E-Paper
Advertisement

Donald Trump: ఇక నేను ఎక్కువకాలం బతకనంటూ.. డోనాల్డ్ ట్రంప్ ఎమోషనల్..!

Donald Trump: ఇక నేను ఎక్కువకాలం బతకనంటూ.. డోనాల్డ్ ట్రంప్ ఎమోషనల్..!
Advertisement

Donald Trump: డొనాల్డ్ ట్రంప్.. ఈ పేరే ఓ సంచలనం. ఇటీవలి కాలంలో అమెరికా ప్రెసిడెంట్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. అమెరికా రాజకీయాల్లో ఏదో అభద్రతా భావం నీడలా వెంటాడుతోందని అనిపిస్తోంది. ఆ రెండు హత్యాయత్నాలు, ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. అమెరికా చరిత్రలో ఎందరో అధ్యక్షులు ప్రాణాంతక దాడులు ఎదుర్కొన్నారు. కానీ, ట్రంప్ రెండుసార్లు ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంపైనే చర్చ జరుగుతోంది. ప్రెసిడెంట్ ట్రంప్ చుట్టూ ఎంతటి బలమైన సెక్యూరిటీ ఉన్నా, దుండగులు ఆ వలయాన్ని ఛేదించే ప్రయత్నం చేయడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. తనపై జరుగుతున్న వరుస హత్యాయత్నాలపై.. ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. తనని హత్య చేసేందుకు చాలా మంది ట్రై చేస్తున్నారని, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. తానెంత కాలం ఉంటానో కూడా తెలియట్లేదన్నారు. ఇలాంటి షూటర్లు.. సాధారణ అధ్యక్షుల జోలికి వెళ్లరని, కేవలం అసాధారణ విజయాలు సాధించే ప్రెసిడెంట్లనే టార్గెట్ చేసుకుంటారని తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షులు అబ్రహం లింకన్, జాన్ ఎఫ్.కెన్నడీ హత్య ఘటనల్ని ఎగ్జాంపుల్‌గా చెపారు ట్రంప్. ఎన్ని బెదిరింపులకు పాల్పడినా, తాను తీసుకునే నిర్ణయాలపై ఏమాత్రం వెనక్కి తగ్గేదేలేదన్నారు.

సభలో ట్రంప్‌పై దాడి..

ఇటీవలే ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసంలోకి ఓ సాయుధ దుండగుడు చొరబడ్డాడు. ఇది.. అమెరికాలో తీవ్ర కలకలం రేపింది. దుండగుడి చేతిలో ఆయుధంతో పాటు ఇంధనం క్యాన్ ఉన్నట్లు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు గుర్తించారు. వాటిని కిందపడేయాలని హెచ్చరించినా, ఆ దుండగుడు వినకపోవడంతో.. భద్రతా సిబ్బంది అతడిని హతమార్చారు. 2024 జులైలో.. పెన్సిల్వేనియా ఎన్నికల ప్రచార సభలో ట్రంప్‌పై జరిగిన దాడి ప్రపంచాన్ని షాక్‌కి గురిచేసింది. వేదికపై ట్రంప్ మాట్లాడుతుండగా, థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు ఏఆర్-15 రైఫిల్‌తో కాల్పులు జరిపాడు. ట్రంప్ సరిగ్గా ఆ సమయంలో తల పక్కకు తిప్పడంతో, బుల్లెట్ ఆయన కుడి చెవిని తాకుతూ వెళ్లిపోయింది. లేకపోతే.. అది నేరుగా తలకు తగిలేది. సీక్రెట్ సర్వీస్ భద్రతలో ఉన్న లోపాలను ఈ ఘటన ఎత్తిచూపింది. భవనంపైకి దుండగుడు ఎలా వెళ్లగలిగాడన్న దానిపై అప్పట్లో పెద్ద చర్చే నడిచింది. ఇది జరిగిన కొన్నాళ్లకే.. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా మరో హత్యాయత్నం జరిగింది. ఓ దుండగుడు తుపాకీతో పొదల్లో పొంచి ఉండగా, సీక్రెస్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపి అతన్ని అడ్డుకున్నారు. ఆ నిందితుడికి ఇటీవలే కోర్టు జీవితఖైదు కూడా విధించింది. ట్రంప్ నివాసానికి సమీపంలోనే ఇలాంటి ఘటన జరగడం ట్రంప్ వ్యక్తిగత భద్రతపై ఆందోళనల్ని పెంచింది. ఈసారి ఏకంగా.. ప్రెసిడెంట్ ట్రంప్ నివాసంలోకి ఆయుధాలతో దుండగుడు చొరబడటం సంచలనంగా మారింది. ప్రెసిడెంట్ వ్యక్తిగత నివనాసంలో ఇంతటి భద్రతని దాటుకొని ఎలా రాగలిగాడనే అశంపై ఎఫ్‌బీఐ లోతైన విచారణ చేస్తోంది. నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని కొందరు భావిస్తుండగా.. దీని వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.

Advertisement

Also Read: TG ARSK Centers: రాష్ట్రంలో ఏఆర్ఎస్ కే సెంటర్లదే హవా.. విచ్చలవిడిగా కొనసాగుతున్న యూరియా దందా..!

ప్రపంచవ్యాప్తంగా సంచలనం

ట్రంప్‌పై జరిగిన వరుస హత్యాయత్నాలు అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని సృష్టించాయి. ఈ ఘటనలు యూఎస్‌లో తీవ్ర రాజకీయ రచ్చకు దారితీశాయ్. మెజారిటీ అమెరికన్లు దీనిని వ్యక్తిగత దాడిగానే కాకుండా, తమ ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా.. సీక్రెట్ సర్వీస్ లాంటి అత్యున్నత భద్రతా సంస్థల వైఫల్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. బట్లర్, పెన్సిల్వేనియా ఘటన తర్వాత సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. భవిష్యత్తులో అభ్యర్థులకు భద్రతను ఎలా పెంచాలనే దానిపై పార్లమెంటరీ విచారణలు జరుగుతున్నాయి. ఈ దాడుల వల్ల.. ట్రంప్ మద్దతుదారుల్లో ఒక రకమైన సానుభూతి పెరిగింది.

Advertisement

Also Read: Top Load Washing Machines: ట్రెండ్ సెట్టింగ్ ఏఐ వాషింగ్ మిషన్లు.. వచ్చే నెలలోనే లాంచ్.. ఒకసారి బట్టలు వేశారంటే..!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×