// // Bigg Boss 9 Telugu Day 72 : ఫ్యామిలీ వీక్... ఆ ముగ్గురు ఫుల్ హ్యాపీ -->
E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 72 : ఫ్యామిలీ వీక్ వచ్చేసిందోచ్… పెళ్లి సంబరాలతో హోరెత్తిన బిగ్ బాస్ హౌస్… పాపం సంజన

Bigg Boss 9 Telugu Day 72 : ఫ్యామిలీ వీక్ వచ్చేసిందోచ్… పెళ్లి సంబరాలతో హోరెత్తిన బిగ్ బాస్ హౌస్… పాపం సంజన
Advertisement

Bigg Boss 9 Telugu Day 72 : ఎపిసోడ్ మొదట్లోనే రీతూ తనను నామినేషన్ లో అన్న మాటలకు సంజన కన్నీళ్ళు పెట్టుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ రోప్ టాస్క్ ఆడి, ఫ్యామిలీతో గడిపే సమయాన్ని గెలుచుకోమని ఆదేశించారు. కెప్టెన్ అయిన కారణంగా తనుజా గేమ్ ఆడకుండానే 60 నిమిషాలు సొంతం చేసుకుంది. ఇమ్మూ 45 నిమిషాలు, డెమోన్ 30 నిమిషాలు, సుమన్, శదివ్య 20 నిమిషాలు, భరణి, కళ్యాణ్, రీతూ 15 నిమిషాలు సంపాదించారు. ఫ్యామిలీ వీక్ కట్ కాబట్టి సంజనాకు టాస్క్ లేదు.

“బిగ్ బాస్ ఇంట్లో మీ ప్రయాణం చివరి అంకానికి చేరుకుంది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ సాగిన ప్రయాణం, మిమ్మల్ని ఎన్నో భావోద్వేగాలకు గురి చేసింది. కుటుంబం మనకు తోడుంటే ప్రపంచాన్ని గెలిచే శక్తి వచ్చినట్టే. ఇది ఆ శక్తిని పొందే సమయం” అంటూ బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశారు.

వైఫ్ తో సుమన్ శెట్టి ముచ్చట్లు

Advertisement

ఇక ముందుగా బిగ్ బాస్ హౌస్ లోకి సుమన్ శెట్టి వైఫ్ లాస్యను హౌస్ లోకి పంపించారు. అంతకంటే ముందే ఒక స్పెషల్ కోట్ తో పాటు లాస్య రాసిన లెటర్ ను పంపారు. అందులో 16వ యానివర్సరీ శుభాకాంక్షలు చెప్పింది లాస్య. మామూలుగానే ఎమోషనల్ గా ఉండే సుమన్ తన వైఫ్ ను చూసి హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కుశల ప్రశ్నలు అడిగి, ప్రేమగా మాట్లాడాడు. తన భర్తకు ఇష్టమైన ఫుడ్ ను వండి తీసుకొచ్చిన ఆవిడ, తన చేతులతో సుమన్ కు తినిపించింది. సుమన్ కూడా తన స్వహస్తాలతో భార్యకు తినిపించాడు. ఆ తరువాత ఆట గురించి ఇద్దరూ మాట్లాడుకుని కాసేపు టైం స్పెండ్ చేశారు. బిగ్ బాస్ ఇచ్చిన 20 నిమిషాల టైం పూర్తి కావడంతో ఆమెను బాధగా బయటకు పంపాడు సుమన్. అయితే వెళ్లముందు ‘తనూజాకు దూరంగా ఉండు. హైప్ ఉన్నవాళ్ళతోనే ఆమె దగ్గరగా ఉంటుంది” అంటూ వార్నింగ్ ఇచ్చింది.

బిగ్ బాస్ హౌస్ లో పెళ్లి సందడి

ఆ తరువాత తనూజా అక్క కూతురు శ్రేష్టను హౌస్ లోకి పంపారు బిగ్ బాస్. కన్ఫెషన్ రూమ్ లో బుడి బుడి అడుగులు వేసుకుంటూ తన పిన్ని కోసం వెతికింది ఆ చిట్టితల్లీ. ఆ చిన్ని అతిథిని చూసిన తనూజా తెగ సంతోష పడింది. కన్నడ భాషలో మాట్లాడుతూ అమ్మెక్కడ ? అని అడిగింది. కానీ బిగ్ బాస్ ఆ పిల్లాడి తల్లి అంటే తనూజా అక్కకు బదులు త్వరలో పెళ్లి కూతురు కాబోతున్న చెల్లి పూజాని హౌస్ లోకి పంపించారు. దీంతో తనూజా సిస్టర్ ను పట్టుకుని బోరున ఏడ్చింది. తరువాత తనే పెళ్లి కూతురు అంటూ అందరికీ పరిచయం చేసింది. ఇక హౌస్ లో ఆ పిల్లాడు ఓ వైపు హడావిడి చేస్తుంటే, మరోవైపు తనూజాను ఏడవొద్దని కోరింది ఆమె చెల్లి. ఓవైపు పెళ్లి పనులు, మరోవైపు ఫ్యామిలీ, ఇంకోవైపు తనూజా… ఇలా తాను మూడింటిని మెయింటైన్ చేయడం కష్టంగా ఉందని చెబుతూనే, బాగా ఆడుతున్నావ్. టైటిల్ పెళ్లి గిఫ్ట్ గా కావాలని తనూజాకు ధైర్యం చెప్పింది పూజా. తరువాత బిగ్ బాస్ హౌస్ లో పూజాను పెళ్లి కూతురిని చేశారు. అలా కాసేపు టైం స్పెండ్ చేశాక బిగ్ బాస్ తనూజా ఫ్యామిలీకి గుడ్ బై చెప్పాడు.

Read Also : ‘వారణాసి’ కంటే ముందు చూడాల్సిన రాజమౌళి టాప్ 7 సినిమాలు… ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×