E-Paper
Advertisement

జూలైలో కొత్త కార్ల జాతర.. ఏకంగా 8 క్రేజీ మోడల్స్ లాంచ్!

జూలైలో కొత్త కార్ల జాతర.. ఏకంగా 8 క్రేజీ మోడల్స్ లాంచ్!
Advertisement

Upcoming Cars in India July 2026: జూలై 2026లో భారత కార్ల మార్కెట్‌ లోకి పలు కొత్త మోడళ్లు విడుదల కానున్నాయి. బడ్జెట్ హ్యాచ్‌ బ్యాక్‌ల నుంచి ప్రీమియం ఎస్‌యూవీలు, ఎలక్ట్రిక్ కార్లు, హైబ్రిడ్ మోడళ్ల వరకు మొత్తం ఎనిమిది కొత్త కార్లు మార్కెట్‌లోకి రానున్నాయి. రెనాల్ట్, నిస్సాన్, మారుతి సుజుకి, టయోటా, ఎంజీ, హోండా, స్కోడా, ఆడి లాంటి ప్రముఖ కంపెనీలు ఈ నెలలో  కొత్త కార్లను పరిచయం చేసేందుకు రెడీ అయ్యాయి.

1.రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్

మొదటగా రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ జూలై 3న విడుదల అయ్యింది. ఈ కారుకు కొత్త LED డే టైమ్ రన్నింగ్ లైట్లు, రీడిజైన్ చేసిన బంపర్లు, కొత్త అల్లాయ్ వీల్స్, కొత్త టెయిల్ ల్యాంప్స్ లాంటి మార్పులతో ఆకట్టుకుంటుంది. క్యాబిన్‌ లో పెద్ద టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, కొత్త డాష్‌ బోర్డ్ డిజైన్  అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు మాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఆప్షన్స్ అలాగే ఉన్నాయి.

2.నిస్సాన్ టెక్టన్

Advertisement

జూలై 9న నిస్సాన్ టెక్టన్ గ్లోబల్‌గా పరిచయం కానుంది. ఇది రెనాల్ట్ డస్టర్ ప్లాట్‌ ఫారమ్ ఆధారంగా రూపొందించిన కొత్త మిడ్ సైజ్ SUV. నిస్సాన్ ప్యాట్రోల్ నుంచి ప్రేరణ పొందిన డిజైన్‌తో ఈ మోడల్ ఆకట్టుకునే అవకాశం ఉంది. టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వచ్చే ఈ SUVలో హైబ్రిడ్ టెక్నాలజీ ఉంటుందా? లేదా? అన్నది ఇంకా స్పష్టత లేదు.

3.జేఎస్‌డబ్ల్యూ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ SUV

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా జూలై 16న తన తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUVని ఆవిష్కరించనుంది. ప్రపంచ మార్కెట్‌ లో ఇప్పటికే ఉన్న వులింగ్ స్టార్‌ లైట్ 560 ఆధారంగా ఈ మోడల్ రూపొందుతున్నట్లు సమాచారం. పెట్రోల్ ఇంజన్‌ తో పాటు ఎలక్ట్రిక్ డ్రైవింగ్ సిస్టమ్‌ ను ఇందులో అందించే అవకాశం ఉంది.

4.బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్

Advertisement

మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ జూలై 23న విడుదల కానుంది. కొత్త ఫ్రంట్, రియర్ డిజైన్, కొత్త అల్లాయ్ వీల్స్, పెద్ద టచ్‌ స్క్రీన్, అండర్‌ బాడీ CNG ట్యాంక్ వంటి మార్పులతో అందుబాటులోకి రానుంది. 1.5 లీటర్ పెట్రోల్, CNG ఇంజన్ ఆప్షన్లు యథాతథంగా కొనసాగనున్నాయి.

5.టయోటా హిలక్స్ పికప్ ట్రక్‌

టయోటా కూడా న్యూ జెనరేషన్ హిలక్స్ పికప్ ట్రక్‌ ను ఈ నెలలో మార్కెట్‌ లోకి తీసుకురానుంది. కొత్త డిజైన్, మరింత అత్యాధునిక క్యాబిన్, అదనపు ఫీచర్లతో ఈ మోడల్ రానుంది. 2.8 లీటర్ డీజిల్ ఇంజన్‌తో పాటు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ఆప్షన్స్ కొనసాగే అవకాశం ఉంది.

6.స్కోడా కోడియాక్ RS

స్కోడా కోడియాక్ RS కూడా జూలైలోనే విడుదల కానుంది. ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ నుంచి 265PS పవర్ లభించనుంది. 7 స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో పాటు RSకు ప్రత్యేకమైన స్పోర్టీ డిజైన్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

7.హోండా ZR-V హైబ్రిడ్‌

హోండా ZR-V హైబ్రిడ్‌ ను కూడా భారత మార్కెట్‌ లోకి తీసుకురానుంది. ఈ ప్రీమియం SUV పూర్తిగా దిగుమతి రూపంలో రానుంది. బలమైన హైబ్రిడ్ పవర్‌ ట్రెయిన్, లెవెల్-2 ADAS, అత్యాధునిక భద్రతా ఫీచర్లతో ఇది ఎలివేట్ కంటే పై స్థాయిలో ఉండే మోడల్‌గా నిలవనుంది.

8.ఆడి A6 ఇ-ట్రాన్

ఇక నెలాఖరులో ఆడి A6 ఇ-ట్రాన్ కూడా భారత్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. PPE ప్లాట్‌ ఫారమ్‌పై రూపొందిన ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్‌లో 100kWh బ్యాటరీ ప్యాక్ ఉండనుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 756 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉండొచ్చని తెలుస్తోంది.

Read Also: టాటా EVలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.3.35 లక్షల డిస్కౌంట్!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×