// // Ramya Moksha - తనూజ వల్లే రమ్య అవుట్.. -->
E-Paper
Advertisement

Ramya Moksha: తనూజ వల్లే రమ్య అవుట్.. పిక్కిల్స్‌ పాప ఎలిమినేషన్‌ కి కారణాలివే!

Ramya Moksha: తనూజ వల్లే రమ్య అవుట్.. పిక్కిల్స్‌ పాప ఎలిమినేషన్‌ కి కారణాలివే!
Advertisement

Reason of Ramya Moksha Elimination: పక్కిల్స్‌ పాప రమ్య మోక్ష ఈ వారం ఎలిమినేట్‌ అవుతుందంటూ సోషల్‌ మీడియా ఫుల్‌ ప్రచారం జరుగుతుంది. ఓటింగ్స్ కూడా అదే చెబుతున్నాయి. అందరికంటే తక్కువ ఓట్లు తెచ్చుకుని రమ్య లీస్ట్‌లో ఉంది. కాగా బిగ్‌ బాస్‌ 9 తెలుగు ఏడో వారం నామినేషన్‌లో మొత్తం ఎనిమిది ఉంది ఉన్నారు. రీతూ, తనూజ, రాము రాథోడ్, కళ్యాణ్‌ పడాల, సంజన, దివ్య, సాయి , రమ్యలు ఉన్నారు. దీంతో వీరద్దరి కంటే తక్కువ ఓట్లు రమ్యకు వచ్చాయని, దీంతో ఈ వారం పచ్చళ్ల పాప బయటకు రావడం పక్కా అంటున్నారు. దీంతో రమ్య ఎలిమినేషన్‌ హాట్‌ టాపిక్‌ అయ్యింది. రెండు వారాలకే ఆమె బయటకు రావడం అందరిని షాకిస్తుంది.

జిమ్‌ వీడియోలు, రీల్స్‌ తో ఫేమస్

Advertisement

దీంతో ఆమె ఎలిమినేషన్‌కి కారణాలపై సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. రమ్య మోక్ష.. ఈ పేరు కంటే అలేఖ్యా చిట్టి పిక్కిల్స్‌ పేరుతో ఈమె బాగా పాపులర్‌ అయ్యింది. వాట్సప్‌ చాట్‌తో తమ పచ్చళ్ల కొనాలంటే కెరీర్‌ ఫోకస్‌పెట్టాలంటూ బూతులు మాట్లాడి వైరల్‌ అయ్యారు ఈ పిక్కిల్స్‌ సిస్టర్స్‌. మరోవైపు జిమ్‌ వీడియోలు, రీల్స్‌తో రమ్య మోక్ష సోషల్‌ మీడియాలో ఫుల్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. ముట్టుకుంటే కందిపోతుందనేంత గ్లామర్‌తో నెటిజన్లను ఆకట్టుకుంది. దీంతో ఆమెకు ఫాలోయింగ్‌ కూడా బాగా పెరిగిపోయింది. ఆమెకు వచ్చిన ఫాలోయింగ్‌తో రమ్య మూవీ ఆఫర్‌ కూడా కొట్టేసింది. అదే క్రేజ్‌తో రమ్య బిగ్‌ బాస్‌ ఆఫర్‌ కూడా కొట్టేసింది. వైల్డ్‌ కార్డ్‌ గా గత వారం హౌజ్‌ లోకి అడుగుపెట్టింది. వచ్చిరాగానే హౌజ్‌లో రూమర్స్‌ మొదలుపెట్టింది.

వచ్చిరాగానే గాసిప్స్

మాధురితో కలిసి తనూజపై బ్యాక్‌ బిచ్చింగ్‌ చేసింది. కళ్యాణ్‌ అంత అమ్మాయిల పిచ్చోడేంటి, చేతులు పట్టుకుని నొక్కెయడం, భూజాలు తడుమడం ఏంటబ్బా ఇది. అంటూ కళ్యాణ్‌ క్యారెక్టర్‌ని బ్యాడ్‌ చేస్తూ మాట్లాడింది. ఆ తర్వాత తనూజ కూడా కళ్యాణ్‌ అలా చేస్తుంటే వద్దు అనడం లేదు. అతడు చేతులేస్తుంటే వేయించుకుంటుంది.. నేనైతానా చెంపలు వాయించేదాన్ని అంటూ తనూజ క్యారెక్టర్‌ని బ్యాడ్ చేసేలా కామెంట్స్‌ చేసింది. అక్కడే రమ్యకు నెగిటివిటీ మొదలైంది. మరి నువ్వు హౌజ్‌లో ఏమాత్రం ఆడతావో చూస్తుమంటూ రమ్యని టార్గెట్‌ చేశారు తనూజ ఫ్యాన్స్‌. అలాగే తన తీరుతో కూడా రమ్య వచ్చిన రోజు వ్యతిరేకత తెచ్చుకోంది. అలాగే హోస్ట్‌ నాగార్జునతో కూడా చీవాట్లు తిన్నది. నేషనల్‌ మీడియాలో ఇలాంటి కామెంట్స్‌ చేయడం తప్పు అంటూ చీవాట్లు పెట్టాడు. వారం తర్వాత నామినేషన్‌లోనూ ఇదే పాయింట్‌తో తనూజని నామినేట్ చేసింది. తనూజ కూడా రమ్యను నామినేట్‌ చేసింది. అప్పుడు తనూజ రమ్యకు గట్టిగా ఇచ్చిపడేసింది.

ఇచ్చిపడేసిన తనూజ

Advertisement

అలాగే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటూ మాధురి ఇచ్చిన స్టేట్‌మేంట్‌ని కూడా విజిల్‌ గట్టి సమాధానం ఇచ్చింది తనూజ. నామినేషన్‌ బంధాలు, లవ్‌ ట్రాక్స్‌ తప్పితే గేమ్‌ ఎక్కడ కనిపించలేదని తనూజపై అంత రెచ్చిపోయింది ఈ పిక్కల్స్‌ పాప. మరి తన గేమ్‌ ఎక్కడ. రెండు వారాలపై రమ్య మోక్ష హౌజ్ పెద్దగా కనిపించడం లేదు. హౌజ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆ ఒక్కరోజు తప్పితే మళ్లీ ఎక్కడ కనిపించలేదు. ఆ తర్వాత మళ్లీ ఈ నామినేషన్‌లో కనిపించింది. గొడవలు, బ్యాక్‌ బిచ్చింగ్‌ సై అంటున్న రమ్య.. టాస్కుల్లో మాత్రం వెనకలా ఉంటుంది. ఇప్పటి వరకు ఏ టాస్క్‌ల్లో రమ్య ఆడినట్టు, ఎఫర్ట్స్ పెట్టినట్టు కనిపించలేదు. దీంతో ఒకరికి చెప్పేముందు నువ్వేంటో చూసుకోవాలి.. ఐదువారాలపైనే ఉన్న తనూజను ఆట ఆడటం లేదని జడ్జ్‌ చేసిన నువ్వు.. రెండు వారాలు ఏం గేమ్‌ ఆడావ్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. రమ్య మోక్ష ఎలిమినేట్‌ అవ్వాలంటే ఓటింగ్‌లో తమ అక్కసు తీర్చుకున్నారు నెటిజన్స్‌. దీంతో తక్కువ ఓట్లతో రమ్య ఈ వారం హౌజ్‌ నుంచి బయటకు వెళ్లే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×