E-Paper
Advertisement

Bulk SIM card New Rules| ప్రైవేట్ కంపెనీలపై కేంద్రం ఆంక్షలు.. బల్క్ సిమ్ కార్డులు కొనుగోలుపై పరిమితి..

Bulk SIM card New Rules| ప్రైవేట్ కంపెనీలపై కేంద్రం ఆంక్షలు.. బల్క్ సిమ్ కార్డులు కొనుగోలుపై పరిమితి..
Advertisement

Bulk SIM card New Rules| కేంద్ర ప్రభుత్వం కొత్తి సిమ్ కార్డల కొనుగోలు విషయంలో కొత్త నియయాలు తీసుకొచ్చింది. టెలికామ్ కంపెనీల నుంచి ప్రైవేట్ కంపెనీలు బల్క్ సిమ్ కార్డలు కొనుగోలుపై ఆంక్షలు విధించింది. ఇకపై ప్రైవేట్ కంపెనీలు అత్యధికంగా 100 సిమ్ కార్డులు మాత్రమే కొనుగోలు చేయగలరని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ప్రకటించింది. బల్క్ సిమ్ కార్డులతో జరుగుతున్న మోసాలను అరికట్టడానికే ఈ ఆంక్షలు విధించామని ప్రభుత్వం తెలిపింది.

కొత్త నియమాల ప్రకారం.. ఒక ప్రైవేట్ కంపెనీ 100 కంటే ఎక్కువ సిమ్ కార్డులు కొనుగోలు చేయాలంటే ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాత పూర్వకంగా టెలికామ్ కంపెనీ, టెలికమ్యూనికేషన్ శాఖకు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆ తరువాత ఈ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయాలి. ఉదాహరణకు కంపెనీ.. 1000 సిమ్ కార్డులు కొనుగోలు చేయాలనుకుంటే 10 సార్లు ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. కొత్త సిమ్ కార్డులు అడ్డూ అదుపు పెరిపోతుండడం సమస్యగా మారిపోవడం, ఆన్ లైన్ మోసాలు పెరిపోవడం.. వీటని అరికట్టడానికే కఠినంగా కొత్త నియమాలు తీసుకొచ్చినట్లు టెలికమ్యూనికేషన్ శాఖ తెలిపింది.

Advertisement

Also Read: బ్యాంకు లో నెగిటివ్ బ్యాలెన్స్ తో డబ్బులు కట్ అవుతున్నాయా?.. ఇలా చేయండి.. తిరిగి వస్తాయి!!

కార్పొరేట్ కనెక్షన్ల పేరుతో ప్రైవేట్ కంపెనీలు లిమిట్ లేకుండా సిమ్ కార్డులు తీసుకోవడం సమస్యగా మారిందని.. కొత్త నియమాలతో ఒక కంపెనీ కేవలం 100 సిమ్ కార్డులు మాత్రమే కొనుగోలు చేయగలదు. పైగా కంపెనీల ఉద్యోగులు కార్పొరేట్ సిమ్ కార్డు కోసం కెవైసీ, ఇ వెరిఫికేషన్ తప్పనిసరిగా సమర్పించాలి.

Advertisement

Also Read:  ట్రైన్ లేట్ అయితే మీ డబ్బులు ఫుల్ రిఫండ్.. షరతులు వర్తిస్తాయి!

మరోవైపు ప్రజలకు మోసపూరిత ఫోన్ కాల్స్, స్పామ్ కాల్స్ రాకుండా టెలికామ్ రెగులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త చట్టం తీసుకురాబోతోంది. టెలికామ్ కంపెనీలు, మొబైల్ ఫోన్ కంపెనీల ద్వారా ఒక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఎఐ ఫీచర్ అనవసరమైన స్పామ్ కాల్స్, ఫ్రాడ్ కాల్స్ ను గుర్తించి వాటిని బ్లాక్ చేస్తుంది.

కొత్త నియమాలు చాలా కఠినంగా ఉండబోతున్నాయి. ఒక కస్టమర్ కు ఫేక్ కాల్స్ వస్తే.. దానికి టెలికామ్ కంపెనీ బాధ్యత వహించాలి. ఒకవేళ తనకు ఫేక్ కాల్స్ వస్తున్నాయని ఒక కస్టమర్ ఫిర్యాదు చేస్తే.. టెలికామ్ కంపెనీపై ఫిర్యాదు చేసే హక్కు అతనికి ఉంది. ఈ కొత్త నియమం వల్ల ప్రజలకు ఫేక్ కాల్స్ రావడం గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది.

Also Read: ఆఫర్లే ఆఫర్లు.. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ఫోన్లను ఇంత

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×