// // Bigg Boss 9 Telugu - బిగ్ బాస్ 9 ప్రైజ్ మనీ భారీగా పెంపు? వామ్మో.. ఈ సారి అన్ని లక్షలా? కొట్టుకుంటారేమో బాస్! -->
E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 ప్రైజ్ మనీ భారీగా పెంపు? వామ్మో.. ఈ సారి అన్ని లక్షలా? కొట్టుకుంటారేమో బాస్!

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 ప్రైజ్ మనీ భారీగా పెంపు? వామ్మో.. ఈ సారి అన్ని లక్షలా? కొట్టుకుంటారేమో బాస్!
Advertisement

Advertisement

Bigg Boss 9 Telugu Prize Money Details: మరికొన్ని రోజుల్లో బుల్లితెరపై బిగ్ బాస్ తెలుగు షో సందడి మొదలు కానుంది. టీవీ ప్రేక్షకులంతా ఈ కొత్త సీజన్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ వేస్తూ బిగ్ బాస్ 9వ సీజన్ పై అప్డేట్ ఇచ్చేసారు. ఈసారి సెలబ్రీలంటే కంటే సామాన్య ప్రజలను హౌజ్ లోకి దింపుతున్నట్టు చెప్పి శుభవార్త చెప్పింది. దీంతో సామాన్యులు హౌజ్ లో అడుగుపెట్టేందుకు తమ లక్క్ పరిక్షించుకోబోతున్నారు. మరి ఈసారి హౌజ్ లోకి అడుగుపెట్టేది ఎవరూ.. నిజంగా సామాన్యులకే బిగ్ బాస్ టీం ప్రాధాన్యత ఇవ్వనుందా? అనే సందేహాలు కూడా వెంటాడుతున్నాయి.

నాగార్జునే హోస్ట్

Advertisement

ఇక ఈసారి హోస్ట్ మారే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపించింది. కానీ, వాటన్నింటికి చెక్ పెడుతూ.. బిగ్ బాస్ హోస్ట్ నేనే అంటూ నాగార్జున తెరపైకి వచ్చారు. ఈసారి రెమ్యునేషన్ కూడా ఆయన భారీగా తీసుకుంటున్నారట. ప్రస్తుతం బిగ్‌ బాస్‌ సెట్, కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో టీం బిజీగా ఉంది. ఈ సీజన్‌ సరికొత్త థీమ్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారని అప్‌డేట్‌తో అర్థమైపోయింది. మరి ఈ సీజన్‌ బిగ్‌ బాస్‌ హౌజ్‌ ఎలా ఉండబోతుంది.. సామాన్యులు అంటే ఎవరూ రాబోతున్నారు? సెలబ్రిటీలకు, వారికి ఎలాంటి వార్‌ ఉండబోతుందనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఇదిలా ఉంటే ఇక ఈ సీజన్‌ ప్రైజ్ మనీ ఆశ్చర్యపరిచేలా ఉండబోతుందట.

సామాన్యులకు ఎంట్రీ

సీజన్‌ 8 మినహా అన్ని సీజన్‌ లోనూ రూ. 50 లక్షలుగా ప్రైజ్‌మనీని ఫిక్స్‌ చేశారు షో నిర్వాహకులు. అయితే ఈసారి ఈ ప్రైజ్ మనీని భారీగా పెంచారట. రూ. 50 లక్షలు కాకుండా.. రూ. 75 లక్షలకు పెంచినట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో గుసగులస వినిపిస్తున్నాయి. ప్రైజ్ మనీ ఎంత ఫిక్స్‌ చేయాలని చర్చ జరగ్గా.. టీంలో ఒకరు ఈసారి రూ. 75 లక్షలు పెడతామని సూచించారట.  ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. అంతా ఒకే అయితే ఈసారి బిగ్‌ బాస్‌ విన్నర్‌ జాక్‌పాట్‌ కొట్టినట్టే అని చెప్పాలి. మరి దీనిపై మూవీ టీం నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి. ఇక ప్రైజ్ మనీ విషయం బయటకు రావడంతో సెలబ్రిటీలు, సామాన్య కంటెస్టెంట్స్‌ లో క్యూరియాసిటీ పెరిగింది.

భారీగా పెరిగిన ప్రైజ్ మనీ

అయితే ఇక్కడ ఆలోచించే విషయం ఏంటంటే.. ప్రైజ్‌ మనీ పెరిగిందంటే.. టాస్క్ లు కూడా ఆ రేంజ్‌ లోనే ఉంటాయనిపిస్తోంది. ఇప్పటికే టఫ్‌ టాస్క్‌ లతో హౌజ్‌ మేట్స్ ఒళ్లు హునమైన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. మరి ప్రైజ్‌ మనీ రూ.75 లక్షలకు పెంచారంటే టాస్క్‌లు కూడా ఈసారి గట్టిగానే ప్లాన్ చేశారనిపిస్తోంది. కంటెస్టెంట్స్ మరింత కసి, క్యూరిసిటీ పెంచేందుకే టీం ఈ నిర్ణయం తీసుకుందట. ఈసారి హౌజ్ మరింత మాస్‌ మసాల ఉండబోతుందని అర్థమైపోతుంది. ఈసారి బిగ్ బస్‌ థీమ్ చూసి స్పాన్సర్లు కూడా ముందుకు వస్తున్నారట. మరి హౌజ్‌మేట్స్ కోసం బిగ్ బాస్‌ టీం ఎలాంటి సరికొత్త టాస్క్‌ లను సృష్టిస్తుందో చూడాలి. టాస్క్‌ల సంగతి ఎలా ప్రైజ్‌ మనీ మాత్రం కంటెస్టెంట్స్ ని టెంప్ట్ చేసేలా ఉందంటున్నారు.

ఈసారి సామాన్యులకు కూడా అవకాశం ఉండటం ఆసక్తి లేని వారు సైతం ఈ ప్రైస్‌ మనీ చూసి హౌజ్‌ లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటే. దీంతో బిగ్‌ బాస్‌ టీం కుప్పల్లో అప్లిక్లేషన్స్‌ వెళుతున్నాయట. అయితే గత సీజన్‌ ప్రైజ్‌ మనీ రూ. 45 లక్షల వరకు ఉన్న సంగతి తెలిసిందే. ఆ డబ్బునే హౌజ్‌మేట్స్‌ తమ ఆటపాటతో గెలుచుకున్నారు. హౌజ్‌ అంత కలిసి సంపాదించిన ఈ డబ్బు.. బిగ్‌ బాస్‌ విన్నర్‌ వెళ్లింది. సీజన్ 8లోనే ఈ పద్దతిని తీసుకువచ్చారు. ఇది కొందరికి నచ్చలేదు. మరి ఈసారి ఈ రూల్‌ మారుస్తుందా? లేక అదే కంటిన్యూ చేస్తుందా? చూడాలి. హౌజ్‌ మేట్సే ప్రైజ్‌ మీన సంపాదించాలంటే ఈసారి టాస్క్‌ మరింత గట్టిగా ఆడాల్సి ఉంటుంది మరి. మరి బిగ్‌ బాస్‌ హౌజ్‌ లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్‌ కాస్తా చూసుకోండి మరి అంటున్నారు నెటిజన్స్‌.

Also Read: Raghuvaran Son.. మ్యూజిక్ డైరెక్టర్‌గా నటుడు రఘువరన్ కొడుకు.. ఇంతకీ అతనెవరు? ఇప్పుడెలా ఉన్నాడో చూశారా?

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×