E-Paper
Advertisement

ఆన్‌లైన్‌లో మోసపోయారా? రూ. 25 వేలు పొందొచ్చు, అదెలా సాధ్యం, ఆర్‌బిఐ ఏం చెబుతోంది?

ఆన్‌లైన్‌లో మోసపోయారా? రూ. 25 వేలు పొందొచ్చు, అదెలా సాధ్యం,  ఆర్‌బిఐ ఏం చెబుతోంది?
Advertisement

RBI: దేశంలో డిజిటల్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది కేంద్రం. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. మనీ బదిలీల విషయంలో ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిన తర్వాత అటువైపు ఫోకస్ చేసింది. ఈ క్రమంలో లేనిపోని డిజిటల్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆన్‌లైన్ మోసంలో డబ్బు పోగొట్టుకున్నారా? 25 వేల రూపాయల వరకు తిరిగి పొందవచ్చని చెబుతోంది ఆర్‌బిఐ.

ఆర్‌బిఐ కొత్త నిబంధనలు.. వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి

Advertisement

ఆన్‌లైన్‌లో వినియోగదారుడు తెలియని తప్పుడు లింక్ క్లిక్ చేస్తే ఖాతాలోని డబ్బులు పోగొట్టుకునేవారు. పోయిన డబ్బులు తిరిగి వస్తాయన్న నమ్మకం బాధితుల్లో లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. డిజిటల్ చెల్లింపుల మోసాల బాధితులకు ఊరట కల్పించేలా కొత్త మార్గ దర్శకాలను ప్రకటించనుంది. ఈ కొత్త నిబంధనలు వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి.

దేశంలో మొబైల్ లావాదేవీలు వేగంగా జరుగుతున్నాయి. యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వీటి గురించి చెప్పనక్కర్లేదు. అదే సమయంలో సైబర్ మోసాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. డిజిటల్ మోసాల బారిన పడిన వినియోగదారులకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు కొత్త ఫ్రేమ్‌వర్క్‌ రూపొందించింది ఆర్బీఐ.

Advertisement

ఆన్‌లైన్‌లో మోసపోయారా? రూ. 25 వేలు పొందొచ్చు

డిజిటల్ లావాదేవీని గుర్తించిన ఐదు రోజుల్లో కస్టమర్ తన బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే చాలు. దర్యాప్తు తర్వాత రూపొందించే షరతులకు అనుగుణంగా ఉంటే గరిష్ఠంగా రూ. 25 వేలు పరిహారం పొందవచ్చు. ఈ విషయంలో బాధితులకు ఊరట ఇవ్వనుంది. ఈ తరహా మోసాలు జరగకుండా నిరోధించడంపై దృష్టి సారించింది ఆర్‌బీఐ.

తొలుత బ్యాంకులు తమ అంతర్గత రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. జవాబుదారీతనం ఉండేలా దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ క్రమంలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటివి వినియోగించాలని సూచన చేసింది.

ALSO READ: బంగారు ప్రియులకు శుభవార్త.. మార్కెట్లో పడిపోతున్న ధరలు, ఇంకెందుకు ఆలస్యం

అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడం, మోసాలను పసిగట్టడానికి వినియోగదారుల కార్యకలాపాలను పర్యవేక్షించడానికి బ్యాంకులు ఏఐ వ్యవస్థలపై ఆధారపడుతున్నాయి. దీన్ని మెరుగైన నిర్వహణ, వినియోగదారుల డబ్బు కోల్పోకముందే మోసపూరితను గుర్తించే సామర్థ్యాన్ని మెరుగుపరచనుంది.

ఏఐ వాడకంపై స్పష్టమైన నియమావళి లేకపోవడం బ్యాంకులకు ఒక అడ్డంకిగా ఉండేది. ఆర్‌బీఐ మార్గదర్శకాలతో అనిశ్చితి తొలగిపోనుందని బ్యాంక్ వర్గాలు చెబుతున్నాయి. ఏఐ వినియోగానికి అడ్డంకి కాదని, దాని వేగాన్ని మరింత పెంచుతుందని అంటున్నాయి.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×