// // Bigg Boss 9 Madhuri- బిగ్‌బాస్‌ రెమ్యునరేషన్‌పై మాధురి రియాక్షన్‌! -->
E-Paper
Advertisement

Bigg Boss 9 Madhuri: వాళ్లు రెమ్యునరేషన్‌ ఇచ్చేదేంటి.. నాకే నెలకు కోటి వస్తుంది.. దివ్వెల మాధురి

Bigg Boss 9 Madhuri: వాళ్లు రెమ్యునరేషన్‌ ఇచ్చేదేంటి.. నాకే నెలకు కోటి వస్తుంది.. దివ్వెల మాధురి
Advertisement

Bigg Boss 9 Madhuri Remuneration: దివ్వెల మాధురి ప్రస్తుతం ఈ పేరు సోషల్‌ మీడియాలో మారుమ్రోగుతుంది. ఇటీవల బిగ్‌ బాస్‌ నుంచి బయటకు వచ్చిన మాధురి వరుస ఇంటర్య్వూలతో బిజీ అయిపోయింది. ఈ సందర్భంగా బిగ్‌ బాస్‌ షో, తన ఎలిమినేషన్‌ సంబంధించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంది. వైల్డ్‌ కార్డ్స్‌ ఎంట్రీకి బిగ్‌ బాస్‌ షో ఎలా ఉండేదో తెలిసిందే. ఫ్యామిలీ ఎపిసోడ్‌లో స్లోగా సాగింది. వైల్డ్స్‌ ఎంట్రీతో అసలైన బిగ్‌ బాస్‌ షోని చూశాం. గోడవలు, గాసిప్స్‌, ప్రేమలు, లవ్‌ ట్రాక్స్‌ ఆడియన్స్‌కి కావాల్సినంత స్టఫ్‌ దొరికింది. హౌజ్‌లో గొడవలకు కొదువే లేదు. దీనికి కారణం మాధురి. వైల్డ్‌ కార్డ్‌గా హౌజ్‌ లోపలికి వెళ్లిన మాధురి కంటెస్టెంట్స్‌ కి చుక్కలు చూపించింది.

హౌజ్ లో రచ్చ

Advertisement

నోరు తెరిస్తే చాలు అక్కడ పెద్ద వార్ జరిగేది. ఇక కావాలని గొడవ దిగితే సింహం నోళ్లు తల పెట్టినట్టే. ఎంట్రీ ఇచ్చిన మరుసటి రోజే తనే హౌజ్‌కి బిగ్ బాస్‌ అన్నట్టుగా వ్వవహరించింది. నచ్చితే విపరీతమైన ప్రేమ, నచ్చకపోతే క్రోదం చూపిస్తూ హౌజ్‌లో ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేసింది. హౌజ్‌లోని కెమెరాలు కూడా ఎక్కువగా మాధురినే ఫోకస్ చేశాయి. అంతగా కంటెంట్‌ ఇచ్చిన మాధురి ఎలిమినేషన్‌ ఎవరూ ఊహించనిది. వెళ్లిన మూడు వారాలకే మాధురికి ఎలిమినేట్‌ అయ్యి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తనకే సేవ్‌ అయ్యే అవకాశాలు ఉన్న వాటిని ఉపయోగించలేదు. అయితే బిగ్‌ బాస్‌లో మాధురి రెమ్యునరేషన్‌ హాట్‌ టాపిక్‌ అయ్యింది.

పారితోషికం కోసమే బిగ్ బాస్ కు

అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తనకే ఇచ్చారని, పారితోషికం కోసమే మాధురి బిగ్‌ బాస్‌ కి వెళ్లిందటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మరికొందరు మాత్రం రిటర్న్‌ తనే కోటి రూపాయలు ఇచ్చి బిగ్‌ బాస్‌ వెళ్లిందంటూ ఓవైపు ప్రచారం చేస్తున్నారు. తాజాగా వీటన్నింటికి మాధురి చెక్ పెట్టింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో బిగ్‌ బాస్‌కి రెమ్యునరేషన్‌ కోసమే వెళ్లారా? అని అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటని అడగ్గా.. అసలు రెమ్యునరేషన్‌ కోసం బిగ్‌ బాస్‌ వెళ్లాల్సిన పరిస్థితిలో లేను. రెమ్యునరేషన్‌పై ఆశతో వెళ్లానంటే బయట నాకు రోజు రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు వస్తుంది.

Advertisement

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

నెలకే కోటి వస్తుంది..

ఈ షో మొత్తం ఆడితే కోటి కూడా రాదు. కానీ, నాకు నెలకు రూ. కోటి రూపాయలు వస్తాయి. బిగ్‌ బాస్‌కి వెళ్లడానికి కారణం ఆఫర్‌ వచ్చిందనే. బిగ్‌ బాస్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసమే వెళ్లాను. అసలు రెమ్యునరేషన్‌ ఇంత కావాలని కూడా నేను డిమాండ్‌ చేయలేదు. దానికి ఆశపడలేదు కూడా. వాళ్లు ఎత్తిస్తే అది తీసుకుని సమాజ సేవకే ఖర్చు పెట్టామని చెప్పింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నారు. మాధురి ఇన్‌కంపై నెటిజన్స్ అవాక్క్‌ అవుతున్నారు. ఏంటి.. భయ్య నెలకు కోటా? అంటూ షాక్‌ అవుతున్నారు. కాగా మాధురికి ఏపిలో పెట్రోల్‌ బంక్‌లు, ఇక్కడ హైదరాబాద్‌ వకుళ సిల్క్‌ పేరుతో షో రూం కూడా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు త్వరలోనే వీరు జువెల్లరి షాపు కూడా లాంచ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Also Read: Anasuya: అప్పుడు గుంపులో గొవిందా అన్నావ్‌.. మరి ఇప్పుడు చేసిందేంటి అనసూయ?

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×