E-Paper
Advertisement

ఇల్లు కొంటున్నారా? ఈ తప్పులు చేస్తే.. లైఫ్ లాంగ్ సంపాదన గోవిందా!

ఇల్లు కొంటున్నారా? ఈ తప్పులు చేస్తే.. లైఫ్ లాంగ్ సంపాదన గోవిందా!
Advertisement

First time home buyer tips: సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితకాల కల. అందుకే లైఫ్‌లో మొదటిసారి ఇల్లు కొనేటప్పుడు ఉండే ఆ ఎగ్జైట్‌మెంట్, ఆ హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. అయితే.. ఇదే టైమ్‌లో కాస్త అలసత్వంగా ఉన్నా, అవగాహన లేకపోయినా జీవితాంతం సంపాదించిన సొమ్మంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మోసపోకుండా.. లీగల్ చిక్కుల్లో పడకుండా ఉండాలంటే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి సారి ఇల్లు కొనేటప్పుడు చాలా మంది తెలియక చేసే కొన్ని పొరపాట్లు, వాటి వల్ల వచ్చే భారీ నష్టాలు, వాటిని ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫస్ట్ టైమ్ ఇల్లు కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

1. బడ్జెట్‌ను దాటి ప్లాన్ చేసుకోవడం:
చాలామంది చేసే మొదటి తప్పు ఇదే. తమ చేతిలో ఉన్న అమౌంట్ లేదా హోమ్ లోన్ ఎలిజిబిలిటీని బట్టి కాకుండా.. ఇల్లు నచ్చిందనే కారణంతో బడ్జెట్ దాటిపోతుంటారు. కేవలం డౌన్ పేమెంట్ చూసుకుంటే సరిపోదు.. రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ, ఇంటీరియర్ వర్క్స్ వంటి ‘హిడెన్ కాస్ట్స్’ కూడా ఉంటాయి. వీటిని లెక్కలోకి తీసుకోకపోతే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Advertisement

2. లీగల్ డాక్యుమెంట్లు:
ఇల్లు లేదా ప్లాట్ నచ్చగానే బిల్డర్ మాటలు నమ్మి అడ్వాన్స్ ఇచ్చేయకండి. టైటిల్ డీడ్, లింక్ డాక్యుమెంట్లు, బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ లను ఒక మంచి లీగల్ అడ్వైజర్ లేదా లాయర్ చేత వెరిఫై చేయించడం చాలా ముఖ్యం. రేరా రిజిస్ట్రేషన్ ఉందో లేదో కచ్చితంగా చెక్ చేసుకోవాలి.

3.లొకేషన్ రీసెర్చ్ :
ఇల్లు ఎంత బాగున్నా, అది ఉండే లొకేషన్ బాలేకపోతే భవిష్యత్తులో రీసేల్ వాల్యూ ఉండదు. ఆఫీసులకు దూరం, స్కూల్స్, హాస్పిటల్స్, మార్కెట్ వంటి బేసిక్ నీడ్స్ ఎంత దూరంలో ఉన్నాయో చూసుకోవాలి. అలాగే వర్షాకాలంలో ఆ ఏరియాలో నీళ్లు నిలుస్తాయా, ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉంటాయో ఒకటికి రెండు సార్లు స్థానికులను అడిగి తెలుసుకోవాలి.

Advertisement

4. బ్యాంక్ హోమ్ లోన్‌:
హోమ్ లోన్ అనగానే మన శాలరీ అకౌంట్ ఉన్న బ్యాంక్‌కే చాలామంది వెళ్తుంటారు. కానీ.. మార్కెట్‌లో వేర్వేరు బ్యాంకులు విభిన్న వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంటాయి. కేవలం 0.5% వడ్డీ తగ్గినా, 20 ఏళ్ల లోన్ పీరియడ్‌లో లక్షల రూపాయలు ఆదా అవుతాయి. కాబట్టి ప్రొసెస్సింగ్ ఫీజు, హిడెన్ ఛార్జీలను కంపేర్ చేసి బెస్ట్ బ్యాంక్‌ను ఎంచుకోండి.

Also Read: రేట్ల వెనక “9” మాయాజాలం.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన షాపింగ్ సీక్రెట్

5. ఫ్యూచర్ ప్లానింగ్ లేకపోవడం:
ప్రస్తుత అవసరాలకే కాకుండా భవిష్యత్తులో ఫ్యామిలీ పెరిగితే ఈ ఇల్లు సరిపోతుందా లేదా అనేది ఆలోచించాలి. అలాగే రీసేల్ వాల్యూ, అద్దెకు ఇస్తే ఎంత రెంట్ వస్తుంది అనే కమర్షియల్ యాంగిల్‌లోనూ ఆలోచించడం అవసరం.

ఇల్లు కొనేవారి కోసం టిప్స్:
మీ నెలవారీ ఆదాయంలో హోమ్ లోన్ ఈఎంఐ (EMI) 40% కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోండి.

ప్రాజెక్ట్ సైట్‌ను వేర్వేరు సమయాల్లో (ఉదయం, రాత్రి) విజిట్ చేసి అక్కడ వాతావరణాన్ని అబ్జర్వ్ చేయండి.

రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్‌కే మొదటి ప్రాధాన్యత ఇవ్వండి.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×