E-Paper
Advertisement

పసిడి ప్రియులకు షాక్.. గ్లోబల్ మార్కెట్‌లో పుంజుకున్న బంగారం-వెండి ధరలు

పసిడి ప్రియులకు షాక్.. గ్లోబల్ మార్కెట్‌లో పుంజుకున్న బంగారం-వెండి ధరలు
Advertisement

Gold Price Today: మధ్య ప్రాచ్య ఘర్షణలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో మదుపరుల చూపు లోహాలపై పడింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం-వెండి ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి. ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో సోమవారం మార్కెట్లో బంగారం-వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం.

మధ్యప్రాచ్య ఘర్షణలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అమెరికా-ఇరాన్ దాడులను ఇరు దేశాలు తాత్కాలికంగా నిలిపి వేశాయి. శాంతి నెలకొంటుందని భావించిన మదుపరులు ప్రాఫిట్ బుకింగ్‌కు పాల్పడ్డారు. క్రూడాయిల్ ధరలు సోమవారం 5 శాతానికి పడిపోయాయి. ప్రస్తుతం 93 డాలర్ల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. విలువైన మెటల్స్ అంతర్జాతీయ మార్కెట్లో ఎగబాకాయి.

Advertisement

మరోవైపు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయం కోసం పెట్టుబడిదారులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఒక శాతానికి పైగా పెరిగింది. నార్మల్‌‌గా కొన్నిరోజుల కిందటి వరకు క్రూడాయిల్ ధర పెరిగితే బంగారం ధర తగ్గడం కనిపించేది. క్రూడాయిల్ తగ్గితే బంగారం ధర పెరగడం ఇప్పుడు కనిపిస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ప్రస్తుతం ఔన్సుకు 4110 డాలర్లకు చేరింది. శుక్రవారం రోజు ఇది 4050 డాలర్ల దిగువన ఉండేది. సిల్వర్ ధర  అయితే 58 నుంచి 60 డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో డాలరుతో పోల్చితే రూపాయి విలువ రూ. 96.57 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. దీనికితోడు యూఎస్ డాలర్ ఇండెక్స్ 0.3 శాతం తగ్గినట్టు కనిపిస్తోంది.

Advertisement

అమెరికా -ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో భారత్  రిటైల్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ప్రధాన నగరాల్లో బంగారం-వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. సోమవారం మార్కెట్లో ఉదయం 10 గంటలకు బంగారం-వెండి ధరలు క్రమంగా పెరిగాయి.

bullions.co.in వెల్లడించిన మార్కెట్ ధరల ప్రకారం.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.770 పెరిగి రూ.1,44,510 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. ప్రస్తుతం  10 గ్రాములకు రూ.1,32,470 వద్ద ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధర భారీ పెరుగుదల నమోదు చేసింది. కిలో వెండి ధర రెండు వేలు పెరిగింది.  ప్రస్తుతం రూ.2,24,820 వద్ద కొనసాగుతోంది.

న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర- 10 గ్రాములు రూ. 144,010

22 క్యారెట్ల 10 గ్రాముల ధర- రూ. 132,009

కిలో వెండి  ధర -రూ. 224,320

ముంబైలో మార్కెట్లో బంగారం ధరలు 24 క్యారెట్ల  బంగారం ధర రూ. 144,260/10 గ్రాములు. 22 క్యారెట్ల బంగారం ధర-రూ. 132,238/10 గ్రాములు. ముంబైలో కిలో వెండి ధర- రూ. 224,710

బెంగుళూరు మార్కెట్లో బంగారం ధరలు 24 క్యారెట్ల  ధర రూ. 144,370/10 గ్రాములు. 22 క్యారెట్ల బంగారం ధర రూ.132,339/10 గ్రాములు. కిలో వెండి ధర రూ. 224,880.

కోల్‌కతా మార్కెట్లో బంగారం ధరలు 24 క్యారెట్ల  ధర రూ. 144,090/10 గ్రాములు. 22 క్యారెట్ల బంగారం ధర-రూ. 132,083/10 గ్రాములు. కిలో వెండి ధర-రూ 224,170 వద్ద ఉంది.

చెన్నైలో  మార్కెట్లో బంగారం ధర 24 క్యారెట్ల  ధర రూ.  144,700/10 గ్రాములు. 22 క్యారెట్ల బంగారం ధర-రూ. 132,642/10 గ్రాములు. కిలో వెండి ధర- రూ.225,120 వద్ద కొనుగోళ్లు జరుగుతున్నాయి.

ALSO READ: సీన్ రివర్స్.. రష్యాకు పెట్రోల్ ఎగుమతి చేస్తున్న భారత్.. విచిత్ర పరిస్థితి

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×