E-Paper
Advertisement

జూలైలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల ఎంట్రీ.. EV ప్రియులకు పండగే!

జూలైలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల ఎంట్రీ.. EV ప్రియులకు పండగే!
Advertisement

Upcoming Electric Scooters July 2026: భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్ ధరలు పెరగడం, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, పర్యావరణహిత ప్రయాణం లాంటి కారణాలతో చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. పెరుగుతున్న డిమాండ్‌ ను దృష్టిలో పెట్టుకుని టాప్ కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే 2026 రెండో అర్ధభాగంలో పలు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు భారత మార్కెట్లోకి రానున్నాయి. ఈ మోడళ్లు మాస్ మార్కెట్ నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకు  వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి.

1.ఏథర్ EL01

బెంగళూరుకు చెందిన ప్రముఖ EV తయారీ సంస్థ అథర్ తన కొత్త మాస్ మార్కెట్ ప్లాట్‌ ఫారమ్‌ ను తీసుకొస్తోంది. దీనిపై రూపొందించిన తొలి స్కూటర్ అథర్ EL01. ఈ స్కూటర్‌ ను జూలై, ఆగస్టు 2026లో లాంచ్ చేసే అవకాశం ఉంది. కంపెనీ నిర్వహించే వార్షిక కమ్యూనిటీ డేలో దీనిని ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ స్కూటర్ ధర సుమారు రూ.99 వేలుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

2.సింపుల్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్

Advertisement

సింపుల్ ఎనర్జీ సంస్థ కూడా కుటుంబ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను సిద్ధం చేస్తోంది. దీనికి ‘అరైవ్’ అనే పేరు పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సాధారణ కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఈ స్కూటర్‌ను రూపొందిస్తున్నారు. పొడవైన సీటు, సెంటర్ స్టాండ్, సౌకర్యవంతమైన డిజైన్ ఈ స్కూటర్ ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు. ఈ స్కూటర్ 2026 చివరి నాటికి మార్కెట్లోకి రావచ్చని అంచనా. ధర సుమారు రూ.1 లక్ష వరకు ఉండే అవకాశం ఉంది.

3.యమహా ఏరాక్స్-ఇ, కొత్త యమహా EV

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా కూడా భారత EV మార్కెట్‌ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. కంపెనీ, త్వరలో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకురానుంది. ఇందులో యమహా ఏరాక్స్-ఇతో పాటు పూర్తిగా కొత్తగా అభివృద్ధి చేసిన మరో ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఉండనుంది. రాబోయే కొన్ని నెలల్లో ఈ మోడళ్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఎంట్రీ లెవల్ మోడల్ ధర సుమారు రూ.1.60 లక్షల నుంచి ప్రారంభమై, ప్రీమియం వెర్షన్ల ధర రూ.2.90 లక్షల వరకు ఉండవచ్చని అంచనా.

4.టీవీఎస్ జూపిటర్ ఎలక్ట్రిక్

Advertisement

టీవీఎస్ మోటార్ కూడా తన అత్యంత ప్రజాదరణ పొందిన జూపిటర్ స్కూటర్‌ను ఎలక్ట్రిక్ రూపంలో తీసుకురానుంది. ఈ కొత్త మోడల్ ప్రధానంగా కుటుంబ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడుతోంది. ప్రాక్టికల్ డిజైన్, ఎక్కువ స్టోరేజ్ స్పేస్, రోజువారీ ప్రయాణాలకు అనువైన ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. 2026 మూడో త్రైమాసికంలో ఈ స్కూటర్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీని ధర సుమారు రూ.1.10 లక్షలుగా ఉండవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Read Also: జూలై 2026లో భారత మార్కెట్‌లోకి రానున్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు.. EV ప్రియులకు పండుగే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×