// // Divvela Madhuri - బిగ్‌బాస్ ఆఫర్‌పై స్పందించిన దువ్వాడ కపుల్స్.. మాధురీని అలా అనేశాడేంటి? -->
E-Paper
Advertisement

Divvela Madhuri: బిగ్‌బాస్ ఆఫర్‌పై స్పందించిన దువ్వాడ కపుల్స్.. మాధురీని అలా అనేశాడేంటి?

Divvela Madhuri: బిగ్‌బాస్ ఆఫర్‌పై స్పందించిన దువ్వాడ కపుల్స్.. మాధురీని అలా అనేశాడేంటి?
Advertisement

Divvela Madhuri Reacts in Bigg Boss Offer: దివ్వెల మాధురి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్‌ మీడియాలో ఈమెకు ఉండే ఫాలోయింగ్‌ అంతా ఇంత కాదు. ఈ పేరు వినగానే.. పొలిటిషియన్‌ దువ్వాడ శ్రీనివాస్‌ కూడా గుర్తొస్తారు. ఈ జంట ఎప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా నిలుస్తోంది. ఏ రేంజ్‌లో ట్రోల్స్‌ ఎదుర్కొంటున్నారో.. అదే స్థాయిలో ఫాలోయింగ్‌ కూడా ఉంది. ఎప్పుడు ఏదోకరకంగా వార్తల్లో, సోషల్‌ మీడియాలో నిలిచే ఈ జంట తాజాగా ప్రముఖ మీడియా ఛానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా దివ్వెల మాధురి బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి రావడంపై క్లారిటీ ఇచ్చారు.

బిగ్ బాస్ నుంచి పిలుపు

Advertisement

కాగా త్వరలోనే బిగ్‌బాస్‌ తెలుగు 9 సీజన్‌లో గ్రాండ్‌ మొదలు కానుంది. ఈసారి కంటెస్టెంట్స్‌ ఎవరనేది ఇంకా క్లారిటీ లేదు. ఈ సీజన్‌లో సామాన్యులకు ఎంట్రీ ఉండటంతో అంతా వారెవరా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సెలబ్రిటీ కంటెస్టెంట్స్‌పై కాస్తా ఫోకస్‌ దక్కిందని చెప్పాలి. ప్రస్తుతం బిగ్‌ బాస్‌ అగ్నీ పరీక్ష సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. సామాన్యులను పక్కన పెడితే.. బిగ్‌బాస్‌లోకి వచ్చే సెలబ్రిటీ కంటెస్టెంట్‌ జాబితా ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో దివ్వెల మాధురి పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. ఈసారి బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఆమె అడుగుపెట్టతోందనే ప్రచారం గట్టిగానే జరుగుతుంది.

బిగ్ బాస్ హౌజ్ లో దువ్వాడ కపుల్స్

బిగ్‌బాస్‌ టీం దివ్వెల మాధురి సంప్రదించిందని, దీనికి ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చిందనే టాక్‌ వినిపిస్తోంది. అయితే తాజాగా ఇంటర్య్వూలో స్వయంగా దివ్వెల మాధురి బిగ్‌బాస్‌ ఆఫర్‌పై స్పందించింది. ఈ ఇంటర్య్వూలో దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి జంటగా పాల్గొన్న వీరిని బిగ్‌బాస్‌ అంశంపై హోస్ట్‌ ప్రశ్నించారు. మేడంని బిగ్‌బాస్‌కి పంపించోచ్చు కదా సర్‌ అని హోస్ట్‌ ప్రశ్నించారు. దీనికి దువ్వాడ శ్రీనివాస్‌ స్పందిస్తూ.. మాకు బిగ్‌బాస్‌ నుంచి కబురు వచ్చింది. స్వయంగా బిగ్‌బాస్‌ టీం వచ్చింది కలిసింది. కానీ, తను బిగ్‌బాస్‌కు వెళ్తుందా? లేదా? అనేది క్లారిటీ లేదు. ఈ విషయమై తను ఇంకా ఆలోచిస్తోంది. చూడాలి.

Advertisement

కానీ, తను లేకుండ నేను ఒంటరిగా ఉండలేను. ఇంకా మేమిద్దరం కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ టైంలో తను బిగ్‌బాస్‌కి వెళితే.. అంతా డిస్టర్బ్‌ అవుతుందనిపిస్తోంది. అందుకు వెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తోంది” అని చెప్పుకొచ్చారు. అలాగే వారిద్దరు జంటగా హౌజ్‌లోకి వచ్చే అవకాశం ఉందా? అని హోస్ట్‌ ప్రశ్నించారు. దీనికి ఆయన ఆ ఛాన్స్‌ లేదని, తమకు అలా అసలు ఇష్టం లేదని తేల్చేశారు. దీంతో దివ్వెల మాధురి బిగ్‌బాస్‌ ఆఫర్‌పై క్లారిటీ వచ్చేసింది. మరీ ఆమె హౌజ్‌లోకి వస్తారా? లేదా? అనేది క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే. కాగా సెప్టెంబర్‌ 7 బిగ్‌బాస్‌ తెలుగు 9లో గ్రాండ్‌గా లాంచ్‌ కానుంది. ఈ సారిలో హౌజ్‌లో కంటెస్టెంట్‌గా వచ్చే జాబితాలో సోషల్‌ మీడియా ఇన్‌ప్లూయేన్సర్‌ రితూ చౌదరి, కల్పిక గణేష్‌, ఫోక్‌ సింగర్‌ లక్ష్మణ్‌, గుప్పెడంత మనసు ఫేం ముఖేష్‌ గౌడ పేర్లు వినిపిస్తున్నాయి.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×