// // Bigg Boss 9 Promo- అమ్మాయిల పిచ్చోడివా.. కళ్యాణ్‌ని పొడిచిన శ్రీజ -->
E-Paper
Advertisement

Bigg Boss 9 Promo: నువ్వు అమ్మాయిల పిచ్చోడివా.. కళ్యాణ్‌ని పొడిచిన శ్రీజ

Bigg Boss 9 Promo: నువ్వు అమ్మాయిల పిచ్చోడివా.. కళ్యాణ్‌ని పొడిచిన శ్రీజ
Advertisement

Bigg Boss 9 Promo 2: ఈ వారం నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. వీకెండ్‌ ఎపిసోడ్‌లో ఎక్కువ బోర్డు వచ్చినందుకు మాధురి ఇప్పటికే డైరెక్ట్‌ నామినేట్‌ అయ్యింది. ఇక సోమవారం ఎపిసోడ్‌ నామినేషన్‌ ప్రక్రియను బిగ్‌ బాస్‌ సరికొత్తగా ప్లాన్‌ చేశారు. కంటెస్టెంట్స్‌కి కత్తులిచ్చి పొడిచి మరి నామినేట్‌ చేయాలని ఆదేశించారు. అయితే ఈ ప్రక్రియ కోసం ఎలిమినేటెడ్‌ కంటెస్టంట్స్‌ని హౌజ్‌లోకి దింపారు. బయట నుంచి వారి ఆట చూసి వారి లెక్కలు తెల్చేమని వారి చేతికి కత్తులిచ్చి మరి లోపలికి పంపారు. ఈ వారం నామినేషన్‌ ప్రక్రియకు సంబంధించిన ప్రోమోలను వరుసగా వదులుతూ ఆసక్తి పెంచుతున్నారు.

ప్రియ, సుమన్ నామినేట్ సంజన

Advertisement

తాజాగా ఫస్ట్‌ ప్రొమో మర్యాద మనీష్, ప్రియల నామినేషన్‌ చూపించారు. సంజన.. బాడీ షేమింగ్‌ చేస్తుందనే పాయింట్‌ ప్రియ నామినేట్‌ చేసింది. మర్యాద మనీష్ కళ్యాణ్‌ ని నామినేట్‌ చేసినట్టు చూపించారు. కానీ ప్రారంభంలో మాత్రం శ్రీజ కూడా హౌజ్‌లోకి వచ్చినట్టు చూపించారు. కానీ, తన నామినేషన్‌ చూపించలేదు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో శ్రీజ, ఫ్లోరా సైనీ నామినేషన్‌ని చూపించారు. ఫ్లోరా వచ్చి.. రీతూని పొడిచింది. హౌజ్‌లో ఒక ఫేక్‌ లవ్‌ స్టోరీ క్రియేట్‌ చేశావంటూ రీతూని లవ్‌ ట్రాక్‌ని మళ్లీ టార్గెట్‌ చేసింది. ఇక ఆయేషా బయటకు వెళ్తుంటే అంత బాధపడుతుంటే తను మాత్రం నవ్విందని, కళ్యాణ్‌ ఏడుస్తుంటే నువ్వు నవ్వావు అంటూ రీతూని నామినేట్‌ చేసింది.

కళ్యాణ్ పై శ్రీజ ఆన్ ఫైర్

మరో కత్తిని సుమన్‌కి ఇవ్వగా.. అతడు సంజనను నామినేట్‌ చేసింది. ఆ తర్వాత శ్రీజ వంతు వచ్చింది. ఎలిమినేషన్ ముందు కళ్యాణ్‌తో మంచి ఫ్రెండ్‌ అయిన శ్రీజ.. వచ్చిరాగానే కత్తితో పోడించింది. ఎంతోమంది ఉన్నా శ్రీజ అతడిని నామినేట్‌ చేయడం అందరిని షాకిచ్చింది. నిన్ను నువ్వు ఎందుకు డిఫెండ్‌ చేసుకోవడం లేదు అనే కారణంతోనే కళ్యాణ్‌ని నామినేట్‌ చేసింది. నువ్వు అమ్మాయిల పిచ్చోడివి.. మరెందుకు నిన్ను నువ్వు డిఫెండ్‌ చేసుకోలేదు. క్యారెక్టర్‌ని చంపేసి సారీ చెబితే ఒకేనా.. తనూజని ఎందుకు నామినేట్‌ చేయలేదు. ఎక్కడో నెగిటివ్‌ అయిపోతావనే ఉద్దేశంతో తనూజని నామినేట్‌ చేయలేదంటూ కళ్యాణ్‌పై అరిచింది.

Advertisement

తన కోసం తను కూడా స్టాండ్‌ తీసుకోవడం లేదంటూ శ్రీజ.. కళ్యాణ్‌ని నామినేట్‌ చేసినట్టు ఈ ప్రొమోలో చూపించారు. అయితే నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా మొత్తం ఎలిమినేట్‌ అయిన వారిలో ఎనిమిది మంది కంటెస్టెంట్స్‌ హౌజ్‌లోకి రాగా వారిలో ఇద్దరిని రీఎంట్రీ ఇచ్చారు. వారే శ్రీజ, భరణి అని తెలుస్తోంది. వీరిద్దరి రీఎంట్రీ దాదాపు కన్‌ఫాం అయ్యిందని, ఈ రోజు వీరిద్దరు తిరిగి హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఎలిమినేట్ అయిన వారిలో శ్రేష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియ, శ్రీజ దమ్ము, ఫ్లోరా సైనీ, భరణిలు నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. 

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×