E-Paper
Advertisement

వర్షాకాలంలో మీ టూవీలర్ స్టార్ట్ అవ్వడంలేదా?.. అయితే ఇలా ట్రై చేసి చూడండి..

వర్షాకాలంలో మీ టూవీలర్ స్టార్ట్ అవ్వడంలేదా?.. అయితే ఇలా ట్రై చేసి చూడండి..
Advertisement

Bike Rain Problems: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది కానీ, బైకులు, స్కూటీలు నడిపేవారికి మాత్రం కొత్త తలనొప్పులు మొదలవుతాయి. ఆఫీసుకో, అర్జంట్ పనిమీదో బయలుదేరినప్పుడు కరెక్ట్‌గా వానలో బైక్ స్టార్ట్ కాకుండా మొరాయిస్తుంది. అసలు వర్షాకాలంలో టూ వీలర్స్ ఎందుకు ఇలా ఆగిపోతాయి? అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

Read also-అబ్బాయ్ కోసం తప్పుకున్న బాబాయ్.. ‘పెద్ది’ వల్ల ‘గబ్బర్ సింగ్’ రీ-రిలీజ్ వాయిదా!

బైకులు, స్కూటీలు మొరాయించడానికి ప్రధాన కారణాలు

Advertisement

స్పార్క్ ప్లగ్‌లో తేమ చేరడం: వర్షం పడినప్పుడు లేదా బైక్ వాటర్ లాగింగ్‌లో (నీటి గుంతల్లో) వెళ్లినప్పుడు స్పార్క్ ప్లగ్ క్యాప్‌లోకి నీరు చేరుతుంది. దీనివల్ల కరెంట్ సప్లై ఆగిపోయి ఇంజన్ స్టార్ట్ కాదు.

కార్బ్యురేటర్ / ఫ్యూయల్ ట్యాంక్‌లోకి నీరు వెళ్లడం: పెట్రోల్ ట్యాంక్ మూత సరిగ్గా లేకపోయినా, లేదా ఎయిర్ వెంట్స్ ద్వారా అయినా వర్షపు నీరు లోపలికి వెళ్లే అవకాశం ఉంది. పెట్రోల్‌లో నీరు కలిస్తే బైక్ అస్సలు స్టార్ట్ అవ్వదు, ఒకవేళ స్టార్ట్ అయినా మధ్యమధ్యలో ఆగిపోతుంది (జర్కులు ఇస్తుంది).

Advertisement

ఎయిర్ ఫిల్టర్ తడిసిపోవడం: ఇంజన్‌లోకి గాలిని పంపే ఎయిర్ ఫిల్టర్ వర్షానికి తడిస్తే, ఇంజన్‌కు అందాల్సిన ఆక్సిజన్ అందక బైక్ ఆగిపోతుంది.

ఎలక్ట్రికల్ వైరింగ్ షార్ట్ సర్క్యూట్: పాతబడిన వైర్లు లేదా కనెక్షన్లు వాన నీటి వల్ల షార్ట్ సర్క్యూట్ అవుతాయి. దీనివల్ల సెల్ఫ్ స్టార్ట్ పనిచేయకపోవడం, హారన్, లైట్లు మొరాయించడం జరుగుతుంది.

టూ వీలర్ మొరాయించినప్పుడు ఏం చేయాలి?

నీరు నిలిచిన రోడ్లపై బైక్ ఆగిపోతే, బలవంతంగా పదే పదే సెల్ఫ్ స్టార్ట్ (Self Start) నొక్కకూడదు. దీనివల్ల బ్యాటరీ డౌన్ అవ్వడమే కాకుండా ఇంజన్ పాడయ్యే ప్రమాదం ఉంది.

స్పార్క్ ప్లగ్‌ను క్లీన్ చేయండి: మొదట స్పార్క్ ప్లగ్ క్యాప్‌ను తీసి, లోపల ఉన్న నీటిని పొడి గుడ్డతో లేదా గట్టిగా ఊది తుడవండి. ప్లగ్‌ను పొడిగా మార్చిన తర్వాత పెడితే బైక్ వెంటనే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.

కిక్ స్టార్ట్ ఉపయోగించండి: సెల్ఫ్ స్టార్ట్ కానప్పుడు కీ ఆఫ్ చేసి, 3-4 సార్లు గట్టిగా కిక్ కొట్టండి. ఆ తర్వాత కీ ఆన్ చేసి చోక్ (Choke) ఉపయోగించి కిక్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి.

పెట్రోల్ చెక్ చేసుకోండి: బైక్ ఆన్ అయి మళ్లీ ఆగిపోతుంటే, పెట్రోల్ ఆన్/ఆఫ్ నాబ్ కింద ఉండే పైప్ తీసి కొద్దిగా పెట్రోల్ కింద వదిలి చూడండి. నీటి చుక్కలు వస్తే, మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లి కార్బ్యురేటర్ క్లీన్ చేయించాలి.

Read also-గ్యాస్ సమస్య కోసం ప్రతిరోజూ యాసిడిటీ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారా? ఆరోగ్యానికి ప్రమాదకరం

సైలెన్సర్‌లో నీరు చేరితే: సైలెన్సర్‌లోకి నీరు వెళ్తే బైక్ వెనుక వైపును కాస్త పైకి లేపి నీటిని బయటకు వచ్చేలా చేయాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • వీలైనంత వరకు బైక్‌ను వర్షంలో కాకుండా నీడలో లేదా కవర్ కప్పి పార్క్ చేయండి.
  • నీటి గుంతల్లో వెళ్లేటప్పుడు ఫస్ట్ గేర్‌లోనే ఉంచి, యాక్సిలరేటర్ తగ్గకుండా చూసుకోండి.
  • వర్షాకాలం ప్రారంభానికి ముందే సర్వీసింగ్ చేయించి, వైరింగ్‌కు వాటర్ ప్రూఫ్ టేప్ వేయించుకోవడం మంచిది.
  • ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలంలో మీ ప్రయాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోతుంది.

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×