// // Bigg Boss 9 Telugu : 'పుష్ప' స్టెప్పులు ఇరగదీసిన డెమోన్ -->
E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : ‘పుష్ప’ స్టెప్పులు ఇరగదీసిన డెమోన్, ఇమ్మూ… లేడీ గెటప్ లో అరాచకం… దెబ్బకు దిగొచ్చిన బిగ్ బాస్

Bigg Boss 9 Telugu : ‘పుష్ప’ స్టెప్పులు ఇరగదీసిన డెమోన్, ఇమ్మూ… లేడీ గెటప్ లో అరాచకం… దెబ్బకు దిగొచ్చిన బిగ్ బాస్
Advertisement

Bigg Boss 9 Telugu : టాప్ 5 అనౌన్స్మెంట్ అయ్యాక హౌస్ మేట్స్ ఫుల్ చిల్ అవుతున్నారు. సరదాగా టైమ్ స్పెండ్ చేస్తూ కామెడీ కంటెంట్ ను బాగా ఇస్తున్నారు. ముఖ్యంగా డెమోన్ పవన్ రచ్చ హౌస్ లో మామూలుగా లేదు. ఓవైపు తనూజతో టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ చేస్తూనే, మరోవైపు మిగతా వాళ్లందరిని గిల్లి మరీ ఓ ఆట ఆడుకుంటున్నాడు. అందుకే తాజాగా టాప్ 5 డెమోన్ బిగ్ బాస్ దగ్గర అడ్డంగా ఇరికించారు. బిగ్ బాస్ కాఫీ పౌడర్ పంపకుండా బెట్టు చేయడంతో, డెమోన్ అనే అస్త్రాన్ని వదిలారు. అతని అరాచకం చూసి దెబ్బకు దిగొచ్చిన బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు మంచి ట్రీట్ ఇచ్చాడు.

డెమోన్ కు లేడీ గెటప్

బిగ్ బాస్ డే 103 ఎపిసోడ్ మొదట్లోనే తనూజ, సంజన, ఇమ్మూ, డెమోన్ కలిసి కాఫీ కోసం కెమెరా ముందు నిలబడి బిగ్ బాస్ ను రిక్వెస్ట్ చేశారు. “మొన్న పంపిన నెయ్యి ఉంది. దానితో ఏం చేయాలో తెలియట్లేదు. క్యారెట్లు పంపిస్తే క్యారెట్ హల్వా చేసుకుంటాం. అలాగే చికెన్ పంపండి. ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రెయిన్… మైండ్ వర్క్ చేయట్లేదు. కాపీ పౌడర్ పంపించండి. 3 రోజులే కదా బిగ్ బాస్… ప్లీజ్ ప్లీజ్” అని వేడుకున్నారు అందరూ కలిసి. బిగ్ బాస్ ఏమన్నా తక్కువ తిన్నాడా? “మీరు అడిగిన కొంచం కాఫీ పొడిని ఆస్వాదించండి” అంటూ జస్ట్ టీస్పూన్ అంత కాఫీని అందరికీ పంపారు. “స్మెల్ పీలిస్తే ముక్కులోకి పోవడానికి కూడా లేదు ఇది” అంటూ నిరుత్సాహ పడ్డారు అందరూ.

హౌస్ మేట్స్ కు మటన్ తో సర్ప్రైజ్ 

Advertisement

అదే టైమ్ లో తనూజ, ఇమ్మూ కలిసి డెమోన్ ను ఇరికించారు. డెమోన్ కు లేడి గెటప్ వేసి, లిప్ స్టిక్ పూసి రెడీ చేస్తామని, అప్పుడైనా కాఫీ పంపుతారా? అని అడిగారు. కెమెరా ఊ కొట్టడంతో అన్నట్టుగానే “మీట్ మై పెళ్ళాం పావని” అంటూ డెమోన్ ను లేడీ గెటప్ రెడీ చేసి తీసుకొచ్చాడు ఇమ్మాన్యుయేల్. రోల్ లో ఒదిగిపోయిన డెమోన్ “మా ఆయనకు మీరు కాఫీ పొడి పంపితే కాఫీ పెట్టిస్తా. లేదంటే తాగొచ్చి నన్ను కొడుతున్నాడు. అలాగే కొంచం చికెన్ కూడా పంపండి బిగ్ బాస్” అని అడిగాడు. అక్కడితో ఆగకుండా ఇమ్మూ, డెమోన్ ఇద్దరూ కలిసి ‘పుష్ప 2’లోని పాపులర్ సాంగ్ ‘ఫీలింగ్స్’కు స్టెప్పులు ఇరగదీశారు. ఇమ్మూ డెమోన్ ను తన కాళ్ళపై ఎక్కించుకుని మరీ డ్యాన్స్ చేశాడు. ఈ అరాచకం చూసి ఫిదా అయిన బిగ్ బాస్ కాఫీ పొడి పంపారు. చికెన్ అడిగితే మటన్ పంపి సర్ప్రైజ్ చేశారు.

Read Also : కళ్యాణ్ ఏవీకి బ్లాస్టింగ్ ఎలివేషన్… కాఫీ కోసం డెమోన్ ను బుక్ చేసిన ఇమ్మూ, తనూజ… సంజన ఎమోషనల్

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×