E-Paper
Advertisement

ఏఐ సునామీ.. ఐబీఎంకు ఊహించని షాక్! గంటల్లోనే రూ. 6.7 లక్షల కోట్లు మాయం!

ఏఐ సునామీ.. ఐబీఎంకు ఊహించని షాక్! గంటల్లోనే రూ. 6.7 లక్షల కోట్లు మాయం!
Advertisement

IBM Shares: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టిస్తున్న సునామీకి.. అమెరికా టెక్ దిగ్గజం ఐబీఎంకు ఊహించని దెబ్బ తగిలింది. వాల్‌స్ట్రీట్ ట్రేడింగ్‌లో కంపెనీ షేరు విలువ ఏకంగా 25.21 శాతం కుంగి 217.07 డాలర్లకు పడిపోయింది. దీంతో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఐబీఎం మార్కెట్ విలువ ఏకంగా 70 బిలియన్ డాలర్లు.. అంటే మన భారత కరెన్సీలో 6.7 లక్షల కోట్లకు పైగా సంపద బూడిదలో పోసిన పన్నీరైంది. ఐబీఎం చరిత్రలో ఒకే రోజులో ఈ స్థాయిలో షేర్లు పడిపోవడం గత 58 ఏళ్లలో ఇదే తొలిసారి.

ఇన్వెస్టర్లలో ఆందోళన..

Advertisement

ఈ భారీ పతనానికి కంపెనీ ముందస్తుగా విడుదల చేసిన రెండో త్రైమాసిక ప్రాథమిక ఫలితాలే ప్రధాన కారణం. వచ్చే వారం పూర్తి స్థాయి రిపోర్ట్ రానుండగా.. ఐబీఎం ఆదాయం కేవలం ఒకే ఒక్క శాతం పెరిగి 17.2 బిలియన్ డాలర్లుగా నమోదు కావచ్చని సీఈవో అరవింద్ కృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇన్వెస్టర్లను ఆందోళనలో పడేశాయి. సాఫ్ట్‌వేర్ రంగం కొద్దో గొప్పో రాణించినా, ఐబీఎంకు వెన్నెముక లాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారం ఏకంగా 7 శాతం నష్టాల్లోకి జారుకుంది. దీంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెంది.. ఒక్కసారిగా షేర్ల అమ్మకాలకు తెగబడ్డారు.

ఏఐ ని అంచనా వేయడంలో ఫెయిల్..

Advertisement

ఏఐ, సైబర్ సెక్యూరిటీ మార్కెట్‌ను అంచనా వేయడంలో తాము ఫెయిల్ అయ్యామన్నారు సీఈవో అరవింద్ కృష్ణ. సర్వర్లు, స్టోరేజ్ డివైజ్‌ల వైపు మళ్లుతున్న కస్టమర్ల ప్రాధాన్యతలను గుర్తించడంలో తాము విఫలమయ్యామని బహిరంగంగా ప్రకటించడం టెక్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ సంక్షోభం నుంచి ఐబీఎం ఎలా గట్టెక్కుతుందో చూడాలి.

Also Read: సీఎం రేవంత్ రెడ్డి ‘కేబినెట్’ వ్యూహం.. అసలు బాంబు పేల్చిన న్యాయ నిపుణులు!

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×