E-Paper
Advertisement

కాంగ్రెస్ స్కెచ్, బీఆర్ఎస్ కౌంటర్, బీజేపీ రివర్స్ ఎటాక్.. కాళేశ్వరం చదరంగంలో అసలు గెలిచేదెవరు?

కాంగ్రెస్ స్కెచ్, బీఆర్ఎస్ కౌంటర్, బీజేపీ రివర్స్ ఎటాక్.. కాళేశ్వరం చదరంగంలో అసలు గెలిచేదెవరు?
Advertisement

Kaleshwaram: కాళేశ్వరంలో నీళ్ల కన్నా ఎక్కువగా వివాదాలే పారుతున్నాయి? రాజకీయ పార్టీలకు మైలేజ్‌ పెంచుకునే అస్త్రంగా మారింది. తప్పు జరిగిందని ఓ పార్టీ.. కరెక్ట్ చేయడం లేదని మరోపార్టీ. ఇద్దరు ఒక్కటేనని ఇంకోపార్టీ.. ఇలా మూడు పార్టీల ముక్కోణపు మాటల యుద్ధంలో కాళేశ్వరం కలలు కొట్టుకుపోవాల్సిందేనా?

ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం..

Advertisement

వేలకోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరంలో ఇప్పుడు నీళ్లు కాదు రాజకీయ రక్త ప్రవాహం ఉప్పొంగుతోంది. కాళేశ్వరం ఫ్లడ్‌లో బ్లడ్‌ పాలిటిక్స్ చేరి రాజకీయ అల్లకల్లోలాన్ని సృష్టిస్తోంది. కాళేశ్వరం కట్టడం కాంట్రవర్సీకి వేదికైంది. కుంగిన మేడిగడ్డ పిల్లర్లు, లీకేజీల చుట్టూ తిరుగుతున్న రాజకీయం.. ఇప్పుడు మూడు ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.

Also Read: 30 రోజులు జైల్లో ఉంటే పదవి అవుట్.. కేంద్ర బిల్లుపై దేశవ్యాప్తంగా పెను దుమారం!

Advertisement

సీఎం రేవంత్ సంచలన కాంమెంట్స్..

బీఆర్‌ఎస్‌ నేతల రక్తాన్ని రైతుల పొలాల్లో చల్లుతానని సీఎం రేవంత్‌రెడ్డి కామెంట్‌ చేయడంతో రాజకీయ దుమారం మొదలైంది. కాంగ్రెస్ రక్తదాహానికి రక్తదానం పేరిట తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసింది. దీనికి కౌంటర్‌గా అవినీతి కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్‌ నిరనన కార్యక్రమానికి దిగింది. ఇదిలా ఉండగా. కాంగ్రెస్ రాసిన డైరెక్షన్‌లోనే BRS నడుస్తోందంటూ బీజేపీ రివర్స్ అటాక్ చేస్తోంది.

తెలంగాణ రైతలకు ఏం ప్రయోజనం..?

ఇలా ముక్కోణపు మాటల యుద్ధంలో కాళేశ్వరం రాజకీయ రణక్షేత్రంగా మిగిలిపోయింది. దీనిపై ప్రజలకు ఏది నిజం, ఏది అబద్ధం అనేది తెలియాలంటే నిపుణుల సమక్షంలో చర్చ జరగాలి. కేవలం సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు, కౌంటర్ ట్వీట్లతో పొలిటికల్ డ్రామా నడపడం వల్ల తెలంగాణ రైతులకు ఏం ప్రయోజనం.? NDSA రిపోర్ట్‌లోని టెక్నికల్ అంశాలను, క్షేత్రస్థాయి వాస్తవాలను గమనించి ముందుకు వెళ్లాలి. అప్పుడే ఈ ప్రాజెక్టు భవిష్యత్‌పై క్లారిటీ వస్తుంది. లేదంటే రాజకీయ చదరంగంలో ఒక పావుగా మిగిలిపోవడం ఖాయం.

Also Read: గైడ్‌లు బట్టీ కొడితే ఇక సున్నా మార్కులే.. ఏపీ టెన్త్ పరీక్షల్లో ‘పరఖ్’ విప్లవం!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×