// // Bigg Boss Winner : బిగ్ బాస్ విన్నర్ గా గౌరవ్ ఖన్నా.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..? -->
E-Paper
Advertisement

Bigg Boss Winner : బిగ్ బాస్ విన్నర్ గా గౌరవ్ ఖన్నా.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

Bigg Boss Winner : బిగ్ బాస్ విన్నర్ గా గౌరవ్ ఖన్నా.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
Advertisement

Bigg Boss Winner : బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రస్తుతం అన్నీ ఇండస్ట్రీలలో ప్రసారం అవుతుంది. అన్ని సీజన్లోతో పోలిస్తే హిందీ బిగ్ బాస్ మాత్రం 18 సీజన్లు పూర్తి చేసుకొని నిన్నటితో 19 కూడా ముగింపు పలికింది.. మూడు నెలలు విమర్శలు, డ్రామా, లవ్ ఎఫైర్స్ వినోదాల తర్వాత గౌరవ్ ఖన్నా బిగ్ బాస్ 19 విజేతగా నిలిచాడు. ఆదివారం రాత్రి బిగ్ బాస్ సీజన్ 19 కు ముగింపు పలికింది.. సల్మాన్ ఖాన్ గౌరవ్ ను విన్నర్ గా అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గత మూడు నెలలుగా గౌరవ్ తన ఆటతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఫైనల్ గా విన్నర్ అయ్యి భారీ ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నాడు.. గౌరవ్ విన్నర్ గా నిలవడంతో ఆయన ప్రైజ్ మనీ ఎంతో తెలుసుకోవాలని నెటిజెన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.. గౌరవ విన్నర్ గా అందుకున్న ప్రైజ్ మనీ ఎంత? ఆతనికి బిగ్ బాస్ ఇచ్చిన సర్ప్రైజ్ లు ఏవో ఒకసారి తెలుసుకుందాం..

గౌరవ్ అందుకున్న బిగ్ బాస్ ప్రైజ్ మనీ..

బిగ్ బాస్ 19 హిందీ సీజన్ లో గౌరవ్ ఖన్నా విన్నర్ గా నిలిచాడు.. మూడు నెలలుగా గౌరవ్ ప్రతి టాస్క్లను చిరుత పులిలా విజృంభిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. ఫైనల్ గా అందరూ ఊహించినట్లే విన్నర్ గా నిలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. రూ. 50 లక్షల ప్రైజ్ మనీని ఇంటికి తీసుకెళ్లాడు. అంతే కాకుండా కారు కూడా సొంతం చేసుకున్నాడు. గౌరవ్ ఖన్నా ఇప్పటికే సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ టైటిల్ ను కూడా సొంతం చేసుకున్నాడు.. టాప్ 5 కంటెస్టెంట్స్ గా నిలిచిన ఫర్హానా భట్, తన్యా మిట్టల్, ప్రణీత్ మోర్, అమాన్ మల్లిక్ లను ఓడించి విన్నర్ గా నిలిచాడు. ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఫర్హానా మొదటి రన్నరప్ గా, ప్రణీత్ మోర్ రెండో రన్నరప్ స్థానంలో నిలిచారు..

గౌరవ్ కు మూవీ ఛాన్స్..

Advertisement

బిగ్ బాస్ లో విన్నర్ గా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది బిగ్ బాస్ ఇస్తూ ఉంటాడు. హోస్ట్ కానీ ఆ షో గెస్ట్లుగా వచ్చిన వాళ్ళు కానీ మూవీలో ఛాన్స్ ఇస్తూ వస్తారు.. అలాగే బిగ్ బాస్ విన్నర్ గౌరవ్ కి కూడా సల్మాన్ ఖాన్ అదిరిపోయే ఛాన్స్ ఇచ్చాడు.. సల్మాన్ ఖాన్ తో యాక్ట్ చేసే ఛాన్స్ కూడా కొట్టేశాడు గౌరవ్ ఖన్నా. సీజన్ చివరి వీకెండ్ కా వార్ లో సల్మాన్ ఖాన్ వచ్చి గౌరవ్ ప్రశాంతమైన, స్థిరమైన స్వభావాన్ని ప్రశంసించాడు.. అతనికి ఈ సీజన్ చాలా విమర్శలు అందుకున్న సరే విన్నర్ విషయంలో మాత్రం అన్యాయం జరగకుండా పూర్తి చేసుకుంది..

Also Read : ఈ వారం ఓటీటీలోకి 14 సినిమాలు.. మూవీ లవర్స్ డోంట్ మిస్…

గౌరవ్ ఇండస్ట్రీ జర్నీ.. 

Advertisement

బాలీవుడ్ నటుడు గౌరవ్ సీరియల్స్ నటుడుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అనుపమలో అనుజ్ కపాడియా పాత్రకు, సిఐడిలో సీనియర్ ఇన్స్పెక్టర్ కవిన్ పాత్రకు ఈయన పెట్టింది పేరు.. యే ప్యార్ నా హోగా కమ్ లో యామీ గౌతమ్ సరసన నటించాడు.. చెఫ్ గా కూడా సత్తాను చాటుకున్నాడు.

?igsh=czAyYW0wcjJnMTRs

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×