E-Paper
Advertisement

Transco DE: తీగ లాగితే ఐఏఎస్‌లనే తలదన్నే తిమింగలం పడింది! ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో బయటపడ్డ ఆస్తులు చూస్తే మైండ్ బ్లాకే!

Transco DE: తీగ లాగితే ఐఏఎస్‌లనే తలదన్నే తిమింగలం పడింది! ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో బయటపడ్డ ఆస్తులు చూస్తే మైండ్ బ్లాకే!
Advertisement

Transco DE: ఓ చిన్న లంచం కేసులో దొరికిన తీగను లాగితే.. కొండంత అవినీతి తిమింగలం బయటపడింది. అధికారులు సైతం కళ్లు చెదిరేలా ఆస్తుల గుట్ట కదిలింది. శ్రమ లేకుండా సంపాదించిన అక్రమాలకు హద్దూ అదుపూ లేకుండా పోతుందనడానికి ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ ఉదంతమే స్పష్టమైన నిదర్శనం.

తెలుగు రాష్ట్రాల్లోని 12 ప్రాంతాల్లో ఏసీబీ పంజా..

Advertisement

హైదరాబాద్‌లోని అత్యంత విలాసవంతమైన హైటెక్స్‌ మీనాక్షి స్కైట్ టవర్స్‌లోని ఆయన నివాసంతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో విరుచుకుపడ్డాయి. బ్యాంకు లాకర్లు తెరిచి చూసిన అధికారులకు కళ్లు చెదిరే సీన్ కనిపించింది. కేవలం లాకర్లలోనే కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు, గోల్డ్ కాయిన్స్, ధగధగలాడే డైమండ్ జ్యువెలరీ ప్రత్యక్షమయ్యాయి. ప్రాథమికంగా కేవలం ఈ ఆభరణాల విలువే కోటి రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

రియల్ ఎస్టేట్ కంపెనీలు, అపార్ట్‌మెంట్‌లు..

Advertisement

ఇక భూములు, భవనాల విషయానికి వస్తే ఆయన దాహానికి పరిమితి లేకుండా పోయింది. కూకట్‌పల్లి, మూసాపేట్, ఖానామెట్, గుట్టల బేగంపేట్ వంటి డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో నివాస, వాణిజ్య సముదాయాలు, ప్లాట్లు, నిర్మాణంలో ఉన్న ఆస్తులను అధికారులు గుర్తించారు. ముత్యం వెంకటరమణ, ఆయన భార్య స్వప్న పేర్లపై రియల్ ఎస్టేట్ కంపెనీలతో పాటు అపార్ట్‌మెంట్‌లు నడుస్తున్నట్లు విచారణలో తేలింది. ఒక్క కూకట్‌పల్లిలోనే 8 చోట్ల ప్లాట్లు, కమర్షియల్ బిల్డింగ్‌లు, 10 ఫ్లాట్లు, లగ్జరీ కార్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.

రూ. 15 కోట్ల విలువైన ఆస్తులు..

నిజానికి ఆయన అవినీతి చరిత్ర ఈనాటిది కాదు. 2019లో రూ. 26 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినప్పటి నుంచే ఏసీబీ అధికారులు ఆయనపై డేగకన్ను వేశారు. వెంకటరమణ సైలెంట్‌గా ఉంటూనే వెనక పెద్ద ఎత్తున దందాలు సాగించినట్లు గుర్తించి నిరంతరం నిఘా పెట్టారు. ఆయన గతంలో క్లియర్ చేసిన ఫైళ్లను కూడా ఇప్పుడు క్షుణ్ణంగా త్రవ్వుతున్నారు. ఒక్కచోటే ప్రభుత్వ రికార్డుల ప్రకారం దాదాపు రూ. 15 కోట్ల విలువైన ఆస్తులున్నాయంటే, ఇక బయటి మార్కెట్ విలువ ప్రకారం ఇవి వందల కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదు.

ఒక చిన్న లంచం కేసుతో మొదలైన ఈ దర్యాప్తు.. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులను సైతం తలదన్నే అక్రమాస్తుల తిమింగలాన్ని బయటకు తీసింది. ఏసీబీ తనిఖీలు ఇంకా కొనసాగుతుండటంతో రానున్న రోజుల్లో ఆయన అవినీతి సామ్రాజ్యానికి సంబంధించి మరిన్ని సంచలనాత్మక నిజాలు వెలుగులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: ఆ హామీ ఇస్తే.. దీక్ష విరమిస్తా..కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×