E-Paper
Advertisement

Upcoming Yamaha Bikes 2026: దేశీ మార్కెట్లో లాంచ్ కాబోతున్న క్రేజీ యమహా బైక్స్.. లైనప్ చూస్తే అదిరిపోవాల్సిందే!

Upcoming Yamaha Bikes 2026: దేశీ మార్కెట్లో లాంచ్ కాబోతున్న క్రేజీ యమహా బైక్స్.. లైనప్ చూస్తే అదిరిపోవాల్సిందే!
Advertisement

New Yamaha Bikes 2026:  యువతను ఆకట్టుకునేలా సూపర్ డూపర్ బైక్స్ తీసుకురావడంలో యమహా ముందుంటుంది. ఈ కంపెనీ వచ్చే రెండు సంవత్సరాల్లో ఏకంగా 10కి పైగా అదిరిపోయే బైక్స్ లాంచ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో ఏరోక్స్ E, టెనెరే 700, MT 09, MT-07, FZ-15 ABS లాంటి బైక్స్ ఉన్నాయి. వీటిలో కొన్ని అడ్వెంచర్ బైక్స్ కాగా, మరికొన్ని స్పోర్ట్స్ బైక్స్. ఏరోక్స్ E రాబోయే 10 నెలల్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా దేశీయ మార్కెట్లోకి రాబోయే యమహా బైక్‌లు, స్కూటర్ల గురించి  ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ Yamaha Aerox-E (ఎలక్ట్రిక్ స్పోర్టీ స్కూటర్)

ఇది స్పోర్టీ డిజైన్‌ తో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ గా అందుబాటులోకి రానుంది. అంచనా ధర రూ. 2.5 – 3 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. 2026 ఫస్ట్ క్వార్టర్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

⦿ Yamaha EC-06 (ఎలక్ట్రిక్ కమ్యూటర్ స్కూటర్)

Advertisement

ఈ స్కూటర్ ఫ్యామిలీ ఫ్రెండ్లీగా ఉండబోతోంది. ప్రాక్టికల్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా మార్కెట్లోకి రానుంది. దీని అంచనా ధర రూ. 1.5 – 1.8 లక్షలు ఉంటుంది. 2026 ఫస్ట్ క్వార్టర్ లో విడుదలకానుంది.

⦿ Yamaha MT-07 (మిడిల్‌వెయిట్ నేకెడ్ స్ట్రీట్‌ఫైటర్)

ఈ బైక్ 689cc ట్విన్ సిలిండర్ ఇంజన్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోనుంది. ఈ బైక్ అంచనా ధర రూ. 7.5 – 8 లక్షలు ఉంటుంది. జనవరి 2026లో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

⦿ Yamaha YZF-R7 (సూపర్‌స్పోర్ట్ బైక్)

Advertisement

ట్రాక్ ఇన్‌ స్పైర్డ్ డిజైన్, 689cc ఇంజన్ తో సూపర్ పవర్ తో ఈ బైక్ రెడీ అవుతోంది. దీని అంచనా ధర రూ. 10 లక్షలకు పైనే ఉంటుందని భావిస్తున్నారు. 2026 మిడ్ ఇయర్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

⦿ Yamaha Tenere 700 (అడ్వెంచర్ టూరర్)

ఆఫ్ రోడ్ కెపాబిలిటీతో అడ్వెంచర్ బైక్ గా రూపొందుతోంది. భారత్ మొబిలిటీ ఎక్స్‌ పోలో దీనిని షోకేస్ చేశారు. అంచనా ధర రూ. 12-15 లక్షలుగా ఉంటుంది. లాంచింగ్ 2026 మిడ్ ఇయర్ లో ఉంటుందని భావిస్తున్నారు.

⦿ Yamaha MT-09, YZF-R9

ఈ రెండు బైక్స్ హై పర్ఫార్మెన్స్ మోడల్స్ గా రానున్నాయి. ప్రీమియం సెగ్మెంట్ లో అడుగు పెట్టబోతున్నాయి. 2026 చివరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ధర ఎంత ఉంటుందనేది త్వరలో తెలియనుంది.

Yamaha ఇతర మోడల్స్

⦿Yamaha Lander 250: ఇది డ్యూయల్ స్పోర్ట్ గా రాబోతోంది. Xpulse రైవల్ కానుంది.

⦿ Yamaha NMax 155: మ్యాక్సీ స్కూటర్ గా మార్కెట్లోకి అడుగు పెట్టనుంది.

⦿ అప్‌డేటెడ్ R3, MT-03: ఈ రెండు బైక్స్ 2026 మిడ్ ఇయర్ లో అందుబాటులోకి రానున్నాయి.

ఈ బైక్స్ కు సంబంధించి కచ్చితమైన లాంచ్ డేట్స్, ధరలు యమహా అధికారికంగా ప్రకటించిన తర్వాత మారవచ్చు. తాజా అప్‌డేట్స్ కోసం యమహా అఫీషియల్ వెబ్‌ సైట్ చెక్ చేయడం మంచిది.

Read Also:  అమ్మకాల్లో దుమ్మురేపిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×