E-Paper
Advertisement

Upcoming Cars Feb 2026: మారుతి To స్కోడా.. ఫిబ్రవరి 2026లో విడుదల కాబోతున్న క్రేజీ కార్లు ఇవే!

Upcoming Cars Feb 2026: మారుతి To స్కోడా.. ఫిబ్రవరి 2026లో విడుదల కాబోతున్న క్రేజీ కార్లు ఇవే!
Advertisement

ఇండియన్ మార్కెట్ లోకి ఫిబ్రవరి 2026లో పలు క్రేజీ కార్లు లాంచ్ కాబోతున్నాయి. వీటిలో పలు ఎలక్ట్రిక్ SUVలతో పాటు అదిరిపోయే ఫేస్‌ లిఫ్ట్‌ లు రాబోతున్నాయి. వీటిలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మారుతి ఇ విటారాతో పాటు స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్, టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ఉన్నాయి. అటు MG మెజెస్టర్, మహీంద్రా థార్ E/XUV.e8,  మారుతి బ్రెజ్జా 2026 విడుదలకు రెడీ అవుతున్నాయి. బడ్జెట్ కార్ల ధరలు రూ. 6 లక్షల నుంచి ప్రీమియం EVల ధరలు రూ. 1 కోటి పైగా ఉన్నాయి.

ఫిబ్రవరి 2026లో లాంచ్ కాబోయే క్రేజీ కార్లు

Advertisement

⦿ మారుతి సుజుకి ఇ విటారా (SUV/EV): ఫిబ్రవరి 2026లో ఈ కారు విడుదల కానున్నాయి. ఈ కారు రూ. 17 నుంచి రూ. 20  లక్షల వరకు ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న కీలక ఎలక్ట్రిక్ కార్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.

⦿ టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా (SUV/EV): ఫిబ్రవరి 19, 2026 నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారు ధర రూ. 16 నుంచి రూ. 19.50 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నారు.

Advertisement

⦿ స్కోడా కుషాక్ ఫేస్‌ లిఫ్ట్ (SUV): ఫిబ్రవరి 13, 2026న విడుదల కానుంది. డిజైన్ అప్‌ డేట్స్ తో రానుంది. ఈ కారు ధర సుమారు రూ. 11 నుంచి రూ. 19 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు.

⦿ MG మెజెస్టర్ (SUV): ఫిబ్రవరి 15, 2026న ఈ కారు విడుదల కానుంది. ప్రీమియం సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని మార్కెట్లోకి అడుగు పెట్టబోతుంది. ఈ కారు ధర రూ. 40 నుంచి రూ. 45 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు.

⦿ మహీంద్రా XUV.e8 / థార్ E (SUV/EV):ఈ కారు ఫిబ్రవరి 15న లేదంటే 17, 2026న విడుదల కానుంది. ఈ కారు ధర రూ. రూ.25 నుంచి రూ. 50 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నారు.

⦿ మారుతి బ్రెజ్జా 2026 (SUV): ఫిబ్రవరి 15, 2026న విడుదల కానుంది. దీని ధర సుమారు రూ.8.50 నుంచి రూ. 14 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు.

⦿ వోక్స్‌ వ్యాగన్ టేరాన్ ఆర్ లైన్ (SUV): ఈ కారు ఫిబ్రవరి 2026లో విడుదల కానుంది. ప్రీమియం SUV విభాగంలో ఈ కారు అడుగు పెట్టే అవకాశం ఉంటుంది. ఈ కారు ధర రూ. 45 నుంచి రూ. 53 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు.

⦿ ఆడి Q6 ఇ-ట్రాన్ / A5 (EV/లగ్జరీ): ఫిబ్రవరి 15, 2026న విడుదల కానుంది. ఈ ప్రీమియం లగ్జరీ కారు ధర  సుమారు రూ. 1 కోటికి పైగా ఉంటుంది.

⦿ సిట్రోయెన్ C3 ఫేస్‌ లిఫ్ట్ (హ్యాచ్‌ బ్యాక్/SUV): ఈ కారు ఫిబ్రవరి 11, 2026న విడుదల కానుంది. దీని ధర సుమారు రూ. 6 లక్షల నుంచి రూ.10 లక్షలు ఉంటుంది.

విభాగాల వారీగా ఫిబ్రవరి 2026 ట్రెండ్‌లు

⦿ SUVలు: వోక్స్‌ వ్యాగన్ టైగన్ ఫేస్‌ లిఫ్ట్, కొత్త నిస్సాన్ మోడల్స్ లాంటి మోడళ్లు ఫిబ్రవరిలో ఆధితప్యం చెలాయించనున్నాయి.

⦿ EVలు: లీప్‌ మోటార్, కియా(సైరోస్ EV ) నుంచి కొత్త కార్లు లాంచ్ కానున్నాయి. BMW/టెస్లా నుంచి ప్రీమియం ఎంపికలపై దృష్టి పెట్టండి.

⦿ బడ్జెట్- కాంపాక్ట్: మారుతి(వ్యాగన్ ఆర్ ఎలక్ట్రిక్), నిస్సాన్ నుంచి కొత్త కార్లు విడుదల కానున్నాయి.

Read Also: ఎలక్ట్రిక్ కార్లలో ఈ మోడ్రన్ ఫీచర్‌ను బ్యాన్ చేసిన చైనా.. అదే దారిలో బ్రెజిల్, ఎందుకంటే?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×