E-Paper
Advertisement

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42
Advertisement

LPG Cylinder Price Hike:  పాత సినిమాలోని ఓ పాట ఉంది.. ‘ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు..  నాగులో నాగన్న ధరల రేట్లు పెరుగుతుండెనో’ ఆ సినిమా లిరిక్ మాదిరిగా ఉంది దేశంలో ధరల పరిస్థితి. నిన్నటి వరకు ఆయిల్‌పై ధరలు పెంచిన కంపెనీలు, ఇప్పుడు గ్యాస్ సిలెండర్లపై ఫోకస్ చేశాయి. తాజాగా మరోసారి కమర్షియల్ సిలిండర్లపై ధరలు భారీగా పెరిగాయి.

ఆయిల్ తర్వాత గ్యాస్‌ సిలిండర్ల ధరల వంతు మొదలు 

Advertisement

ఇరాన్‌-అమెరికా వ్యవహారం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హర్మూజ్‌ జలసంధి వద్ద నౌకల రవాణా నిలిచిపోయింది. ఫలితంగా ఆసియా దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యంగా భారత్‌పై దాని ప్రభావం తీవ్రంగా ఉంది. ఫలితంగా ఆయిల్, గ్యాస్ ధరలకు రెక్కలొచ్చాయి.

భారత్‌కు అవసరమైన గ్యాస్.. ఖతార్‌, సౌదీ, యూఏఈ దేశాల నుంచి వస్తుంది. జలసంధి మార్గంలో పరిస్థితులు ఇంకా అనుకూలించలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ ఇంధన కంపెనీలు వాణిజ్య గ్యాస్‌ స్టాక్‌ కాకుండా కనీసం 30 రోజులకు సరిపడా నిల్వలు చేయాలని సూచన చేసింది. ఈ క్రమంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ ధరలను ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ మరోసారి పెంచింది.

Advertisement

మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

19 కిలోల గ్యాస్ సిలిండర్‌పై రూ.42 పెంచుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రస్తావించింది. తాజాగా పెంచిన ధరలతో ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రూ. 3,113.50కి చేరింది. కోల్‌కతాలో మరింత ఎక్కువగా రూ. 53.50 పెంచేసింది. దీంతో అక్కడ గ్యాస్ సిలిండర్ ధర రూ. 3,255.50కి చేరింది. ముంబైలో సుమారు రూ. 3,024 కి చేరుకుంది.  5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ-FTL సిలిండర్ల ధరను రూ. 11 మేరా సవరించింది.

వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాలు నడుపుకునేవారికి అదనపు భారంగా మారింది. ఇలా పెంచుకుంటూ పోతే మా వ్యాపారాలు మూతపడడం ఖాయమని అంటున్నారు. మరో వైపు గృహ అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో గృహ వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు.

ALSO READ: బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×