// // iphone 16 Delivery in 10 minutes | పది నిమిషాల్లోనే ఐఫోన్ 16 డెలివరీ.. ఎక్కడ ఆర్డర్ చేయాలంటే.. -->
E-Paper
Advertisement

iphone 16 Delivery in 10 minutes : పది నిమిషాల్లోనే ఐఫోన్ 16 డెలివరీ.. ఎక్కడ ఆర్డర్ చేయాలంటే..

iphone 16 Delivery in 10 minutes : పది నిమిషాల్లోనే ఐఫోన్ 16 డెలివరీ.. ఎక్కడ ఆర్డర్ చేయాలంటే..
Advertisement

iphone 16 Delivery in 10 minutes | కొత్తగా లాంచ్ అయిన యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఎదురు చూసే అభిమానుల సెప్టెంబర్ 20తో వెయిటింగ్ టైమ్ ముగిసింది. ఇండియాలో శుక్రవారం ఐఫోన్ 16 సిరీస్ అన్ని మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. సెప్టెంబర్ 13 నుంచే ఐపోన్ బుకింగ్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఐఫోన్ అభిమానులు ప్రీ ఆర్డర్లు భారీగానే వచ్చాయి.

ఇప్పటికే ఢిల్లీ, ముంబై లోని యాపిల్ అఫీషియల్ స్టోర్స్ లో ఐఫోన్ 16 సిరీస్ అన్ని మోడల్స్ అందుబాటులో ఉండగా.. కంపెనీ అఫీషియల్ వెబ్ సైట్ నుంచి, ఇతర ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ నుంచి కూడా యూజర్లు ఐఫోన్ 16 కోసం ఆర్డర్ చేయొచ్చు. అంతర్జాతీయంగా ఐఫోన్ 16 సిరీస్ ని సెప్టెంబర్ 9 యాపిల్ కంపెనీ లాంచ్ చేయగా.. ఇండియాతో సహా మొత్తం 58 దేశాల్లో ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ అన్నీ సెప్టెంబర్ 20న యూజర్లకు అందుబాటులో వచ్చాయి.

Advertisement

Also Read: ఇండియాలో చీపెస్ట్ బ్యాటరీ కార్.. ధర రూ.5 లక్షల కంటే తక్కువే!

ఐఫోన్ 16 డెలివరీ 10 నిమిషాల్లోనే
ఐపోన్ 16 స్మార్ట్ ఫోన్స్ కోసం బారుల తీరే అభిమానులకు యాపిల్ కంపెనీల శుభవార్త తెలిపింది. టాటా క్రోమాకు డెలివరీ పార్టనర్ అయిన బిగ్ బాస్కెట్ ఆన్ లైన్ గ్రోసరీ సంస్థ ఐఫోన్ 16 డెలీవరీని ఆర్డర్ చేసిన కేవలం 10 నిమిషాల్లోనే చేస్తుందని ప్రకటించింది. అందుకోసం యూజర్లు బిస్ బాస్కెట్ యాప్ లో ఎలెక్ట్రానిక్స్ కేటగిరీలోకి వెళ్లి ఐఫోన్ సిరీస్ అని కొనుగోలు చేయాలి. బిగ్ బాస్కెట్ కంపెనీ ఐఫోన్ 16 డెలివరీ మాత్రం 10 నిమిషాల్లోనే చేస్తామని దావా చేసింది. అయితే సూపర్ ఫాస్ట్ డెలివరీ సర్వీస్ కేవలం ఢిల్లీ, ముంబై, బెంగుళూరు నగరాల్లో మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉంది.

Advertisement

ఐఫోన్ 16 ధర, ఆఫర్లు
యాపిల్ ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ.79,900, ఐఫోన్ 16 ప్లస్ ధర రూ. 89,900. అదే ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధర రూ.1,19,900, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర రూ.1,44,900. అన్ని ఐఫోన్ 16 సిరీస్ కొనుగోలు చేసేవారికి యాపిల్ కంపెనీ ఇన్‌స్టెంట్ బ్యాంక్ డిస్కౌంట్ రూ.5000 ప్రకటించింది. ఈ ఆఫర్ అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్స్ పై అందుబాటులో ఉంది. దీంతోపాటు కంపెనీ క్యాష్ బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ కూడా ప్రకటించింది.

Also Read:  ఇండియాలో పెళ్లిళ్ల సీజన్ పీక్స్.. కేవలం రెండు నెలల్లో రూ.4.25 లక్షల కోట్ల బిజినెస్

ఢిల్లీ, ముంబైలోని కస్టమర్లు యాపిల్ స్టోర్ల నుంచి స్టోర్ పికప్ లేదా హోమ్ డెలివరీ రెండు విధాలుగా ఐఫోన్ 16 మోడల్స్ కొనుగోలు చేయవచ్చు. మిగతా నగరాల్లో ఈ కామర్స్ ద్వారా కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి.

ఐఫోన్ 16 సిరీస్ ఫీచర్స్
ఐఫోన్ 16 సిరీస్ లో యాపిల్ కంపెనీ చాలా మార్పులు చేసింది. ఐఫోన్ 16, 16 ప్లస్ మాడల్స్ లో డిజైన్, కెమెరాల్లో ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే ఐఫోన్ 16 ప్రో మాడల్స్ లో కొత్తగా A18 ప్రో బయోనిక్ చిప్ తో పాటు పెద్ద బ్యాటరీ కూడా లభిస్తుంది. ఈ కొత్త 16 సీరస్ ఫోన్స్ అన్నీ యాపిల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్ ని కలిగి ఉంటాయి. iOS 18 ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఈ మాడల్స్ అన్నీ రన్ అవుతాయి.

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×