E-Paper
Advertisement

అదిరిపోయే ఫ్యామిలీ స్కూటర్ల ఎంట్రీ.. వీటిలో ఏది బెస్ట్ అంటే?

అదిరిపోయే ఫ్యామిలీ స్కూటర్ల ఎంట్రీ.. వీటిలో ఏది బెస్ట్ అంటే?
Advertisement

Upcoming Family Scooter Launches 2026: భారత్ లో స్కూటర్లకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజువారీ ప్రయాణాలకు, కుటుంబ అవసరాలకు ఎక్కువ మంది స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో టాప్ బ్రాండ్స్ అన్నీ కొత్త ఫ్యామిలీ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది భారత మార్కెట్లో విడుదల కానున్న నాలుగు ముఖ్యమైన ఫ్యామిలీ స్కూటర్ల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.ఏథర్ EL

ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ఏథర్ కొత్త EL ప్లాట్‌ ఫామ్ ఆధారంగా ఓ ఫ్యామిలీ స్కూటర్‌ను తీసుకురానుంది. ఈ స్కూటర్ ఆగస్టు 29న విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఏథర్ నుంచి వచ్చిన స్కూటర్లలో ఇదే అత్యంత సరసమైన మోడల్‌గా నిలిచే అవకాశముంది. డిజైన్ పరంగా ఇది సింపుల్‌గా, కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. కొత్త EL ప్లాట్‌ ఫామ్‌పై భవిష్యత్తులో మరిన్ని మోడళ్లను కూడా కంపెనీ తయారు చేయనుంది. ఇందులో 2 kWh నుంచి 5 kWh వరకు బ్యాటరీలను ఉపయోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 100 నుంచి 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని అంచనా.

2.సింపుల్ అరైవ్

Advertisement

సింపుల్ ఎనర్జీ కూడా కుటుంబ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సిద్ధం చేస్తోంది. దీనికి ‘అరైవ్’ అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 2న దీనిని మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, పొడవైన సింగిల్ సీట్, ట్విన్ షాక్ అబ్జార్బర్లు, TFT డిస్‌ప్లే, LED హెడ్‌ ల్యాంప్, LED టెయిల్ ల్యాంప్ లాంటి ఆధునిక ఫీచర్లు ఉండనున్నాయి. బ్యాటరీ సామర్థ్యం, రేంజ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు.

3.విన్‌ ఫాస్ట్ వైపర్ E

వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ సంస్థ కూడా భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా వైపర్ E స్కూటర్‌ను ఈ ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ స్కూటర్ పెద్ద వీల్స్, స్పోర్టీ డిజైన్, LED హెడ్‌లైట్లతో రానుంది. విదేశీ మార్కెట్లో ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. చిన్న బ్యాటరీతో 82 కిలోమీటర్ల వరకు, పెద్ద 3 kWh బ్యాటరీతో 145 కిలోమీటర్ల వరకు రేంజ్ లభిస్తుంది.

4.హోండా యాక్టివా 7G

Advertisement

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో హోండా యాక్టివా ఒకటి. ఇప్పుడు కంపెనీ కొత్త యాక్టివా 7Gపై పని చేస్తోంది. ఈ మోడల్ ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.  డిజైన్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా, కొన్ని కొత్త కాస్మెటిక్ అప్‌డేట్లు, క్రోమ్ ఫినిషింగ్‌తో మరింత ఆకర్షణీయంగా తీసుకురానున్నారు. అలాగే బయట ఫ్యూయల్ ఫిల్లర్, సైలెంట్ స్టార్టర్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ స్విచ్, సీటు కింద స్టోరేజ్ లాంటి కొత్త ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఇందులో ప్రస్తుతం ఉన్న 109cc ఇంజిన్నే కొనసాగించే అవకాశం ఉంది.

Read Also: సింగిల్ ఛార్జ్ తో 200 కిమీ రేంజ్.. భారత్‌ లో బెస్ట్ EV స్కూటర్లు ఇవే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×