// // Bigg Boss 9 Telugu - బిగ్‌బాస్‌ భారీ ప్లాన్‌.. మొదటి రోజే కంటెస్టెంట్స్‌కి దిమ్మతిరిగే ట్విస్ట్‌, అదేంటంటే! -->
E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్‌ భారీ ప్లాన్‌.. మొదటి రోజే కంటెస్టెంట్స్‌కి దిమ్మతిరిగే ట్విస్ట్‌, అదేంటంటే!

Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్‌ భారీ ప్లాన్‌.. మొదటి రోజే కంటెస్టెంట్స్‌కి దిమ్మతిరిగే ట్విస్ట్‌, అదేంటంటే!
Advertisement

Advertisement

Bigg Boss 9 Telugu Update: ఈసారి బిగ్‌బాస్‌ ప్లాన్‌ మామూలుగా లేదు. ఆడియన్స్‌కి డబుల్‌ ఎంటర్‌టైన్‌ చేసేందుకు కామనర్స్‌కి కూడా అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం వారి అగ్నీ పరీక్ష పేరుతో గట్టి పోటీ జరుగుతోంది. ఇందులో గెలిచిన వారు హౌజ్‌లోకి వస్తారు. మరోవైపు సినీ, టీవీ, సోషల్‌ మీడియా, యూట్యూబ్‌లో భారీ ఫాలోయింగ్‌ ఉన్న సెలబ్రిటీలను హౌజ్‌లోకి దింపుతున్నారు. సెప్టెంబర్‌ 7న బిగ్‌బాస్‌ 9 తెలుగు గ్రాండ్‌ లాంచ్‌కి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా కింగ్‌ నాగార్జునే హోస్ట్‌. ఇప్పటికే ప్రోమోలతో కింగ్‌ తనదైన స్టైల్లో అదరగొట్టేస్తున్నారు.

సెప్టెంబర్ 7న గ్రాండ్ లాంచ్

బిగ్‌బాస్‌ ప్రమోషన్స్‌ కోసం పలువురు సెలబ్రిటీలను కూడా వాడేస్తున్నారు. మరోవైపు ఈ షో గురించి పలు అప్‌డేట్స్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవి ఆడియన్స్‌లో మరింత క్యూరియాసిటి పెంచుతున్నాయి. సెప్టెంబర్‌ 7న బిగ్‌బాస్‌ ప్రారంభం అవుతుంటే.. నెల ముందు నుంచే టీం బిగ్‌బాస్‌ జోరు చూపిస్తుంది. జియో హాట్‌స్టార్‌ అగ్నీ పరీక్ష పేరుతో సామాన్యులను ఆటాడుకుంటున్నారు. ఇవన్ని చూస్తుంటే ఈసారి బిగ్‌బాస్‌ సమ్‌థింగ్‌ స్పెషల్‌ అనేట్టుగా ఉంది. ఇందుకోసం ఆడియన్స్‌కి మొదటి రోజే బిగ్‌ సర్‌ప్రైజ్ ప్లాన్‌ చేసింది. కానీ, కంటెస్టెంట్స్‌కి మాత్రం ఇది ఊహించని ట్విస్ట్‌ అని చెప్పాలి.

Advertisement

బిగ్‌బాస్‌ షో లాంచింగ్‌ అంటే ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ రోజున షో రాత్రి 7 గంటలకు మొదలవుతుందట. ఎంట్రీతో ఇచ్చే కంటెస్టెంట్స్‌లో ఆటపాటలు, సెలబ్రిటీల డ్యాన్స్‌లు, సింగర్స్‌తో పాటలు.. ఇలా తొలిరోజు ధూంధాంగా ఉంటుంది. దాదాపు మూడు గంటల పాటు సాగే ఈ షోలో కంటెస్టెంట్స్‌ ఇంట్రాడక్షన్‌ ఆకట్టుకుంటుంది. ఇక ఈసారి కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ 20 మందికి పైగా ఉంటుందని తెలుస్తోంది. ఈసారి సామాన్యులు కూడా ఉండటంతో వారి ఇంట్రడక్షన్‌ కాస్తా గట్టిగానే ఉండేలా ఉంది. ఈసారి షోలో రెండు హౌజ్‌లు ఉంటాయట. సెలబ్రిటీలు, సామాన్యులది రెండు గ్రూప్‌లు ఉంటాయి. ఇక ఈసారి సెలబ్రిటీ వర్సెస్‌ సామాన్యులతో షో వాడి వేడిగా సాగనుంది.

లాంచింగ్ డే రోజే బిగ్ ట్విస్ట్

ఇక రిలీజ్ రోజే కంటెస్టెంట్స్‌ ఊహించని షాక్ ప్లాన్‌ చేశాడు బిగ్‌బాస్‌. మొదటి రోజే షాకింగ్ ఎలిమినేషన్‌ ఉంటుందట. అది సెలబ్రిటీలదా? లేక సామాన్యులదా? అనేది షో లాంచింగ్‌ డే రోజే రివీల్‌ కానుంది. ఇలా ఫస్ట్‌ డే బిగ్‌ ట్విస్ట్స్‌తో బిగ్‌బాస్‌ ఆడియన్స్‌, కంటెస్టెంట్స్‌ని ఎంటర్టైన్‌ ఇవ్వబోతోందట. ఫస్ట్‌డే ఇలా ఉంటే ఇక షో మొత్తం ఎలా ఉండబోతుందో మీ అంచనాలకే వదిలేస్తున్నాడు బిగ్‌బాస్‌. సాధారణంగా బిగ్‌బాస్‌ షో అంటే లవ్‌ ట్రాక్స్‌, గొడవలు, ఈగోలు,వివాదాలతో రచ్చరచ్చ ఉంటుంది. ఈసారి సెలబ్రిటీలతో సామాన్యుల వార్‌ అంటే ఇక వివాదాలు,ఈగోలు ఏ రేంజ్‌లో ఉంటాయో ఊహించుకుంటుంటేనే షాకింగ్‌ ఉంటుంది. నాగ్‌ చెప్పినట్టుగానే ఈసారి హౌజ్‌లో సెలబ్రిటీలు వర్సెస్‌ సామాన్యులది రణరంగమే అనడంతో సందేహం లేదు.

Also Read: Divvela Madhuri: బిగ్‌బాస్ ఆఫర్‌పై స్పందించిన దువ్వాడ కపుల్స్.. మాధురీని అలా అనేశాడేంటి?

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×