// // Bigg Boss 9 Telugu Day 85 : నామినేషన్లలో రెచ్చిపోయిన తనూజ -->
E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 85 : రెచ్చిపోయిన తనూజ… అందరి టార్గెట్ రీతూ-డెమోన్… ఈ వారం మొత్తం తుప్పాస్ నామినేషన్లే

Bigg Boss 9 Telugu Day 85 : రెచ్చిపోయిన తనూజ… అందరి టార్గెట్ రీతూ-డెమోన్… ఈ వారం మొత్తం తుప్పాస్ నామినేషన్లే
Advertisement

Bigg Boss 9 Telugu Day 85 :బిగ్ బాస్ డే 85 ఎపిసోడ్లో మరోసారి నామినేషన్ల రచ్చ రాజుకుంది. 13వ వారం నామినేషన్లలో రీతూ, సంజన, డెమోన్ సాఫ్ట్ టార్గెట్ అయ్యారు. మరి ఈ వారం నామినేషన్లలో ఉన్నది ఎవరెవరో తెలుసుకుందాం పదండి.

డెమోన్ శపథం

Advertisement

ఈ వారం సీసాలతో తలలు పగలగొట్టే ప్లాన్ తో నామినేషన్ల ప్రక్రియను స్టార్ట్ చేశారు బిగ్ బాస్. ఇమ్మూ వచ్చి డెమోన్, రీతూని తలపై సీసాలు పగలగొట్టి నామినేట్ చేశాడు. “నాగ్ సార్ అడిగినప్పుడు నాకు బ్యాక్ స్టాబ్ ఇచ్చావు. కానీ నిజానికి నేను నిన్ను తీయాలి అనుకోలేదు ఆ టాస్క్ లో” అంటూ నిన్నటి గొడవను తెరపైకి తెచ్చాడు ఇమ్మూ. “మరి నన్ను తీయాలనుకోలేదు, దివ్యను ఉంచుదాం అనుకున్నారు. ఇంకెవరిని తీద్దాం అనుకున్నారు?” అని ప్రశ్నించింది రీతూ. “అదే పాయింట్ కదా… ఇక్కడో మాట అక్కడో మాట అనొద్దు. నీకు నేను మాటివ్వలేదు” అంటూ ఫైర్ అయ్యాడు ఇమ్మూ.

తరువాత భరణి సంజన, రీతూలను నామినేట్ చేశాడు. “నా టాబ్లెట్స్ దాచి పెట్టడం ఫన్నా? అది హ్యూమరా? మీరు ఫ్రాంక్స్ చేయడం ఆపండి” అంటూ సీరియస్ అయ్యాడు భరణి. అలాగే డెమోన్ కు “నిన్ను ఏదైతే వెనక్కి లాగుతుందో దాన్ని పక్కన పెట్టు. మనం ఎప్పుడైతే మెంటల్ గా ఫోకస్ పెట్టలేమో అప్పుడు 100 పర్సెంట్ ఎఫర్ట్ పెట్టలేం” అని అన్నారు భరణి. దీంతో డెమోన్ “నేను ప్రతి ఒక్కరికీ ఛాలెంజ్ చేస్తున్నా… ఈవారం టికెట్ టు ఫినాలే కొట్టేది నేనే” అంటూ శపథం చేశాడు.

Advertisement

ఇమ్మూతో తనూజ గొడవ

రీతూ సుమన్ శెట్టి, సంజనాను నామినేట్ చేసింది. సుమన్ తో అయితే ఏకంగా వాగ్వాదం జరిగింది. ఇక సంజనాతో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. “నన్ను గిల్లితే 100 సార్లు గిల్లుతా అని చెప్పడం నాకు నచ్చదు” అని రీతూ చెప్పింది. “నీకు నాకు ఈ గేమ్ కి ముందు పరిచయం ఉందా? వంశ పారంపర్యంగా వస్తున్న శత్రుత్వం ఏమైనా ఉందా? అని స్ట్రెయిట్ గా ప్రశ్నించింది సంజన. “నేను మీ గేమ్ గురించి మాత్రమే మాట్లాడాను. మిమ్మల్ని ఫిజికల్ గా ఏమన్నా అన్నానా?” అని రీతూ అడిగింది. “అది అయ్యింది అయిపోయింది. కొత్తగా ఏమన్నా ఉంటే చెప్పు. ఇది ఇక్కడితో ఎండ్ అవ్వాలని కోరుకుంటున్నా” అని రీతూతో గొడవకు ఫుల్ స్టాప్ పెట్టింది సంజన. అయితే సంజన రీతూ, డెమోన్ ను నామినేట్ చేసి రివేంజ్ తీర్చుకుంది. సుమన్ శెట్టి  2 వీక్స్ నుంచి నామినేషన్లలోకి రావట్లేదు అని రీతూని, హెల్త్ బాలేదని డెమోన్ ను నామినేట్ చేశాడు.

తనూజ ముందుగా ఇమ్మూతో నాకంటే నీకు దివ్య ఎక్కువనా? అంటూ హౌస్ లోకి రాకముందు, వచ్చాక తమ బాండ్ ఎలా మారిందో చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంది. అయితే క్లారిటీ ఇస్తూ ఇమ్మూ కూడా ఎమోషనల్ అయ్యాడు. సడన్ గా తనూజ తన ఫస్ట్ నామినేషన్ అంటూ డెమోన్ పేరు చెప్పింది. అంతకు ముందే స్వయంగా డెమోన్ గత కెప్టెన్సీ టాస్క్ ను తన టీం కోసం కాదు అందులో ఉన్న మనిషి కోసం ఆడాను అని ఒప్పుకోవడం గురించి చెప్పింది. అలాగే అంతకు ముందు వారం ఇమ్మూను చేయను, నిన్ను చేస్తా అని బాండింగ్ ను మధ్యలోకి తెచ్చినందుకు సంజనను నామినేట్ చేసింది.

చివరగా డెమోన్ వచ్చి తనూజపై రివేంజ్ నామినేషన్ వేశాడు. దీంతో ఫ్రెండ్లీగా చెప్పిన పాయింట్స్ ను తీసుకొచ్చి నామినేషన్ లో వేస్తున్నాడు అంటూ మండిపడింది. ఈ విషయమై డెమోన్ – రీతూ – తనూజ మధ్య హీటింగ్ డిస్కషన్ జరిగింది. ఇక చివరగా కెప్టెన్ కళ్యాణ్ తన స్పెషల్ పవర్ ను ఉపయోగించి, గత వారం ఆడిన టాస్క్ లో ఎక్స్పెక్షన్స్ ను రీచ్ అవ్వలేదని భరణిని నామినేట్ చేశాడు. ఈ వారం నామినేషన్ లలో కెప్టెన్ కళ్యాణ్, ఇమ్మూ తప్ప అందరూ ఉన్నారు.

Read also : బాండింగ్ దెబ్బేసింది… ఎలిమినేట్ అయ్యాక రియలైజయ్యి ఏం లాభం దివ్య? 

 

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×