E-Paper
Advertisement

కార్పొరేట్ రూల్స్ vs హిందూ ధర్మం.. ముంబై లెన్స్‌కార్ట్ స్టోర్‌లో అసలేం జరిగింది?

కార్పొరేట్ రూల్స్ vs హిందూ ధర్మం..  ముంబై లెన్స్‌కార్ట్ స్టోర్‌లో అసలేం జరిగింది?
Advertisement

Lenskart Controversy: ముంబైలోని లెన్స్‌కార్ట్ (Lenskart) స్టోర్‌లో బీజేపీ నేత నాజియా ఇలాహీ ఖాన్ సిబ్బందిని నిలదీస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన చర్చకు దారితీసింది. స్టోర్ ఉద్యోగులకు ఆమె స్వయంగా తిలకం దిద్ది, వారితో ‘జై శ్రీరామ్’ నినాదాలు చేయించడం ఆ వీడియోలో కనిపించింది. హిందూ సంప్రదాయ చిహ్నాలైన తిలకం, మంగళసూత్రం, బొట్టు వంటి వాటిపై లెన్స్‌కార్ట్ నిషేధం విధించిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆమె ఈ నిరసన చేపట్టారు. పని ప్రదేశాల్లో సాంస్కృతిక, మతపరమైన హక్కులను గౌరవించాలంటూ ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఈ వివాదం ముదిరిన తరుణంలో లెన్స్‌కార్ట్ సీఈఓ పీయూష్ బన్సల్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. సంస్థ పాత స్టైల్ గైడ్ లో ఉన్న నిబంధనలు ప్రస్తుత విధానాలను ఉద్దేశించిన‌వి కావ‌ని ఆయన స్పష్టం చేశారు. ఆ పాత నిబంధనల ప్రకారం మతపరమైన చిహ్నాలపై ఉన్న పరిమితులను తొలగించామ‌న్నారు. ప్రస్తుతం బొట్టు, తిలకం, కలావా, హిజాబ్ వంటి అన్ని రకాల మతపరమైన వ్యక్తీకరణలను లెన్స్‌కార్ట్ అనుమతిస్తోందని ఆయన వివరణ ఇచ్చారు. అయితే, సీఈఓ వివరణ ఇచ్చిన తర్వాత కూడా నాజియా ఇలాహీ ఖాన్ వీడియో బయటకు రావడం, కార్పొరేట్ నిబంధనలు వర్సెస్ సాంస్కృతిక హక్కుల మధ్య ఉన్న వివాదాన్ని మరోసారి చర్చకు పెట్టింది.

Advertisement

ఈ వివాదానికి ప్రధాన కారణం లెన్స్‌కార్ట్ సంస్థ ఇంట‌ర్న‌ల్ గ్రోమింగ్ పాలసీ. గతంలో రూపొందించిన ఈ పాలసీలో ఉద్యోగులు విధుల్లో ఉన్నప్పుడు తలపై తిలకం, మణికట్టుకు కలావా (మతపరమైన దారం), లేదా పెద్ద బొట్టు వంటివి ధరించకూడదని నిబంధనలు ఉన్నాయి. ఉద్యోగులందరూ ఒకేవిధంగా, ప్రొఫెషనల్‌గా కనిపించాలనే ఉద్దేశంతో ఈ నిబంధనలు పెట్టారు. అయితే, అవి భారతీయ సంస్కృతిని, మత స్వేచ్ఛను హరిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఒక ఉద్యోగికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడం, అందులో మతపరమైన చిహ్నాలపై ఆంక్షలు ఉండటంతో ఈ వివాదం రాజుకుంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం కార్పొరేట్ సంస్థలు తమ ప్రొఫెషనల్ ఇమేజ్ కోసం ఇలాంటి నిబంధనలు పెట్టుకోవడంలో తప్పులేదని వాదిస్తుంటే, మెజారిటీ ప్రజలు మాత్రం ఒక వ్యక్తి తన మతపరమైన ఆచారాలను పాటించే హక్కును పని ప్రదేశాలు కాలరాయకూడదని అభిప్రాయపడుతున్నారు. లెన్స్‌కార్ట్ తన విధానాలను వెంటనే సవరించినప్పటికీ, ఈ ఘటన దేశవ్యాప్తంగా ఉన్న ఇతర కార్పొరేట్ సంస్థలకు ఒక పాఠంగా నిలిచింది.

Advertisement

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×