E-Paper
Advertisement

RBI MPC Meeting: ఆర్బీఐ వడ్డీ రేట్లు యథాతథం.. ఎంపీసీ మీటింగ్ లో కీలక అంశాలివే

RBI MPC Meeting: ఆర్బీఐ వడ్డీ రేట్లు యథాతథం.. ఎంపీసీ మీటింగ్ లో కీలక అంశాలివే
Advertisement

RBI MPC Meeting: ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. శుక్రవారం ముంబైలో ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశం(MPC) జరిగింది. ఈ సమావేశం నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. తాజా సమావేశంలో రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. రెపోరేటును 5.25 శాతం వద్దే కొనసాగించింది. 2026-27 బడ్జెట్‌ తర్వాత ఆర్‌బీఐ తొలి ద్వైమాసిక సమీక్ష నిర్వహించింది.

గతేడాది ఆర్బీఐ పలుమార్లు వడ్డీ రేట్లను సవరించింది. 2025 ఫిబ్రవరి, ఏప్రిల్‌లో కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్లను తగ్గించింది. జూన్‌ సమీక్షలో ఏకంగా 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. ఆ తర్వాత డిసెంబర్ లో మరో పావు శాతం కోత విధించింది. గతేడాది మొత్తంగా రెపో రేటు 1.25 శాతం వరకు తగ్గింది.

ఆర్బీఐ ఎంపీసీ కీలక నిర్ణయాలు

Advertisement

ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీలో ఆరుగురు సభ్యుల రేటు నిర్ణయ ప్యానెల్ రెపో రేట్లను 5.25% వద్ద మార్చకుండా తటస్థంగా వద్ద కొనసాగించాలని నిర్ణయించింది. ఆర్బీఐ 2025-26 జీడీపీ వృద్ధి రేటు అంచనాను 7.3 శాతం నుంచి 7.4 శాతానికి పెంచింది. 2026-27లో ఆర్థిక కార్యకలాపాలు బాగానే ఉంటాయని అంచనా వేసింది. 2026-27 తొలి క్వార్టర్ జీడీపీ వృద్ధి రేటు అంచనాను 6.7% నుండి 6.9%కి, Q2 జీడీపీ వృద్ధిరేటు అంచనాను 6.8% నుంచి 7%కి పెంచింది.

2025 Q4 ధరలలో భారీ తగ్గుదలతో ప్రతికూల బేస్ ప్రభావాలు ఈ ఏడాది ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీస్తాయని ఆర్బీఐ తెలిపింది. సీపీఐ ద్రవ్యోల్బణ అంచనాను గతంలో 2.0% నుండి 2.1%కి పెంచింది. ఇది Q4 2026 ద్రవ్యోల్బణ అంచనాలను 2.9% నుండి 3.2%కి, Q1 2027 ను 3.9% నుండి 4.0%కి. Q2 2027 ద్రవ్యోల్బణ అంచనాలను గతంలో 4.0% నుండి 4.2%కి పెంచింది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×