E-Paper
Advertisement

Anant Ambani’s Car Collections: అంబానీ కొడుకా మాజాకా.. కోట్ల రూపాయల కార్లను వాడేస్తున్న అనంత్ అంబానీ!

Anant Ambani’s Car Collections: అంబానీ కొడుకా మాజాకా.. కోట్ల రూపాయల కార్లను వాడేస్తున్న అనంత్ అంబానీ!
Advertisement

Anant Ambani’s Car Collections: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచంలోని సంపన్నుల్లో ఒకరు. ముఖేష్ అంబానీ, అతని కుటుంబం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లను వినియోగిస్తారు. తన తండ్రిలాగే అనంత్ అంబానీకి విలాసవంతమైన కార్లంటే చాలా ఇష్టం. అతని కార్ల కలెక్షన్స్‌లో ఫెరారీ లంబోర్ఘిని నుండి రోల్స్ రాయిస్ వరకు కొన్ని ప్రత్యేకమైన కార్లు ఉన్నాయి. ఇప్పుడు అనంత్ అంబానీకి ఏ కార్లు ఉన్నాయి..? మార్కెట్లో వాటి ధర ఎంత..? తదితర వివరాలు తెలుసుకుందాం.

Rolls-Royce Cullinan
ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలాసవంతమైన కార్లకు పేరుగాంచిన రోల్స్ రాయిస్ కల్లినన్ అనత్ అంబానీ కార్ కలెక్షన్స్‌లో ఉంది. ఈ లగ్జరీ SUVలో అమర్చిన ఇంజన్ 563 BHP పవర్‌ని రిలీజ్ చేస్తుంది. మార్కెట్‌లో దీని ధర రూ.6.95 కోట్లు.

Advertisement

Rolls-Royce Phantom
అనంత్ అంబానీ కలెక్షన్‌లో రోల్స్ రాయిస్ ఫాంటమ్ కూడా ఉంది. దీని ధర దాదాపు రూ.9.5 కోట్లు. ఈ సెడాన్ కారులో కంపెనీ 6.7 లీటర్ వి12 ఇంజన్‌ను అందిస్తుంది. కంపెనీ ఇతర మోడల్‌ల మాదిరిగానే ఇందులో కూడా లగ్జరీ ఫీచర్లను చూడొచ్చు. దీని ఎక్ట్సీరియర్‌తో పాటు ఇంటీరియర్‌ని కూడా మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు.

Also Read: కిట్లు.. గ్యాస్ ఎలా నింపుతారు? మైలేజీ ఎంత ఇస్తుందో తెలుసా?

Advertisement

Ferrari Purosangue
శక్తివంతమైన ఇంజన్‌తో కూడిన లగ్జరీ అలానే స్పోర్ట్స్ కారుగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపును కలిగి ఉన్న ఫెరారీ కూడా అనంత్ అంబానీ కలెక్షన్స్‌లో ఉంది. తాజాగా ఈ కారులో అనంత్ అంబానీ కనిపించారు. ఈ కారు 6496 cc V12 65 డిగ్రీ ఇంజన్‌తో వస్తుంది. ఇది గంటకు 310 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పరుగులు పెట్టగలదు. కేవలం 3.3 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కి.మీల వేగాన్ని అందుకుంటుంది.

Bentley Bentayga
లగ్జరీకి కార్లకు పేరుగాంచిన బెంట్లీ కంపెనీ బెంటాగ్యాను కూడా అందిస్తుంది. అనంత్ అంబానీ సేకరణలో ఉన్న కార్లలో ఈ కారు కూడా ఒకటి. లగ్జరీ ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు చెందిన ఈ వాహనం ధర దాదాపు రూ. 4.10 కోట్లు. కంపెనీ దీనిలో కస్టమైజ్ వేరియంట్లరు కూడా అందిస్తోంది.

Also Read: కొత్త లుక్‌తో టీవీఎస్ జూపిటర్.. పిచ్చెక్కిస్తోన్న ఫీచర్లు!

Bentley Continental GT
బెంట్లీ కంపెనీ కాంటినెంటల్ GTని కూడా అందిస్తుంది. కంపెనీ అందించే అత్యంత లగ్జరీ కార్లలో ఇది ఒకటి. ఇందులో అమర్చిన ట్విన్ టర్బో వీ8 ఇంజన్ 542 హార్స్ పవర్‌ల శక్తిని అందిస్తుంది. దీని కారణంగా 0-100 కి.మీ వేగాన్ని అందుకోవడానికి కేవలం నాలుగు సెకన్లు మాత్రమే పడుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 318 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీని ధర రూ.5.03 కోట్లు.

Tags

Related News

ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్‌పైపర్ సేల్స్‌పై బ్యాన్.. ఆ ఫ్లేవర్ కారణంగానే

సాలరీ అకౌంట్‌లో పగడానే ఖర్చుచేస్తున్నారా? సేవింగ్స్ పెంచుకోవడానికి టిప్స్ ఇవిగో

యూపీఐ యూజర్లకు అలర్ట్.. త్వరలో ‘Yes or No’ విధానం.. ఇక పేమెంట్లు గంట ఆలస్యం!

కిరాణా సరుకులు కొనడానికి కూడా అప్పులు.. ధరల మోతతో అగ్రరాజ్యంలో సామాన్యులు విలవిల

బంగారం ధరలు మాటేంటి..? మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్య ఉండదు, బ్యాంకులకు RBI కీలక ఆదేశాలు

రూ.99 లేదా రూ.999.. దీని వెనుక ఇంత కథ ఉందా? దొంగల కోసమా? పత్రిక కోసమా?

టూత్ పేస్ట్, సబ్బు, షాంపూ.. అన్ని నిత్యావసరాల ధరలు పెంచనున్న కంపెనీలు

Big Stories

Advertisement
×