// //
Vodafone Independence Day Offer| భారతదేశంలో మూడో అతిపెద్ద టెలికాం కాంపెనీ వొడాఫోన్ ఐడియా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త ఆఫర్లు ప్రకటించింది. నెల రోజుల క్రితం ప్రముఖ టెలికాం కంపెనీలు.. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ రిచార్జ్ ప్లాన్స్ ధరలో 25 శాతం వరకు పెంచేయడంతో కస్టమర్లకు మొబైల్ రిచార్జ్ భారంగా మారింది. ఇలాంటి సమయంలో వొడాఫోన్ ఐడియా కంపెనీ సరికొత్త ఆఫర్లు తీసుకొచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వొడాఫోన్.. కొన్ని రిచార్జ్ ప్లాన్స్ పై 50 జీబి వరకు ఫ్రీ డేటా ఇవ్వడంతో పాటు రూ.100 వరకు రిచార్జ్ ప్లాన్ ధరలు తగ్గించింది.
Also Read: శామ్ సంగ్ బాహుబలి బ్యాటరీ.. నిమిషాల్లో చార్జింగ్.. వేయికిలోమీటర్ల మైలేజ్!
ఇండిపెండెన్స్ డే ఆఫర్లు కొన్ని వొడాఫోన్ ప్రత్యేక ప్లాన్స్ కు మాత్రమే వర్తిస్తాయి. అది కూడా ఆగస్టు 28 వరకే. అయితే ఈ ఆఫర్లు విఐ యాప్ ద్వారా రిచార్జ్ చేసుకునే వారికి మాత్రమే లభిస్తున్నాయి. ఈ ఆఫర్ల లాభఆలు పొందడానికి మీరు విఐ యాప్ ద్వారా రూ. 3499, రూ.3699, రూ.3799 ప్లాన్స్ రిచార్జ్ చేసుకోవాలి. వీటిపై ఇన్స్‌టెంట్ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఈ ప్లాన్స్ పై రూ.50, రూ.75, రూ.100 వరకు డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ డిస్కౌంట్స్ ఉండడంతో ప్లాన్స్ ధరలు రూ. 1749, రూ. 3449, రూ.3624, రూ.3799 వరకు ఉన్నాయి.
Also Read: ట్రైన్ లేట్ అయితే మీ డబ్బులు ఫుల్ రిఫండ్.. షరతులు వర్తిస్తాయి!
వొడాఫోన్ ఇంకా 50 జీబిల వరకు ఉచిత డేటా ఆఫర్ చేస్తోంది. ఈ డేటా ఆరు నెలలు, ఒక సంవత్సర ప్లాన్స్ పై లభిస్తోంది. ఆరు నెలల రిచార్జ్ చేసుకున్నవారికి 50 జీబీల డేటా 45 రోజుల పాటు యాక్టివ్ గా ఉంటుంది. అదే వార్షిక ప్లాన్ తీసుకుంటే 90 రోజుల వరకు ఉచిత 50 జీబీ డేటా లభిస్తుంది.
రూ.1749 రిచార్జ్ ప్లాన్ కు 180 రోజుల వాలిడిటీతో ప్రతి రోజు 1.5 జిబి డేటా లభిస్తుంది. అయితే కొత్త ఆఫర్ కారణంగా 30 జీబి డేటా 90 రోజులపాటు యాక్టివ్ గా ఉంటుంది. అదే రూ.3449 ప్లాన్ తీసుకుంటే, 365 రోజుల వాలిడిటి, ప్రతి రోజు 1.5జిబి డేటా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లాన్లో అదనంగా 50 జీబి డేటా 90 రోజుల వరకు లభిస్తుంది.
Also Read: బ్యాంకు లో నెగిటివ్ బ్యాలెన్స్ తో డబ్బులు కట్ అవుతున్నాయా?.. ఇలా చేయండి.. తిరిగి వస్తాయి!!
ఇంకా రూ.3624, రూ.3699 ప్లాన్స్ తీసుకున్నవారికి 365 వాలిడిటీ, ప్రతిరోజు 2జీబి డేటా ఉంటుంది. ఇండిపెండెన్స్ డే ఆఫర్ తో ఈ రెండు ప్లాన్స్ తీసుకున్న వారికి 90 రోజుల పాటు 50 జీబి ఫీ డేటా లభిస్తుంది. అయితే ఈ రెండు ప్లాన్స్ తీసుకున్న వారికి డిస్నీ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటి సబ్స్‌క్రిప్షన్లు ఉచితంగా లభిస్తాయి. త్వరపడండి ఈ ఆఫర్లు ఆగస్టు 28 వరకే.
Also Read: ఆఫర్లే ఆఫర్లు.. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ఫోన్లను ఇంత తక్కువకు కొనేయొచ్చా