E-Paper
Advertisement

Senior Citizens: 116 ఏళ్ల వృద్ధురాలి తిరుమల యాత్ర వైరల్ వీడియో.. సీఎం చంద్రబాబు ఫిదా!

Senior Citizens: 116 ఏళ్ల వృద్ధురాలి తిరుమల యాత్ర వైరల్ వీడియో.. సీఎం చంద్రబాబు ఫిదా!
Advertisement

Senior Citizens: 40 ఏళ్లు దాటితేనే నడవలేని ప్రస్తుత జనరేషన్‌కు 116 ఏళ్ల బామ్మ షాక్‌ ఇచ్చింది. ఏకంగా శ్రీవారి అలిపిరి మార్గంలో కాలినడక ద్వారా తిరుమలకు చేరుకుంది. చెరగని చిరునవ్వుతో గోవింద నామస్మరణతో మెట్లను అవలీలగా ఎక్కుతూ.. అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోను చూసిన సీఎం చంద్రబాబు సైతం ఆశ్చర్యపోయి శభాష్‌.. అవ్వ.. అంటూ అభినందించారు. వృద్ధురాలి వీడియో వైరల్‌ కావడంతో TTD చైర్మన్‌ BR నాయుడు స్పందించారు. వృద్ధురాలితో పాటు ఆమె కుటుంబానికి కూడా వీఐపీ దర్శనం కల్పించి సకల తన సిబ్బందితో ఏ లోటూ లేకుండా సకల లాంచనాలతో శ్రీవారి దర్శనం దగ్గరుండి చేయించారు.

Also read: Vizag Metro: వైజాగ్ మెట్రోకు ఇంకా రాని క్లియరెన్స్.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా మారిన ప్రాజెక్ట్!

TTD ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తోంది?

Advertisement

అంతా బాగానే ఉంది. అవ్వ ఆరోగ్యంగా ఉంది కాబట్టి సరిపోయింది. అదే ఆరోగ్యంగా లేకపోతే.. నడక మార్గంలో తిరుమల చేరుకోగలిగేదా? వృద్ధాప్యంతో బాధపడుతూ.. శ్రీవారిని దర్శించుకోలేక రాజీపడే సీనియర్‌ సిటిజన్స్‌కు TTD ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తోంది? 40 ఏళ్లు దాటితేనే ఐరానా పడే ప్రస్తుత జనరేషన్‌లో.. 90 ఏళ్లు దాటినవారి సిచుయేషన్‌ ఏంటి? అనే ప్రశ్నలు ప్రస్తుతం వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులకు కల్పించే వీఐపీ బ్రేక్‌ దర్శనాలను 90 ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్స్‌కు సైతం కల్పిస్తే తప్పేంటి? అనే ప్రశ్నలు, డిమాండ్స్‌ ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. మరి TTD ఆ దిశగా నిర్ణయం తీసుకుంటుందా? 116 ఏళ్ల వృద్ధురాలిపై చూపిన సానుభూతి, గౌరవం.. 90 ఏళ్లు దాటిన వృద్ధులందరిపై చూపుతారా? అనేది ప్రస్తుతం మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

Also read: Social Media: జోసెఫ్ అరెస్ట్‌పై మాజీ సీఎం జగన్ ఫైర్.. ఏపీలో ముదిరిన సోషల్ మీడియా వార్!

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×