బయటపడ్డారు. దీంతో ప్రయాణికులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. ఈ ఘటన వెనుక షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని బస్సు డ్రైవర్ చెబుతున్నమాట.

ALSO READ: ఒక‌ప్పుడు శివ‌మ‌ణి.. ఇప్పుడు నెంబ‌ర్ వ‌న్ కేడీ!

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×