E-Paper
Advertisement

RBI Repo Rate : రుణగ్రహీతలకు శుభవార్త.. వడ్డీ రేట్లు తగ్గించిన రిజర్వ్ బ్యాంకు

RBI Repo Rate : రుణగ్రహీతలకు శుభవార్త.. వడ్డీ రేట్లు తగ్గించిన రిజర్వ్ బ్యాంకు
Advertisement

RBI Repo Rate | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రెపో రేట్ ప్రస్తుతం 6.25 శాతానికి తగ్గింది. ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి, ఖర్చులను పెంచడానికి.. ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన క్రమంలోనే ఈ రేటు తగ్గింపు నిర్ణయం కూడా రావడం గమనార్హం.

ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (MPC) ఫిబ్రవరి 5న మూడు రోజుల సమావేశాన్ని ప్రారంభించింది. శుక్రవారం వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటన చేశారు. ఆర్బీఐ పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం గత డిసెంబర్‌లో ముగియడంతో, సంజయ్ మల్హోత్రా పదవీ నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన గవర్నర్ పదవి చేపట్టిన తర్వాత ఇది మొదటి ద్రవ్య విధాన కమిటీ (మానిటరీ పాలసీ కమిటీ) సమావేశం. మరోవైపు మార్కెట్ వర్గాలు రేటు తగ్గింపు కోసం ఆసక్తిగా ఎదురుచూశాయి. అందరూ అంచనా వేసినట్లుగానే ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బెంచ్‌మార్క్ రుణ రేటు ప్రస్తుత 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గింది.

Advertisement

జీడీపీ అంచనా 6.7 శాతం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేటు నిర్ణయ ప్యానెల్ 2026 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిని దాదాపు 6.7  శాతంగా అంచనా వేసిందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. అలాగే 2026 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 4.2 శాతం వద్ద కొనసాగుతుందని ఆర్బీఐ ప్యానెల్ అంచనా వేసింది. కొత్త పంటల రాక నేపథ్యంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గుతుందని భావిస్తున్నట్లు ఎంపీసీ నిర్ణయాలను ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు.

Also Read: తగ్గనున్న లోన్ ఈఎంఐలు.. పెరగనున్న ఏటిఎం ఛార్జీలు!

Advertisement

ఆర్‌బీఐ పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన మునుపటి ఎంపీసీ సమావేశంలో రెపో రేటులో ఎటువంటి మార్పు చేయకుండా 6.5 శాతంగా యథాతథంగా కొనసాగించారు. కానీ క్యాష్ రిజర్వ్ రేషియో (నగదు నిల్వ నిష్పత్తి CRR) 50 బేసిస్ పాయింట్లు తగ్గించారు. నగదు ప్రవాహాన్ని మార్కెట్లో పెంచడానికి బ్యాంకింగ్ వ్యవస్థలోకి ఆర్‌బీఐ రూ. 1 ట్రిలియన్లను చొప్పించింది. అయితే గత డిసెంబర్ విధాన కమిటీ పాలసీలో బ్యాంకింగ్ వ్యవస్థలోకి రెండు విడతలుగా రూ. 1.16 లక్షల కోట్లు ఇంజెక్ట్ చేయడం, క్యాష్ రిజర్వ్ రేషియో 50 బేసిస్ పాయింట్లు (bps) తగ్గించడం.. కీలకమైన చర్యలు.

రెపో రేటు అంటే ఏంటి?
రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ రేట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను విక్రయించడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి రుణాలు పొందుతాయి.

బ్యాంకులకు నిధులు తక్కువగా ఉన్నప్పుడు లేదా అస్థిర మార్కెట్ పరిస్థితులలో ద్రవ్యతను కొనసాగించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇలా చేస్తాయి. మార్కెట్లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్‌పై ప్రభావం చూపినప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది.

వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ రేటు తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు కూడా కస్టమర్లకు ఇచ్చే రీటైల్‌ రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లను ఆ మేరకు సవరించే అవకాశం ఉంటుంది. దీంతో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నవారికి ఊరట కలిగే అవకాశం ఉంటుంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×