E-Paper
Advertisement

ధర్మేంద్ర ప్రధాన్ వికెట్ డౌన్.. కాక్రోచ్ పార్టీ నెక్స్ట్ టార్గెట్ ఎవరు?

ధర్మేంద్ర ప్రధాన్ వికెట్ డౌన్.. కాక్రోచ్ పార్టీ నెక్స్ట్ టార్గెట్ ఎవరు?
Advertisement

Cockroach Party: కేంద్ర కేబినెట్ నుంచి ధ‌ర్మేంద్ర ప్రధాన్ ఔట్‌. ఇక కాక్రోచ్‌ పార్టీ నెక్ట్స్‌ టార్గెట్‌ ఏంటి? జెన్ జీ మూమెంట్‌ను క‌ళ్లకు క‌ట్టిన అభిజిత్ అండ్ టీమ్ త‌దుప‌రి ప్లాన్ ఆఫ్ యాక్షన్‌ ఏంటి? అనేది అందరినీ ఆసక్తి పరుస్తుంది.

పొలిటికల్ ప్రమాదాలేంటో బిజేపీ పసిగట్టిందా..?

Advertisement

కిచెన్‌లోకి ప్రవేశించిన బొద్దింక‌లు ఇల్లంతా వ్యాపించ‌న‌ట్టుగా.. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం దేశమంతా పాకితే జ‌రిగే పరిణామాలు, పొలిటికల్ ప్రమాదాలేంటో భార‌తీయ జనతా పార్టీ ప‌సి గ‌ట్టిందా? దండోపాయం క‌న్నా త‌రుణోపాయం మేల‌ని ధ‌ర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించారా? అటు వ్యూహం సంగ‌తి ఎలా వున్నా ఇటు కాక్రోచ్ పార్టీ బలం.. బలగం గ్రాఫ్ ఓ రేంజ్‌లో పెరిగింది.

సీజేపీ రాజకీయ పార్టీగా ఏర్పడుతుందా..?

Advertisement

ఎవరు ఔన‌న్నా కాదన్నా ఇది కాదనలేని నిజం. మరి అందివచ్చిన అవ‌కాశాన్ని సీజేపీ అస్త్రంగా మలుచుకొని రాజ‌కీయ పార్టీగా అవ‌త‌రిస్తుందా? పేప‌ర్ లీకులు నుంచి అవినీతి వైపు ట‌ర్న్ తీసుకొని దేశ‌ వ్యాప్తంగా క్యాడ‌ర్‌ను పెంచుకునే దిశ‌గా పావులు క‌దుపుతున్నారా?..ఒక్క రాజీనామాతో సీజేపీ ఉద్యమాన్ని నీరుగార్చడంలో కేంద్రం స‌క్సెస్ అయింద‌నే టాక్ వ‌చ్చింది. కానీ చ‌ర్చపై నీళ్లు చ‌ల్లింది సీజేపీ . త‌గ్గామ‌నుకుంటే త‌ప్పు. నీరుగార్చాల‌ని చూస్తే నిప్పుర‌వ్వలై జ్వలిస్తామంటూ కేంద్రానికి ఝ‌ల‌క్ కాదు ఏకంగా అల్టిమేట‌మే జారీ చేశారు సీజేపీ వ్యూహ‌క‌ర్తలు.

కాక్రోచ్ పార్టీ డిమాండ్స్

చ‌ర్చల సంద‌ర్భంగా త‌మ‌కు ఇచ్చిన హామీల ప్రకారం నిర‌స‌న‌ల టైమ్‌లో అదుపులోకి తీసుకున్నవాళ్లంద‌ర్నీ విడుద‌ల చేయాలి, స్టూడెంట్స్ పెట్టిన కేసులను వెంట‌నే ఉప‌సంహ‌రించాల‌ని డిమాండ్ చేశారు సీజేపీ స్పోక్స్ ప‌ర్సన్ సౌర‌భ్‌. అలాగే ఇదే అద‌నుగా కాక్రోచ్ టీమ్‌ను క‌లుపుకొని వెళ్తే క‌లిసొస్తుంద‌ని కాంగ్రెస్ పావులు క‌దుపుతుంద‌నే ప్రచారం కూడా జ‌రుగుతోంది. వెనుకాల ఎవ‌రున్నార‌నే నాన్ సెన్స్ డిబెట్ ఓ పాయింటే కాదే. ముందుకు దూసుకెళ్లడ‌మే త‌మ అభిమ‌తం అంటోంది అభిజిత్ టీమ్‌.

కాక్రోచ్ టీమ్ నెక్ట్ ప్లాన్ ఏంటి..?

ఇచ్చిన హామీ ప్రకారం కేసుల‌ను ఎత్తేయ‌క‌ప‌తే మ‌రో సినిమా చూపించ‌డానికి సిద్దమ‌వుతున్నారా? నాట్ ఓన్లీ పేప‌ర్ లీకులు..అవినీతిపై కూడా ఫోక‌స్ పెట్టి దేశ‌వ్యాప్తంగా బ‌లం పెంచుకునే ప్రయ‌త్నం షురూ చేశారా?. కాక్రోచ్ టీమ్ నెక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంట‌న్నది ఆస‌క్తి రేపుతోంది. రాజ‌కీయ శ‌క్తిగా ఎదిగేలా వ్యూహాల‌కు ప‌ద‌ను పెడుతున్నార‌నే ఊహాగానాలు జోరందుకున్నాయి.

Also Read: సింగరేణిని నాశనం చేశారు.. KCR, కాంగ్రెస్‌లపై విరుచుకుపడ్డ కిషన్ రెడ్డి!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×