E-Paper
Advertisement

Boeing Mass layoffs: 17000 మంది ఉద్యోగులను తొలగించనున్న బోయింగ్.. వేల కోట్ల నష్టమే కారణం..

Boeing Mass layoffs: 17000 మంది ఉద్యోగులను తొలగించనున్న బోయింగ్.. వేల కోట్ల నష్టమే కారణం..
Advertisement

Boeing Mass layoffs: అమెరికా విమాన తయారీ సంస్థ బోయింగ్ తాజాగా వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కంపెనీ ఉద్యోగుల్లో పది శాతం మందిని ఫైర్ చేస్తున్నట్లు బోయింగ్ అధికారులు తెలిపారు. కంపెనీ నిర్ణయంతో దాదాపు 17000 మంది తమ ఉద్యోగులు కోల్పోయే అవకాశముంది. బోయింగ్ కంపెనీ ఆర్థికంగా భారీ నష్టాలు ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం త్రైమాసికంలో బోయింగ్ విమాన తయారీ కంపెనీ అయిదు బిలియన్ డాలర్ల (దాదాపు రూ.42 వేల కోట్లు పైగా) భారీ నష్టాన్ని తెలిపింది.

బోయింగ్ కంపెనీ వర్కర్లు ఇటీవల నెల రోజులకు పైగా ధర్నాలు జరుగుతుండడంతో విమాన తయారీ పనులు ఆగిపోయాయని దాని వల్ల కూడా కంపెనీకి తీవ్ర నష్టం వాటిల్లిందని సమాచారం. బోయింగ్ కొత్త విమానం 777x కూడా తయారీ నిలిచిపోవడం.. దాని లాంచ్ లో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.బోయింగ్ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే దాని షేర్ల మార్కెట్ విలువ 1.1 శాతం పతనమైంది.

Advertisement

బోయింగ్ కంపెనీ సిఈఓ కెల్లీ ఓర్ట్ బర్గ్ ఈ విషయంపై స్పందిస్తూ.. ఉద్యోగులను తప్పనిసరి పరిస్థితుల్లో ఫైర్ చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థికంగా సంస్థ కోలుకోవాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. బోయింగ్ వర్కర్ల నిరసనలతో బోయింగ్ 737 మ్యాక్స్, 737, 777 జెట్ విమానాల తయారీ నిలిచిపోయంది. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఉన్నతస్థాయి అధికారులు, మేనేజర్లు, సిబ్బంది అందరూ ఉన్నారని సిఈఓ కెల్లీ ఓర్ట్ బర్గ్ వెల్లడించారు.

Also Read:  పురుషుల కంటే మహిళా సిఈఓల సంపాదనే ఎక్కువ .. కాన్ఫెరెన్స్ బోర్డు రిపోర్టు

Advertisement

ఆగస్టు నెలలో బోయింగ్ సిఈఓగా బాధ్యతలు చేప్పటిన కెల్లీ ఆర్ట్ బర్గ్ సంస్థ యజమాన్యం, ఉద్యోగులు, కార్మిక యూనియన్ మధ్య సంబంధాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. బోయింగ్ కంపెనీకి తన డిఫెన్స్ సెక్టార్ విమాన ఉత్పత్తులపై ప్రభుత్వం విధించిన ప్రీ ట్యాక్స్ చార్జీలు కారణంగానే అయిదు బిలియన్ డాలర్లు తీవ్ర నష్టం చవిచూడాల్సి వచ్చిందని కెల్లీ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం ధర్న చేస్తున్న కార్మికులు.. భారీ సంఖ్యలో ఉద్యోగల తొలగింపు కారణంగా ధర్నా విరమించే అవకాశముందని వ్యాపార నిపుణలు అభిప్రాయపడ్డారు. గ్రేట్ హిల్ క్యాపిటల్ అనే ఫైనాన్స్ సంస్థకు చెందిన థామస్ హయేస్ ఈ విషయంపై స్పందిస్తూ.. కార్మికులు, యజమాన్యం మధ్య చర్చలు వెంటనే జరపాలని.. ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించడం సమస్యకు పరిష్కారం కాదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ధర్నా చేస్తున్న కార్మికుల యూనియన్ పై బోయింగ్ సంస్థ కేసు నమోదు చేసింది. ధర్నాలు జరగడం వల్ల పనులు ఆగిపోయి సంస్థకు ప్రతినెల బిలియన్ డాలర్ల దాకా నష్టం వాటిల్లుతోందని కంపెనీ అధికారులు పేర్కొన్నారు. దీంతో సంస్థ క్రెడిట్ రేటింగ్ తగ్గిపోతోందని అన్నారు.

ధర్నాల కారణంగా జరిగిన జాప్యం వల్ల బోయింగ్ కంపెనీ తన తదుపరి విమానం 777X ని 2026లోనే డెలివరీ చేయనుందని తెలుస్తోంది. నష్టాల కారణంగా 767 కార్గో ఫ్రెయిట్ విమానాల తయారీ నిలిపిస్తున్నట్లు, ఢిఫెన్స్ రంగం కోసం KC-46A ట్యాంకర్ విమానాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు బోయింగ్ తెలిపింది.

నష్టాల నుంచి బయటపడడానాకి బోయింగ్ సంస్థ మార్కెట్ నుంచి ఈక్విటీ, డెట్ రూపంలో 60 బిలియన్ డాలర్లు తీసుకునే యోచనలో ఉంది.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×