E-Paper
Advertisement

గాంధీ భవన్‌లో ‘రచ్చ’.. ఢిల్లీలో ‘ఆల్ ఈజ్ వెల్’!

గాంధీ భవన్‌లో ‘రచ్చ’.. ఢిల్లీలో ‘ఆల్ ఈజ్ వెల్’!
Advertisement

KC Venugopal: టీ కాంగ్రెస్‌లో జ‌రుగుతుందేంటి? కేసీ వేణుగోపాల్ చెప్తున్న‌దేంటి? హైక‌మాండ్ చూపిస్తోన్న పిక్చ‌ర్ కు గ్రౌండ్ లెవ‌ల్‌లో గాంధీభ‌వ‌న్‌లో జ‌రుగుతోన్న ఘ‌ట‌న‌ల‌కు ఏమైనా లింక్‌వుందా? రియాల్టీ ఏంటో కేసీ వేణుగోపాల్‌కు అస‌లు తెలుసా? లేదా? ఆల్ ఈజ్ వెల్ అని స్టేట్మెంట్ ఇచ్చారంటే.. రిపోర్టుల‌ను చూసి ప‌ప్పుకాలేశారా? ఆయ‌న చెప్తున్న‌ట్టుగా స‌ర్కార్‌కు -పీసీసీకి మ‌ధ్య సంపూర్ణ స‌మన్వ‌యం ఉందా?

కేసీ వేణుగోపాల్ ఆసక్తికర పోస్ట్..

Advertisement

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌లతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశం తర్వాత కేసీ వేణుగోపాల్ ఆసక్తికర పోస్ట్ చేశారు. తెలంగాణలో ప్రభుత్వం, పార్టీ పరిపూర్ణ సమన్వయంతో పనిచేస్తున్నాయని, సంక్షేమ ఫలాలు అట్టడుగు వర్గాలకు అందుతున్నాయని కితాబిచ్చారు. మ‌రి నిజంగా అది నిజ‌మా? అస‌లు నిజాలేంటో ఎన్నో నిద‌ర్శనాలు క‌ళ్లముందున్నాయి. తెలింగాణ రైజింగ్ లక్ష్యం సీఎం రేవంత్ రెడ్డి ఓవైపు అభివృద్ధి, సంక్షేమం పై ఫోక‌స్ పెడుతూనే, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఏ కార్యక్రమం చేప‌ట్టినా కీ రోల్ పోషిస్తున్నారు. యువ‌త‌ను కాంగ్రెస్ వైపు న‌డిపిస్తున్నారు. ఐక్యంగా ప‌నిచేద్దామ‌ని సీఎం ప‌దే ప‌దే పిలుపునిస్తున్నా స‌రే ఐదేళ్లు ఒక్కలాఉండ‌వ‌న్నట్టుగా గాంధీ భ‌వ‌న్ సాక్షిగా లీడ‌ర్లు, క్యాడ‌ర్లు క‌ల‌హాల మార్క్‌ను చాటుకుంటూనే ఉన్నారు.

పీసీసీ చీఫ్‌పై ఆరోపణలు..

Advertisement

క్షేత్రస్థాయి పరిస్థితి ఏంటో జ‌గ‌ మెరిగిన ముచ్చటే. మ‌రి ఆల్ ఈజ్ వెల్ అని కేసీ వేణుగోపాల్ ఎలా చెప్పారు? ఏ ప్రాతిప‌దిక‌న‌. ప్రభుత్వానికి పార్టీకి మ‌ధ్య స‌మ‌న్వయం ఉందా అంటే వ‌చ్చే స‌మాధానం కాదనే.. ఒకవైపు పీసీసీ చీఫ్‌పై రకరకాల ఆరోపణలు, మరోవైపు జిల్లాల్లో నడిచే వేర్వేరు కుంపట్లు కాంగ్రెస్ నిత్యకలహాలకు అద్దం పడుతున్నాయి.

Also Read: తగ్గాడా? వ్యూహం మార్చాడా? పొలిటికల్ రీ-ఎంట్రీకి వంశీ బిగ్ ప్లాన్!

కేసీ వేణుగోపాల్ వ్యూహమేంటి..?

ఆధిప‌త్యం కోసం మంత్రుల మధ్య అంతర్గత పోరు మ‌రో లెవ‌ల్‌, చివరికి నేరుగా ముఖ్యమంత్రి వైఖరిపైనే కామెంట్స్ చేసేంత క్రమశిక్షణారాహిత్యం పార్టీని పట్టిపీడిస్తోంది. నియోజకవర్గాలకు నిధులు రావడం లేదని, పనులు కావడం లేదని స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే గాంధీ భవన్‌కు వచ్చి, ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముందే గగ్గోలు పెట్టే పరిస్థితి నెలకొంది. ఇలాంటి తలనొప్పులు, వర్గపోరు, అసమ్మతి జ్వాలలు బహిరంగంగానే కనిపిస్తుంటే.. అంతా అద్భుతంగా ఉందంటూ కేసీ వేణుగోపాల్ కితాబివ్వడం వెనుక అసలు వ్యూహమేంటి?

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×