// // Senior Citizen Card Apply: రూ.10 లకే సీనియర్ సిటిజన్ కార్డు.. ఎన్నో ప్రయోజనాలు, దరఖాస్తు విధానం ఇలా! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

రూ.10 లకే సీనియర్ సిటిజన్ కార్డు.. ఎన్నో ప్రయోజనాలు, దరఖాస్తు విధానం ఇలా!

రూ.10 లకే సీనియర్ సిటిజన్ కార్డు.. ఎన్నో ప్రయోజనాలు, దరఖాస్తు విధానం ఇలా!
Advertisement

Senior Citizen Card Apply: కేవలం 10 రూపాయలతో సీనియర్ సిటిజన్స్ కు ఎన్నో బెనిఫిట్స్ అందించే కార్డు తీసుకోవచ్చు. అదే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సీనియర్ సిటిజన్ కార్డు. ఈ కార్డుతో సీనియర్ సిటిజన్స్ కు హాస్పిటల్ లో ప్రయారిటీ, బ్యాంకుల్లో సేవింగ్స్ పై కాస్త ఎక్కువ వడ్డీ రేటు, రైల్వేస్ లో కన్షెషన్ లభిస్తుంది. ఈ కార్డును 60 ఏళ్లు పైబడిన ఏ సిటిజన్ అయిన అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక ప్రభుత్వ ఐడీలాగా పనిచేస్తుంది. అలాగే ఆధార్ లాగా వ్యాలిటిడీ ఉంటుంది. ఈ కార్డు దేశంలో ఎక్కడైనా చెల్లుతుంది.

సీనియర్ సిటిజన్ కార్డుతో ప్రయోజనాలు

1. బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ లేదా రికరింగ్ డిపాజిట్ చేసే సీనియర్ సిటిజన్లకు కాస్త ఎక్కువ వడ్డీ రేట్లు ఇస్తారు. నార్మల్ కస్టమర్స్ కంటే ఈ వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది.
2. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్స్ కు ఫైనాన్షియల్ ఇయర్ లో 3 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది.
3. ఈ కార్డు ఉంటే రైల్వేస్, ప్రభుత్వ ట్రాన్స్ పోర్టుల్లో టికెట్ రేటుపై సీనియర్ సిటిజన్లకు కన్షెషన్ ఇస్తారు.
4. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కొన్ని మెడికల్ బెనిఫిట్స్, డిస్కౌంట్ లు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు.

సీనియర్ సిటిజన్ కార్డును ఎలా అప్లై చేసుకోవాలి

  • మొదటగా నేషనల్ గవర్నమెంట్ సర్వీసెస్ పోర్టల్ కు వెళ్లండి.
  • మీ స్టేట్ పేరు సెలెక్ట్ చేసుకోండి.
  • అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేయండి.
  • మీ వివరాలు, డాక్యుమెంట్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అప్లోడ్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి, అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
  • సీనియర్ సిటిజన్ కార్డు జనరేట్ అవుతుంది. ఈ కార్డును ప్రింట్ తీసుకోవచ్చు.
Advertisement

Also Read:  నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. 90% సబ్సిడీతో స్వయం ఉపాధి పథకాలు.. అప్లై చేసుకోండిలా!

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×