E-Paper
Advertisement

ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేశాడు కట్ చేస్తే ఈ రోజు కోటీశ్వరుడు.. రోజుకు రూ.6.3 లక్షల ఆదాయం

ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేశాడు కట్ చేస్తే ఈ రోజు కోటీశ్వరుడు.. రోజుకు రూ.6.3 లక్షల ఆదాయం
Advertisement

కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను మార్చేసింది. చాలామంది ఉద్యోగాలు, వ్యాపారాలు కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి పరిస్థితినే అజిత్ కుమార్ కూడా ఎదుర్కొన్నాడు. అయితే అతనిలో కష్టపడే తత్వం, పట్టుదల జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. ఒకప్పుడు స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేసిన వ్యక్తి, ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు. అతని ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది.

చెదిరిపోయిన డాక్టర్ కల

ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన అజిత్ కుమార్ హర్యాణా రాష్ట్రం రోహ్తక్‌ జిల్లాలోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతున్నాడు. మంచి వైద్యుడిగా మారాలని అతను కలలు కనేవాడు. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో కుటుంబం తీవ్ర ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంది. అప్పుల భారం పెరగడంతో ఎంబిబిఎస్ చదువు మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. కుటుంబానికి అండగా నిలవడమే ముఖ్యమని అజిత్ నిర్ణయించుకున్నాడు.

స్విగ్గీ డెలివరీ పార్ట్‌నర్‌గా కష్టపడ్డ రోజులు

Advertisement

డబ్బు సంపాదించడానికి అజిత్ స్విగ్గీలో డెలివరీ పార్ట్‌నర్‌గా చేరాడు. కుటుంబ ఖర్చుల కోసం రోజుకు దాదాపు 16 గంటలు పనిచేశాడు. కొన్ని రోజులలో 100 కిలోమీటర్ల వరకు సైకిల్ తొక్కుతూ ఫుడ్ డెలివరీలు చేశాడు. ఈ పని అతను శారీరకంగా, మానసికంగా ఎంతో అలసిపోయేలా చేసింది. అయినా అతను వెనుకడుగు వేయలేదు. కానీ విధి మళ్లీ వెక్కిరించింది. డెలివరీ సమయంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. అజిత్ కుమార్‌కు తీవ్ర గాయాలతో శరీరంలోని అనేక ఎముకలు విరిగాయి. దాంతో అతను కొన్ని నెలలు మంచానికే పరిమితమయ్యాడు.

జీవితాన్ని మార్చేసిన రచన

ప్రమాదం కారణంగా ఇంటికే పరిమితమైన అజిత్.. ఆ సమయంలో కూడా ఖాళీగా ఉండడానికి ఇష్టపడలేదు. గాయాల నుంచి కోలుకుంటున్న సమయంలో ఇంటి నుంచి చేసే ఉద్యోగాల కోసం వెతికాడు. అప్పుడు పాకెట్ ఎఫ్‌ఎంలో కొత్త రచయితలు కావాలని ఒక ఉద్యోగ ప్రకటన చూశాడు. రచనలో పెద్దగా అనుభవం లేకపోయినా ప్రయత్నించాలని అజిత్ నిర్ణయించుకున్నాడు. ఆ ఒక్క నిర్ణయమే అతని జీవితానికి కొత్త దిశ చూపించింది.

కొద్ది నెలల్లోనే పెద్ద విజయం

Advertisement

పాకెట్ ఎఫ్ఎంలో చేరిన మూడు నెలల్లోనే అజిత్ రాసిన ఒక కథ.. రచనా పోటీలో అతడని విజేతగా చేసింది. మొదటి పారితోషికంగా అజిత్‌కు రూ.20 వేల అందుకున్నాడు. తరువాత రూ.52 వేల చెక్ వచ్చింది. అజిత్ రాసిన కథలకు ఆదరణ పెరుగుతుండటంతో ఆదాయం కూడా వేగంగా పెరిగింది. ఒక నెలలోనే రూ.6.29 లక్షల వరకు సంపాదించాడు. ఈ విజయం అతని ప్రతిభకు, కష్టానికి నిదర్శనంగా నిలిచింది.

భారత్‌లోనే అతిపెద్ద ఆడియో సిరీస్‌కు ప్రధాన రచయిత

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన అజిత్ కుమార్ ప్రస్తుతం పాకెట్ ఎఫ్ఎంలో ప్రసారమవుతున్న ‘బ్రహ్మయోధ: ది డిస్ట్రాయర్’ అనే పౌరాణిక ఆడియో సిరీస్‌కు ప్రధాన రచయితగా పనిచేస్తున్నాడు.
ఇప్పటికే ఈ సిరీస్ కోసం వెయ్యికి పైగా ఎపిసోడ్‌లు అజిత్ రచించాడు. ఈ సిరీస్‌కు 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం 1,151కు పైగా ఎపిసోడ్‌లు పబ్లిష్ అయ్యాయి.
ఈ కథను భవిష్యత్తులో 5,000కు పైగా ఎపిసోడ్‌ల వరకు తీసుకెళ్లాలని ప్రణాళిక రూపొందించాడు. ఇది భారతదేశంలోని అత్యంత పెద్ద ఆడియో ఫిక్షన్ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా గుర్తింపు పొందుతోంది.

Also Read: నెలకు రూ.10 లక్షల వరకు జీతం.. ప్రపంచమంతా తిరిగిరావొచ్చు.. ఇంటర్మీడియట్ ఉంటే చాలు

భవిష్యత్తుపై పెద్ద లక్ష్యాలు

రచయితగా అజిత్ కుమార్ ప్రయాణం ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం అతను ఐదు కొత్త దీర్ఘకాలిక నవలలపై కూడా పని చేస్తున్నాడు. కష్టాలను అవకాశాలుగా మార్చుకుంటే విజయం సాధించవచ్చని అజిత్ నిరూపించాడు.

ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ప్రయాణం

అజిత్ కుమార్ కథ ప్రతి ఒక్కరికీ ప్రేరణ. జీవితంలో ఎదురయ్యే కష్టాలు విజయానికి అడ్డంకులు కావని అతను నిరూపించాడు. ఒకప్పుడు కుటుంబాన్ని పోషించేందుకు ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేసిన యువకుడు, ఇప్పుడు కోటీశ్వర రచయితగా ఎదిగారు. సరైన సమయంలో వచ్చిన ఒక్క అవకాశం, దాన్ని అందిపుచ్చుకునే పట్టుదల ఉంటే జీవితం పూర్తిగా మారిపోతుందని అజిత్ కథ నిరూపించింది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×