E-Paper
Advertisement

1600 Series: మోసాల కట్టడికి ట్రాయ్ కీలక నిర్ణయం.. 1600 కాలింగ్ సిరీస్ తప్పనిసరి

1600 Series: మోసాల కట్టడికి ట్రాయ్ కీలక నిర్ణయం.. 1600 కాలింగ్ సిరీస్ తప్పనిసరి
Advertisement

1600 Series: మోసపూరిత కాల్స్ ను కట్టడి చేయడానికి ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ, సెబీ, పీఎఫ్ఆర్డీఏ నియంత్రించే సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇకపై తమ కస్టమర్లకు చేసే కాల్స్, లావాదేవీల ఫోన్ కాల్స్ కు ‘1600’ నెంబర్ సిరీస్‌ను తప్పనిసరి అని ట్రాయ్ పేర్కొంది. ఈ సంస్థలు కస్టమర్లకు 1600 నంబర్ సిరీస్ ఫోన్ నంబర్లు మాత్రమే వినియోగించాలని ఆదేశించింది. ఈ నిబంధన మ్యూచువల్ ఫండ్స్, ఎన్బీఎఫ్సీలు కూడా వర్తిస్తుందని తెలిపింది. వాయిస్ కాల్స్ మోసాలకు అరికట్టేందుకు ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది.

1600 సిరీస్

బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు ‘1600’ నంబరింగ్ సిరీస్‌ను టెలికమ్యూనికేషన్స్ విభాగం కేటాయించింది. ఈ సిరీస్ కస్టమర్ల లావాదేవీ కాల్‌లు ఇతర మోసపూర్తిత కమ్యూనికేషన్‌ల గురించి స్పష్టమైన అవగాహన కల్పిస్తుందని పేర్కొంది. ఈ సిరీస్ ను మాత్రమే ప్రజలు చట్టబద్దమైన కాల్స్ గా పరిగణించాలని కోరింది.

Advertisement

టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు ఇప్పటికే ఈ సిరీస్‌ను ట్రాయ్ కేటాయించింది. దాదాపు 485 సంస్థలు ఇప్పటికే 1600 సిరీస్‌లను తీసుకున్నాయి. మొత్తం 2800 కంటే ఎక్కువ నంబర్‌లను ఆయా సంస్థలు కొనుగోలు చేశాయి. ఆర్థిక మోసాలను లేదా తప్పుదారి పట్టించే కాల్స్ ప్రమాదాన్ని తగ్గించడానికి 1600 సిరీస్ నంబర్‌లను అమల్లోకి తీసుకొస్తున్నట్లు ట్రాయ్ పేర్కొంది.

కీలక నిబంధనలు

A. సెబీ-నియంత్రిత సంస్థలు: అన్ని మ్యూచువల్ ఫండ్‌లు, ఆస్తి నిర్వహణ కంపెనీలు ‘1600’ నంబరింగ్ సిరీస్ కొనుగోలను ఫిబ్రవరి 15, 2026 నాటికి పూర్తి చేయాలి. అర్హత కలిగిన స్టాక్ బ్రోకర్లు ‘1600’ నంబరింగ్ సిరీస్ స్వీకరణ మార్చి 15, 2026 నాటికి పూర్తిచేయాలి. ప్రస్తుతానికి, ఇతర సెబీ రిజిస్టర్డ్ మధ్యవర్తులు తమ రిజిస్ట్రేషన్ వివరాలను ధృవీకరించిన తర్వాత స్వచ్ఛందంగా 1600 సిరీస్‌కు మారవచ్చు.

Advertisement

B. ఆర్బీఐ సంస్థలు: వాణిజ్య బ్యాంకులు జనవరి 1, 2026 నాటికి 1600 సిరీస్ నెంబర్ ఆన్‌బోర్డ్ చేసుకోవాలి. రూ.5000 కోట్ల కంటే ఎక్కువ ఆస్తి పరిమాణం కలిగిన పెద్ద NBFCలు, చెల్లింపు బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకులు ఫిబ్రవరి 1, 2026 నాటికి ఆన్‌బోర్డ్ చేసుకోవాలి. మిగిలిన NBFCలు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, చిన్న సంస్థలు మార్చి 1, 2026 నాటికి 1600 నెంబర్ ఆన్‌బోర్డ్ చేసుకోవాలి.

C. PFRDA-నియంత్రిత సంస్థలు: సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలు (CRAలు), పెన్షన్ ఫండ్ మేనేజర్లు ఫిబ్రవరి 15, 2026 నాటికి ఈ నెంబర్ కలిగి ఉండాలి. బీమా రంగంలోని సంస్థలు 1600 సిరీస్‌లను కొనుగోలుకు చివరి తేదీని తర్వలో తేలిజేయనున్నారు. కేంద్రీయ రికార్డ్‌ కీపింగ్‌ ఏజెన్సీలు, పెన్షన్‌ ఫండ్‌ మేనేజర్లు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15లోగా ఈ నెంబర్ తీసుకోవాలి.

Also Read: Saurabh Sharma RTO: ‘టెంపర్’ సినిమాను మించిన అవినీతి.. రూ.28 వేల జీతం, రూ.1000 కోట్ల ఆస్తులు!

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×