E-Paper
Advertisement

Land Controversy: మధ్యప్రదేశ్‌ సీఎంకు బిగుసుకున్న ఉచ్చు.. రాజీనామా చేయాలంటూ ప్రజలు డిమాండ్!

Land Controversy: మధ్యప్రదేశ్‌ సీఎంకు బిగుసుకున్న ఉచ్చు.. రాజీనామా చేయాలంటూ ప్రజలు డిమాండ్!
Advertisement

Land Controversy: మధ్యప్రదేశ్‌ సీఎం ఉజ్జయినిలో 168 ఎకరాలు కొన్నారా? సంచలన మీడియా కథనాలు ఏం చెబుతున్నాయి? ఇందుకు తగిన ఆధారాలు ఎలాంటివి? ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపణలేంటి? దీనిపై సీఎం ఫ్యామిలీ రియాక్షనేంటి? అధికార బీజేపీ స్పందనేంటి? మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యుల భూముల కొనుగోళ్ల వ్యవహారంపై ఒక జాతీయ పత్రిక సంచలన ఆరోపణలు చేసింది. ఇదిప్పుడు ఎంపీ రాజకీయాలతో పాటు దేశ వ్యాప్తంగా పెను దుమారం చెలరేగేలా చేస్తోంది. 2023 డిసెంబర్ లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు మోహన్ యాదవ్. ఆయన చార్జ్ తీసుకున్న తర్వాత ఆయన సోదరుడు, భార్యా పిల్లలు, వారితో సంబంధమున్న కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు.. ఉజ్జయిన్ ఆ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగులు చేసినట్టు చెబుతోందీ మీడియా రిపోర్ట్.

సీఎం మోహన్ యాదవ్..

సీఎం మోహన్ యాదవ్ ఫ్యామిలీ మొత్తం 168 ఎకరాల విస్తీర్ణంలో 137 ప్లాట్లను కొన్నట్టుగా.. ఈ పత్రాల ద్వారా తెలుస్తోందని అంటోందీ పత్రిక. 2028లో ఉజ్జయినిలో సింహస్థ కుంభమేళా జరగబోతోంది. ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పన చేస్తుంది. హైవేలు, టౌన్ షిప్ లు, మెడికల్ సిటీ, నదీతీర ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. సరిగ్గా ఈ మాస్టర్ ప్లాన్ పరిధిలోనే భూముల కొనుగోళ్లు జరిగాయన్నది అసలు ఆరోపణ. సీఎం మోహన్ యాదవ్ కుటుంబం కొన్న ఈ భూముల్లోని 111 ఎకరాల్లో కొత్త రోడ్ నెట్ వర్క్, బైపాస్ రూట్స్ ప్లాన్ చేశారు. ఇందువల్ల ఈ భూముల విలువ రాత్రికి రాత్రే వందల రెట్టు పెరిగే అవకాశముంది. ఇది ఇన్ సైడర్ ట్రేడింగ్ లో భాగంగా భావిస్తున్నారు. అంటే ఇక్కడిలాంటి డెవలప్మెంట్ ప్రాజెక్టులు వస్తాయని ముందే తెలిసి ముఖ్యమంత్రి కుటుంబం ఈ ప్రాంతాల్లో అతి తక్కువ ధరలకు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి ఉంటారన్న విమర్శలు వినవస్తున్నాయి.

Advertisement

Also read: SpaceX Crash: ఎలాన్ మస్క్‌కు ఇన్వెస్టర్లు గట్టి షాక్.. స్పేస్‌ఎక్స్ షేర్లు పడిపోవడానికి అసలు కారణం ఇదే!

పాలిటిక్స్‌లో తీవ్ర కలకలం..

ఈ నివేదిక బయటకొచ్చిన వెంటనే ఎంపీ పాలిటిక్స్‌లో తీవ్ర కలకలం చెలరేగింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ ఇష్యూను మరింత హైలెట్ చేస్తోంది. సీఎం మోహన్ యాదవ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఈ ఆరోపణలపై ఇప్పటి వరకూ సీఎంఓ కానీ, బీజేపీ అధిష్టానం నుంచి కానీ స్పందన రాలేదు. ఈ అవినీతి ఆరోపణలు వచ్చే రోజుల్లో మరిన్ని మలుపులు తిరగొచ్చని కూడా భావిస్తున్నారు.

Advertisement

Storey By: Aoppa rao Big Tv

Also read: Nalgonda Deaths: నల్గొండ జిల్లాలో దారుణం.. ఒకే ఇంట్లో నలుగురు మృతి.. !

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×