// // Bigg Boss 9 Telugu Promo : జ్యోతిష్యుడు గా మారిన ఇమ్మూ.. -->
E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Promo : జ్యోతిష్యుడు గా మారిన ఇమ్మూ.. తనూజ గుట్టు రట్టు..డిమాన్, కళ్యాణ్ తో ఫన్..

Bigg Boss 9 Telugu Promo : జ్యోతిష్యుడు గా మారిన ఇమ్మూ.. తనూజ గుట్టు రట్టు..డిమాన్, కళ్యాణ్ తో ఫన్..
Advertisement

Bigg Boss 9 Telugu Promo : తెలుగు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నా రియాల్టీ షో బిగ్ బాస్ మరికొద్ది రోజుల్లో ఫైనల్ ఎపిసోడ్ జరుపుకుంటుంది.. ఈ క్రమంలో రోజు రోజుకు ఆడియన్స్ కు క్యూరియాసిటిని పెంచేందుకు బిగ్ బాస్ విచిత్ర ప్రయత్నాలు చేస్తుంది.. గత రెండు రోజులుగా బిగ్ బాస్ ఊహించని విధంగా టాస్కులను ఇస్తూ కంటెస్టెంట్లను ఆడుకుంటున్నాడు. నిన్నటి ఎపిసోడ్ లో తనుజ ఎమోషనల్ అవ్వడంతో హౌస్ మొత్తం సైలెంట్ అయ్యింది. తాజాగా ఇవాళ ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమోను బిగ్ బాస్ రిలీజ్ చేశాడు. ఆ ప్రోమో ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం..

ఇమ్మూ గెటప్ తో కామెడీ..

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో విచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు.. ఈ క్రమంలో ఇప్పటికే కొత్త టాస్క్ లను ఇస్తూ మెంటలెక్కిస్తున్నాడు. ఇవాళ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను బిగ్ బాస్ రిలీజ్ చేశాడు.. ఆ ప్రోమోలో ఇమ్ము జ్యోతిష్యుడు గెటప్ లో రెడీ అవుతాడు. తనుజ ఇమ్ముని దగ్గరుండి రెడీ చేస్తుంది.. ఈ బిగ్ బాస్ హౌస్ లో మీ జాతకాలు ఎలా ఉన్నాయో నేను చెప్తాను మీరందరూ వచ్చి జాతకాలు చెప్పించుకోండి అని ఇమ్మూ అంటాడు. ముందుగా సంజన జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వస్తుంది. నువ్వు ఇదివరకే యాభై సినిమాలు చేశావు కదా అని ఇమ్ము తన స్టైల్ లో కామెడీని పండిస్తాడు. ఆ తర్వాత నాకు ఎలా తెలిసింది అని అనుకుంటున్నావు కదా.. గొడవ పడిన ప్రతిసారి నువ్వే నేను 50 సినిమాలు చేశాను అని అంటావు కదా అలా తెలిసింది అని అంటాడు. తర్వాత తనుజ జాతకం చెప్పించుకోడానికి వస్తుంది.. నీకు ఎలాంటి అబ్బాయి వస్తాడు చెప్పడానికి తనకు రాబోయే అబ్బాయి గురించి గుర్తులు చెప్తాడు. నాకు కాబోయే అబ్బాయి గురించి నువ్వు చెప్పట్లేదు ఇది నీ గురించి చెప్తున్నావు అని తనుజ అనగానే దొరికేసాను అని ఇమ్ము నవ్వేస్తాడు.. తనుజ గురించి చెప్పడం కాస్త కామెడీగా ఉంటుంది..

Advertisement

Also Read :డిమాన్ పై రగిలిపోతున్న తనూజ..మారిన లెక్కలు.. టాప్ లో ఎవరంటే..?

డిమాన్, కళ్యాణ్ తో ఇమ్మూ కామెడీ.. 

బిగ్ బాస్ హౌస్ లో కామనర్సగా ఎంట్రీ ఇచ్చి మొదటి నుంచి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు డిమాన్ అలాగే కళ్యాణ్.. ఇవాళ రిలీజ్ అయిన ప్రోమో లో వీరిద్దరు కూడా జాతకం చెప్పించుకోవడానికి వస్తారు. ముందుగా వచ్చిన డిమాన్ కు ఏమో చేతి మీద గీతలు ఎక్కడివి రా ఎక్కడికి వెళ్ళిపోయాయి రా అని కామెడీ చేస్తాడు. ఇందులో ఏముందని నేను జాతకం చెప్పాలిరా నీ గీతలు ఏమిరా అని అనగానే డిమాన్ షాక్ అవుతాడు. మొన్నటివరకు వేరేలా ఉన్నావు ఇప్పుడు అది వెళ్లిపోయేలోగా నువ్వు చాలా బాగున్నావు అని ఇమ్ము అంటాడు. తర్వాత కళ్యాణ్ జాతకం చెప్పించుకోవడానికి ఇమ్మానుయేల్ దగ్గరికి వస్తాడు.. ఇది చెయ్యి అంటారా ఇందులో గీతలు ఏవి నీకు.. అసలు నీ జాతకం చెప్పను అని అంటాడు. మాట వినగానే కళ్యాణ్ అతని వెనకాల గురువుగారు అని పరిగెడతాడు.. వీరి ముగ్గురి జాతకంతో హౌస్ కామెడీ క్రియేట్ అవుతుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. మరి ఇవాళ్టి ఎపిసోడ్లో వీళ్ళ కామెడీతో ప్రేక్షకులను ఏమాత్రం నవ్విస్తారో చూడాలి..

Advertisement

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×