// // Bigg Boss 9 Telugu - బిగ్ బాస్ షూటింగ్‌కి బ్రేక్... అగ్ని పరీక్షలో ఏం జరుగుతుందటే ? -->
E-Paper
Advertisement

Bigg Boss 9 Agnipariksha: బిగ్ బాస్ షూటింగ్‌కి బ్రేక్… అగ్ని పరీక్షలో ఏం జరుగుతుందటే ?

Bigg Boss 9 Agnipariksha: బిగ్ బాస్ షూటింగ్‌కి బ్రేక్… అగ్ని పరీక్షలో ఏం జరుగుతుందటే ?
Advertisement

Bigg Boss 9 Telugu Agnipariksha: ప్రముఖ రియాలిటీ షో బిగ్‌ బాస్‌ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ షో గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యింది. అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్‌ హిట్‌. ఇక తెలుగులో 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ప్రస్తుతం తొమ్మిదో సీజన్‌కు సిద్దమౌతోంది. బిగ్‌ బాస్‌ 9 తెలుగులోకి ఈసారి సామాన్యులకు కూడా ఎంట్రీ ఉండటంతో వేలల్లో అప్లికేషన్స్‌ వచ్చాయట. మొత్తం 20వేల అప్లికేషన్స్ రాగా.. అందులో 20 మందిని సెలక్ట్ చేశారట.

Advertisement

సామాన్యులకు అసలైన అగ్ని పరీక్ష

వీరందరికి సంబంధించిన ఏవీలు, వారిని తీసుకోవడానికి గల కారణాలతో పాటు హౌజ్‌లోకి వెల్లడానికి వారికి ఉన్న అర్హతలను ప్రేక్షకులకు కూడా చూపించనున్నారు. ఈ మేరకు అగ్ని పరీక్ష పేరుతో వారికి పోటీ నిర్వహిస్తున్నారు. ఈ షోలో సామాన్యులకు గట్టి పోటీ ఉండబోతోంది. ఈ షోకి నవదీప్‌, శ్రీముఖీ, అభిజిత్‌లు ముగ్గురు జడ్జీలుగా వ్యవహరించబోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి షూటింగ్‌ జరుగుతుంది. ఈసారి బిగ్‌బాస్‌ ప్రాసెస్ ఎక్కువగా ఉండటం వల్ల కంటెస్టెంట్స్‌ సెలక్షన్స్ ప్రాసెస్‌ కూడా టఫ్‌గా ఉండటంతో టీం చాలా కష్టపడుతోంది. పని భారం కూడా ఎక్కువ అవ్వడంతో నేడు బిగ్‌ బాస్‌ షూటింగ్‌కి బ్రేక్‌ ఇచ్చి అందరికి సెలవు ప్రకటించారట.

Advertisement

సెలక్ష ప్రాసెస్ ఇదే

రేపటి నంచి యాధావిధిగా షూటింగ్‌ అవుతుందని తెలుస్తోంది. ఇక సెప్టెంబర్‌ 7 నుంచి బిగ్‌ బాస్‌ 9 తెలుగు గ్రాండ్‌గా లాంచ్‌ కాబోతోంది. అయితే అగ్నీ పరీక్ష పేరుతో నెల రోజుల ముందే బిగ్‌ బాస్‌ 9 షో మొదలు కానుంది. కానీ, ఇది టీవీల్లో కాకుండ కేవలం జీయో హాట్‌ స్టార్‌లోనే స్ట్రీమింగ్‌ కానుంది. కాగా మొత్తం అప్లికేషన్స్‌ 40 మంది సామాన్యులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అందులో అగ్నీ పరీక్ష పేరుతో ఫైనల్‌గా 15 మందిని షాట్‌ లిస్ట్‌ చేయబోతున్నారట. ఇక ఆడియన్స్‌ ఓటింగ్‌ ద్వారా ఇద్దరిని.. ముగ్గురు జడ్జస్‌ తరపున ఒక్కొక్కరుగా ముగ్గురు సెలక్ట్ చేసి మొత్తం 20 మందిని సామాన్యులను ఎంపిక చేస్తారట. ఈ 20 మందికి అగ్నీ పరీక్ష ద్వారా గట్టి పోటీ పెట్టి అందులో గెలిచిన వారిని కంటెస్టెంట్స్‌గా ఫైనల్ చేయబోతున్నారట.

Also Read: Bigg Boss 9 Telugu: ఏకంగా 40 మంది.. బిగ్‌బాస్‌ 9పై నాగార్జున కీలక ప్రకటన

అంటే బిగ్‌ బాస్‌ హౌజ్‌లో లాగే.. అగ్నీ పరీక్షలో టాస్క్‌లు, గేమ్స్‌ పెట్టి సామాన్యుల మధ్య పోటీ జరగనుంది. అచ్చం బిగ్‌ బాస్‌ హౌజ్‌లో కంటెస్టెంట్స్‌ కు ఉండే పోటీనే వీరి మధ్య కూడా ఉండనుందట. చూస్తుంటే బిగ్‌ బాస్‌ 9 తెలుగు సందడి ఆగష్టులోనే మొదలయ్యేలా కనిపిస్తోంది. ఇక సెలబ్రిటీల నుంచి ఈసారి మాజీ బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ అమర్‌ దీప్ భార్య తేజస్వీని గౌడ, ముఖేష్‌ గౌడ, సాయి కిరణ్‌, కాంట్రవర్సల్‌ బ్యూటీ అలేఖ్యా చిట్టి పిక్కిల్స్‌, జ్యోతి రాయ్‌, జబర్దస్త్‌ ఇమ్మాన్యుయేల్‌, అలాగే వివాదస్ప నటి కల్పిక గణేష్‌లు కన్‌ఫాం కంటెస్టెంట్స్‌ అంటున్నారు. ఇక ఈసారి కూడా బిగ్‌ బాస్‌కు హీరో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈసారి నాగ్‌ గట్టిగానే రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారట.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×